మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ నిర్మాణాత్మక చర్చ జరుగుతుంది అనుకున్నాను గానీ… పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు… లైట్ తీసుకున్నారు… ఈ ఫోటో ఏమిటంటే… స్టాలిన్ డీఎంకే పార్లమెంటరీ పార్టీ ఆఫీసు ఓపెన్ చేశాడు, సోనియా ముఖ్య అతిథిగా వచ్చింది… చాలామంది ఎంపీలను పిలిచినట్టున్నారు… కానీ కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణిస్తున్న ఎంపీలే పలువురు వచ్చారు…
వచ్చినవారిలో గల్లా జయదేవ్ సహా ఇద్దరు టీడీపీ ఎంపీలున్నారు… అదీ ఆసక్తికరంగా ఉన్నది… ఎందుకంటే..? మళ్లీ చంద్రబాబు కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నాడా..? ఈ ప్రశ్నకు తావిచ్చే ఫోటో అది… చంద్రబాబుకు తెలియకుండా ఆ ఎంపీలు వెళ్లే చాన్సే లేదు… వెళ్లమని అనుమతించాడు అంటే కాంగ్రెస్ కూటమి వైపు మళ్లీ మొగ్గుతున్నాడా..? ఇక బీజేపీ మీద ఆశలు వదిలేసుకున్నాడా..? ఇదీ ప్రశ్న…
Ads
నిజానికి గత ఎన్నికల ముందు చంద్రబాబు ఓ బ్లండర్ చేశాడు… బీజేపీ డౌన్ అయిపోయిందని తప్పుడు అంచనా వేసుకున్నాడు… అందుకే మోడీని టార్గెట్ చేసి నానా తిట్లూ తిట్టాడు… మమత కూడా అంతగా దూషించలేదేమో బహుశా… కాంగ్రెస్‌కు వందల కోట్ల డబ్బులిచ్చాడనీ బీజేపీ డౌట్… తీరా చూస్తే బీజేపీకి స్పష్టమైన మెజారిటీ… చంద్రబాబు మనసులో భయం…
ఇటు జగన్, అటు మోడీ, మధ్యలో కేసీయార్… తనను ఇబ్బంది పెట్టడం ఖాయమనుకున్నాడు… అలవాటే కదా… వెంటనే మోడీ ప్రాపకం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు… ఎహెఫో అని మోడీ తిరస్కరించి, ఈరోజుకూ చంద్రబాబు మొహం చూడలేదు… ఒకవైపు బీజేపీ వ్యతిరేక కూటముల మీద దేశమంతా చర్చ జరుగుతోంది… కాంగ్రెస్ లేని కూటమి, కాంగ్రెస్ ఉన్న కూటమి అని మళ్లీ రెండు వేర్వేరు ప్రతిపాదనలు…
ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఎంపీలు సోనియా పాల్గొన్న ఈ స్టాలిన్ కార్యక్రమానికి హాజరు కావడం కాస్త ఇంట్రస్టింగ్… నిజమేనా..? యూపీఏలో చేరతాడా..? ఈ ప్రశ్నకు సమాధానం… లేదు..! కారణాలు :: 1) యూపీఏలో చేరితే మోడీషాకు మరింత శత్రువు అవుతాడు… 2) వచ్చే ఎన్నికల్లో యూపీఏ అవకాశాలు ఏమంత బాగా కనిపించడం లేదు… 3) కాంగ్రెస్ అంతర్గత సమస్యలు, నాయకత్వ లోపంతో సఫర్ అవుతోంది… 4) ఈ స్థితిలో ఎటో ఒకవైపు ఉండటం శ్రేయోదాయకం కాదు… 5) ఎన్డీయే, యూపీయేలకు సమదూరంలో ఉండటమే ప్రస్తుతానికి మంచిది…
అసలు రాష్ట్రంలో ఎదురవుతున్న సవాళ్లకు ఎదురీదడమే చంద్రబాబుకు కష్టం అవుతోంది… లోకేష్ మీద కేడర్‌కు నమ్మకం పోతోంది… చంద్రబాబుకు వయస్సు మీద పడుతోంది… మునుపటి దూకుడు కనిపించడం లేదు… ఎన్నికలు సమీపించేకొద్దీ జగన్ దాడులు ఇంకా పెరుగుతయ్… ఈ స్థితిలో రాష్ట్రంలో పోరాటమే చంద్రబాబుకు పెద్ద టాస్క్ కాబోతోంది… ఇక జాతీయ రాజకీయాలపై కాన్సంట్రేట్ చేసే సీన్ లేదు ప్రస్తుతానికి…
అప్పుడు పలు కంట్రాక్టుల నుంచి డబ్బులు పుష్కలంగా వచ్చినయ్ కాబట్టి కాంగ్రెస్‌కు అడ్జస్ట్ చేశాడు, కానీ ఇప్పుడు టీడీపీ ఫైనాన్షియల్ పిల్లర్లను మోడీ, జగన్ బాగా డిస్టర్బ్ చేశారు ఇప్పటికే… డబ్బు ఫ్లో మునుపటిలాగా వీజీ కాదు… ఎన్నికలయ్యాక, రిజల్ట్‌ను బట్టి చూసుకోవచ్చులే అనేదే ప్రస్తుతానికి అనుసరణీయం… ఇక గల్లా జయదేవ్‌కు స్టాలిన్‌తో పర్సనల్ రిలేషన్స్ ఉన్నయ్… జగన్ ఇలాగే వేధిస్తే తమ బ్యాటరీల యూనిట్‌ను తమిళనాడుకు తరలించాలని కూడా ఓ దశలో అనుకున్నాడు… సో, ఈ ఫోటో కొత్త సమీకరణాలను, పాత బంధాల పునరుద్ధరణను ఏమీ సూచించడం లేదు…!!
Share this Article