Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిలబడింది, భేష్… కానీ కాఫీడేను నిలబెట్టిందా..? నాణేేనికి ఇది మరో కోణం..!

September 11, 2022 by M S R

హరి క్రిష్ణ ఎం. బి………  Cafe Coffee Day…. పోయిన ఏడాది ఒకసారి, ఈ మధ్య మళ్ళీ ఒకసారి సోషల్ మీడియాలో కాఫీడే కంపెనీ అధినేత మాళవిక కంపెనీ ఆర్ధిక పరిస్థితిని పూర్తిగా మలుపుతిప్పారని రాసేశారు. అప్పులన్నీ తీర్చేస్తున్నట్టు, కంపెనీ మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అన్నట్టు చెప్తున్నారు… ఇది పాక్షిక సత్యం. సోషల్ మీడియా రాకముందు కూడా మన ప్రధాన స్రవంతి మీడియా కూడా ఇలా పాక్షిక అబద్దాలను, నిజాలను అటూ ఇటూ తిప్పేసి రాసేసి అందరినీ నమ్మించేది. స్వతహాగా శోధించి తెలుసుకునే ఓపిక, అవసరం ఎవరికీ లేక అవే నమ్మేసేవారు మెజారిటీ… ఇప్పుడు అలా లేదు… net లో తగినంత సమాచారం ఉంది… గంటపాటు కూర్చుంటే చాలా ఇన్ఫర్మేషన్ బయటకు తీయొచ్చు..

—

కాఫీ డే విషయానికి వస్తే ముందుగా నా dislclaimer … ఇక్కడ రాసేసి ఏదీ మాళవిక మీద ఉన్న గౌరవాన్ని తగ్గించడానికి కాదు… వేల కోట్లు అప్పులు ఎగ్గొట్టి ఎక్కడికో పారిపోయి కొంతమంది, ఇక్కడే ఉంటూ కూడా దర్జాగా బతికేసే ఇంకొంత మంది ఉన్నప్పుడు ఆమె కంపెనీని నడపడానికి ముందుకు రావడం నిజంగా అభినందించాలి. ఆమె రాకున్నా ఏ చట్టం, న్యాయం ఆమెను ఏమీ చేయలేవు… ఐనా ఆమె నిలబడింది… సవాల్ స్వీకరించింది…

Ads

–

కాఫీడే విషయంలో ఇంకా శోధన జరుగుతోంది.. కోర్టుల్లో నానుతోంది… ఇప్పటికి తెలిసింది ఏంటంటే…. కంపెనీని ఒక స్థాయికి తీసుకెళ్ళాక late సిద్దార్థకు చాలా మందికి కమ్మినట్లే real estate పిచ్చి పట్టిందో లేక ఇంకేదైనా అయ్యిందో తెలియదు కానీ main బిజినెస్ నుంచి వేరే కంపెనీలకు దాదాపు 3,500 కోట్లు తరలించారు… ఆ పెట్టుబడి ఫెయిల్ అయ్యింది.

అవి తిరిగిరాక ఏం చెయ్యాలో పాలుపోక, బహుశా అవమానం కూడా జరుగుతుంది అని కావొచ్చు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు… కానీ పూర్తిగా మునిగిపోలేదు… సరైన చేతిలో కంపెనీని పెట్టి ఉంటే కొంచెం లేటుగా అయినా నిలబడేది.. ఇప్పుడు మాత్రం కష్టం.. పూర్తిగా మూసుకుపోవడానికి ఇంకొంచెం టైం అంతే…

(అమాంతం పైస్థాయికి వెళ్లాలంటే ఒక్క నిర్ణయం వల్ల వెళ్లలేకపోవచ్చు, కానీ కొన్ని జీవితాలు తలకిందులు కావాలంటే ఒక్క నిర్ణయం చాలేమో.)

—

ఆయన చనిపోయిన (జూన్ 2019) ఈ మూడేళ్ళలో కంపెనీ ఆర్ధిక పరిస్థితి చూస్తే… ఈ నంబర్స్ చూస్తే తెలిసిపోతుంది ఆ కంపెనీ ఆర్ధిక పరిస్థితి…


కెఫెలు

March 2019 – 1,752

March 2020 – 1,192

March 2021 – 572

March 2022 – 495


కెఫె లు ఉన్న నగరాలు

March 2019 – 243

March 2020 – 208

March 2021 – 165

March 2022 – 158


వెండింగ్ మెషిన్

March 2019 – 56,799

March 2020 – 58,697

March 2021 – 36,326

March 2022 – 38,810


ఆదాయం (కోట్లలో)

March 2019 – 3,569

March 2020 – 2,552

March 2021 – 853

March 2022 – 582


లాభం/నష్టం.. (tax కి ముందు) (కోట్లలో)

March 2019 – 187 (లాభం)

March 2020 – 701 (లాభం)

March 2021 – (798) (నష్టం)

March 2022 – (128) (నష్టం)

Business తగ్గుతోంది… అది క్లియర్ గా కనపడుతోంది..

—


స్థిర ఆస్తులు (కోట్లలో)

March 2019 – 3,097

March 2020 – 3,627

March 2021 – 939

March 2022 – 776


దీర్ఘకాలిక అప్పులు (కోట్లలో)

March 2019 – 2,769

March 2020 – 1,901

March 2021 – 524

March 2022 – 278


స్వల్పకాలిక అప్పులు (కోట్లలో)

March 2019 – 2,036

March 2020 – 2,189

March 2021 – 1,894

March 2022 – 1,762

—

దొరికిన ప్రతిచోటా అప్పు చేసారు… ఆస్తులు అమ్మేసి అప్పులు తీర్చారు… వ్యాపారం తగ్గుతోంది… నష్టాలు వస్తున్నాయి… మెల్లమెల్లగా మూతపడొచ్చు… తక్కువ రేట్ కి ఎవరైనా కొనచ్చు.. ఇక్కడ మాళవిక చేస్తోంది ఏమైనా ఉందంటే ఇదే… అప్పులు అన్నీ తీర్చేసి, కోర్టు కేసుల్లోంచి బయటపడితే కంపెనీని ఎవరైనా wholesale గా కొనడానికి అయినా చాన్స్ ఉంటుంది… అప్పులు, వడ్డీలు కట్టడానికి మూన్నెళ్లకు ఒకసారి, ఇప్పటికీ కంపెనీలో cash లేదు… defaults అవుతూనే ఉన్నాయి…

—

అప్పులు ఇచ్చిన వాళ్లకు ముందు ఆస్తులు పోతాయి… మరి invest చేసిన వాళ్లకు… అంటే share లు కొన్నవారికి? దాదాపు 4,000 కోట్లు… అందులో కనీసం 50% పైగా మనలాంటి సాధారణ ఇన్వెస్టర్స్… ఎవడి డబ్బు ఎవరు గాలికి విసిరేస్తున్నారు… share market లో పెట్టుబడి పెట్టే సగం మందికి ఒక కంపెనీ ఫైనాన్సియల్స్ ని చదివి అర్థం చేసుకోవడం కూడా రాదు.

—

disclaimer – ఇండియాలో ఒక బిజినెస్ నడపడం, అదీ ఏళ్లకు ఏళ్ళు successful గా నడపడం చాలా కష్టం. గ్రే ఏరియాలో వెళ్లకుండా అసలే కుదరదు.. కానీ అది కొంచెం అయినా ఎథికల్ గా ఉన్నంతవరకూ పర్లేదు… కనీసం నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్ళను నిండా ముంచకుంటే చాలు… (ఇది నాణేనికి మరోకోణం… రచయిత వ్యక్తిగత అధ్యయనం, అవగాహన, అంచనాలు, అభిప్రాయాల ఆధారిత కథనం…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions