విరాటపర్వం సినిమా చేయకుండా ఉంటే బాగుండేది అని రానా బాగా అసంతృప్తిగా ఉన్నాడా..? ఛస్, ఇక ఇలాంటి సినిమాల్ని చస్తే చేయకూడదు అని నిశ్చయించుకున్నాడా..? నిజమే అనిపిస్తోంది నిన్న ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో తను మాట్లాడిన మాటల్ని బట్టి ఆలోచిస్తే…!! ఒక్కసారి కాస్త వెనక్కి వెళ్దాం… 1945 అనే సినిమా… బర్మా బ్యాక్ గ్రౌండ్‌లో ఓ యువకుడు బ్రిటిషర్లపై సాగించే స్వతంత్ర పోరాటం… నిజానికి మంచి కథ… కానీ ఏమైంది..?
నిర్మాతతో రానాకు ఏదో విషయంలో డిఫరెన్సెస్ వచ్చినయ్… సినిమా ఆగిపోయింది… నిర్మాత ఆ అన్‌ఫినిష్డ్ సరుకును అలాగే మార్కెట్‌లోకి వదిలాడు… తెలుగు, తమిళ ప్రేక్షకులు హౌలాగాళ్లు అనుకున్నట్టున్నాడు… ప్రేక్షకుడు తంతే బాక్సులు నిర్మాత పెరట్లో పడ్డయ్… ఒక్కసారి కూడా రానా ఆ సినిమా ప్రమోషన్‌కు రాలేదు… తన సినిమాల సెలక్షన్, కథల ఎంపిక, బ్యానర్లు అంత దరిద్రంగా ఉన్నాయని చెప్పడానికి ఓ ఉదాహరణ…
అప్పట్లో కృష్ణం వందే జగద్గురుం… తరువాత ఘాజి… మధ్యలో ఏవేవో పిచ్చి కథలు, పిచ్చి సినిమాలు… బాహుబలి మాత్రమే తన కెరీర్‌లో సరైన ఎంపిక… తనను స్టార్‌ను చేసింది… పోనీ, అక్కడి నుంచైనా సరిగ్గా ప్లాన్ చేసుకున్నాడా అంటే అదీ లేదు… ఆ అరణ్య తనకు సూటయ్యే పాత్రేనా అసలు..? బీమ్లానాయక్‌లో హీరో ఎలాగూ కాదు, విలనో, సెకండ్ హీరోనో తెలియదు… విరాటపర్వంలో తను హీరో కాదు, విలన్ కాదు… జస్ట్, ఓ ముఖ్యపాత్ర… అది ఐదుగురు మహిళానటుల సినిమా… మరి రానా..?
Ads
ఇప్పటికీ అంతే… 150, 200 కోట్ల ఖర్చు అనుకున్న హిరణ్యకశ్యప ఆగిపోయినట్టే… వెంకటేష్‌తో కలిసి నటించిన రానా నాయడు అనే ఓ వెబ్ సీరీస్ నడుస్తోంది… ఒకవైపు తనకు ఈక్వల్‌గా చేసిన ప్రభాస్ ఎక్కడికో వెళ్లిపోతే రానా సిట్యుయేషన్ మాత్రం ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోయాడు… నిజానికి తనకు ఏం తక్కువ..? బలమైన బ్యాక్ డ్రాప్ ఉన్నవాడే కదా… ఏదో తమ సినిమా కాబట్టి విరాటపర్వానికి ప్రమోషన్ వర్క్ చేస్తున్నాడు… కానీ మనసులో హేపీగా లేడు… ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో ఏమంటాడంటే..?
‘‘ఎన్నాళ్లు ఈ సినిమాలు అని ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు… ఇక చేయను ఇలాంటివి… ఇదే చివరిది… ఇకపై కమర్షియల్ ఫార్మాట్‌లో కుమ్మేద్దాం…’’ అంటే తన కెరీర్ ఎటువైపు పోతున్నదో సోయి కలిగిందన్నమాట… కొన్ని మైనసులున్నయ తనకు… డాన్సులు, కాలేజీ ప్రేమలు, టీనేజీ లవ్వులు తనకు సూట్ కావు… ఇంటెన్స్ ఉన్న కథలు కావాలి… లేవా..? దొరకడం లేదా..? తను రెడీగా ఉండాలే గానీ బోలెడు కథలు దొరుకుతాయి… ఇంకా ఈ అరణ్యలు, 1945లు, విరాటపర్వాల వెంట పరుగులు దేనికి రానా..? అవి చేయడానికి చాలామంది ఉన్నారు… నీ జానర్లు కావు అవి… ఉదాహరణ అంటావా..? జస్ట్ లుక్ ఎట్ మేజర్… నీకు సరైన పాత్ర అది…!!
Share this Article