Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హవ్వ… సమంతా, ఈ టీషర్ట్ నిజమేనా..? పోనీ, ఆంధ్రజ్యోతి సార్, మీరైనా చెప్పండి…

February 5, 2022 by M S R

సోషల్ మీడియా అంటేనే మాగ్జిమం ఫేక్ ఫోటోలు, ఫేక్ న్యూస్, ఫేక్ ఖాతాలు… మరీ పీకే వైరస్ ప్రబలిన తరువాత ఇది విపరీతంగా వ్యాపించింది… ఇంటింటికీ ఒమిక్రాన్ తరహాలో ఎటుచూసినా సోషల్ మీడియాకు కూడా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు… హఠాత్తుగా ఆంధ్రజ్యోతి సైటులో ఓ వార్త కనిపించింది… అసలే ఇది సోషల్ మీడియాను అనుసరిస్తూ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఏదిపడితే అది రాసేస్తున్న దుర్దినాలు కదా… డౌటొచ్చింది…

తను ఏం రాశాడంటే… ‘‘సమంత టీ షర్ట్ మీద పదాలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు… పెళ్లి పెటాకులయ్యాక మరీ ఎంజాయ్ చేస్తోంది… హవ్వ, ఈ టీ షర్ట్ చూశారా’’ అన్నట్టుగా ఏదేదో రాసిపడేశారు… సరే, ఆంధ్రజ్యోతి అంటేనే మనకు ఆ న్యూస్ మీద కాస్త అంచనా ఉంటుంది కదా… ఇదేమిటి ఈ ఫోటో మీద పదాలు మరీ చిల్లరగా, సమంత స్థాయికి తగినట్టు లేవు… అఫ్‌కోర్స్, పెళ్లి పెటాకులయ్యాక కాస్త ఆమె ఫ్రీడం పెద్ద రెక్కలు కట్టుకున్న మాట నిజమే గానీ, మరీ ఈ స్థాయికి పడిపోతుందా అనేది డౌట్…

Ads

డెస్క్ టాప్ మీద ఈ లింక్ ఓపెన్ చేస్తే 404 ఎర్రర్, అసలు ఈ వార్తే లేదు ఫోవోయ్ అని కనిపిస్తుంది కొన్నిసార్లు… అదే ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఓపెన్ చేస్తే ఆ స్టోరీ కనిపిస్తోంది… ఆ సైటులోకి వెళ్లి చూస్తేనేమో దొరకదు… అంతా ఓ గందరగోళం…

https://www.andhrajyothy.com/amp/telugunews/samantha-wearing-t-shirt-creates-sensation-kbk-mrgs-chitrajyothy-1922020404553741

అయితే నిజంగా ఈ చిల్లర పదాలతో సమంత టీషర్ట్ వేసుకుందా… అంతటి అక్కినేని ఫ్యామిలీని వీడితే మాత్రం… మరీ ఊ అంటావా, ఊఊ అంటావా అని ఊపుళ్లు పాటలో నర్తిస్తే మాత్రం… ఈ స్థాయికి పడిపోతుందా అనే డౌట్‌తో ఆమె సోషల్ మీడియా ఖాతాలు చెక్ చేస్తే… ఇన్‌స్టాలో ఆ ఫోటో, వీడియో కనిపించలేదు… ఫేస్‌బుక్ పేజీలో ఈ ఫోటో, వీడియో లేదు… ట్విట్టర్‌లోనూ లేదు… మరి ఈ ఫోటో ఆంధ్రజ్యోతికి ఎక్కడ దొరికినట్టు..? ఫేకా..? ఫేక్ అయితే నిర్ధారణ లేకుండా ఓ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలా వార్తను కుమ్మేయొచ్చా…? ఏమోలెండి… అదసలే ఆంధ్రజ్యోతి..! సార్, నిజంగానే ఈ టీషర్ట్ నిజమైందేనా..?! ష్, ఈ టీషర్ట్ ఫోటో ఎక్కడ దొరికింది సార్… మనలోమనమాట…!!

Update :: ఒక వీడియోలో ఇలాగే కనిపిస్తోంది… హమ్మ సమంతా… https://www.youtube.com/watch?v=eIZaMPwcE_g  జ్యోతి వార్త నిజమే అనిపిస్తోంది, అవును సమంతా, మరీ ఈ రేంజ్‌కు పడిపోవడం అవసరమా..?! ష్… ఈ ఫోటో కింద పెళ్లిళ్ల బ్యూరో యాడ్ మాత్రం నిజంగా నవ్వొచ్చింది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions