Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పవన్ కల్యాణ్… ఓ యుద్ధ ఖడ్గం… ఓ బిరుదు ప్రదానం… ఓ క్లారిటీ..!!

January 13, 2026 by M S R

.

నిన్నంతా పవన్ కల్యాణ్ మీద సోషల్ మీడియాలో రకరకాల చెణుకులతో ఓ ప్రచారం సాగింది… తనకు ఓ ప్రతిష్టాత్మక మార్షల్ ఆర్ట్స్ సంస్థ కెంజుట్సూ విద్యలో ఫిఫ్త్ డాన్ ప్రదానం చేయడమే కాదు, ఓ కటానా (ఖడ్గం)తో పాటు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదునూ ఇచ్చింది… ఇదీ సందర్భం…

నిన్న దాదాపు ప్రతి మీడియా ఈ వార్తను కవర్ చేసింది… పొగిడింది… కానీ సోషల్ మీడియాలో మాత్రం ‘‘ఆమధ్య తిరుపతి మెట్లు ఎక్కుతూ తెగ ఆయాసపడిపోయిన పవన్ కల్యాణ్ హఠాత్తుగా అంత ఫిట్‌నెస్ సాధించాడా..?’’ అని ఆశ్చర్యార్థకం పోస్టులు, ఆయాసం ఫోటోలు కూడా పెట్టారు… నిజం చెప్పాలంటే, చాలామందికి అనిపించిన భావన అదే…

Ads

అన్నింటికన్నా ముఖ్యంగా హైదరాబాద్, ఆగాపురలో ఉండే ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహమూదీ తనకు ఈ బిరుదు, ఖడ్గం, ఫిఫ్త్ డాన్ ప్రదానం చేయడం… తనకు మంత్రాలు, చేతబడులకు విరుగుడు విద్య తెలుసు అన్నట్టు ప్రొఫైల్ చూసి… దాని ఆధారంగా పవన్ కల్యాణ్‌పై చెణుకులు విసిరారు చాలామంది…

  • అసలు ఏమిటి ఈ కెంజెట్సూ..? కరాటేకూ దానికీ తేడా ఏమిటి..? అసలు ఈ యుద్ధ విద్యల్లో బిరుదుల ప్రదానం ఉంటుందా..? పవన్ కల్యాణ్‌కు ఈ ప్రదానాలు చేసిన సంస్థకు విశ్వసనీయత ఉందా..? జపాన్‌లోని ప్రసిద్ధ శిక్షణ సంస్థకు ఈ పాతబస్తీ సెంటర్ అనుబంధ సంస్థేనా..? ఇలాంటి డౌట్లు బోలెడు… పదండి వివరాల్లోకి వెళ్దాం…


pk

1. ఈ పాత బస్తీ స్కూల్ కథేమిటి..?  సుదీర్ఘ చరిత్ర, అనుభవం… హైదరాబాద్‌లోని “గోల్డెన్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్” కేవలం ఈరోజుదో నిన్నటిదో కాదు… ఇది దాదాపు 40 ఏళ్లకు పైగా (సుమారు 1980ల నుండి) కార్యకలాపాలు నిర్వహిస్తోంది… పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రాకముందే, తన యవ్వనంలో ఇక్కడే శిక్షణ పొందాడు… ఒక సంస్థ దశాబ్దాల పాటు ఒకే రంగంలో కొనసాగుతోంది అంటే దానికి ప్రాథమిక విశ్వసనీయత ఉన్నట్లే లెక్క…

2. ఎవరు ఈ సిద్దిక్..?  షిహాన్ హుస్సేనీ (Shihan Hussaini) నేతృత్వంలోని ఈ సంస్థకు ప్రధాన సూత్రధారి హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహమూదీ (Shihan Hussaini)… ఆయన మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి…

3. ఈ మంత్రతంత్రాలు, చేతబడి విరుగుడులు..? ఆయనకు అక్యుపంక్చర్, అరోమాథెరపీ, చిరోప్రాక్టర్, ఫిజియోథెరపీ విద్యలు మాత్రమే కాదు, కేవలం కరాటే మాత్రమే కాదు… ఆర్చరీ (విలువిద్య) లో కూడా ఆయన నిపుణుడు… ఆయన శిక్షణ పొందిన వారు చాలా మంది ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ కోచ్‌లుగా స్థిరపడ్డారు… కాబట్టి, శిక్షణ పరంగా ఇది అత్యంత నమ్మదగిన సంస్థగా పరిగణించబడుతుంది… పవన్ కల్యాణ్‌కు యవ్వనంలో గురువు…

3. అంతర్జాతీయ అనుబంధం (Affiliation)… ఈ సంస్థ కేవలం స్థానికంగానే కాకుండా, జపాన్‌కు చెందిన ‘Sogo Budo Kanri Kai’ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలతో అనుబంధం కలిగి ఉంది… పవన్ కల్యాణ్‌కు తాజాగా లభించిన 5th Dan (ఫిఫ్త్ డాన్) గుర్తింపు కూడా ఈ అంతర్జాతీయ సహకారంతోనే లభించింది…

4. శిక్షణ నాణ్యత: ప్రాచీన యుద్ధ విద్యలను, ముఖ్యంగా జపనీస్ యుద్ధ విద్య సంప్రదాయాలను (Kenjutsu వంటివి) అనుసరించడంలో ఈ సంస్థకు మంచి పేరుంది… గూగుల్, జస్ట్ డయల్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో దీనికి మంచి రేటింగ్స్ (4.7/5) ఉన్నాయి…

pawan kalyan

అసలు కెంజుట్సూకు కరాటేకు తేడా ఏమిటి..? 

1. కెంజుట్సూ (Kenjutsu): ఇది “ఖడ్గ విద్య”… అర్థం…: ‘కెం’ అంటే ఖడ్గం (Sword), ‘జుట్సూ’ అంటే విద్య లేదా కళ… అంటే ఇది పూర్తిగా కత్తితో చేసే యుద్ధ విద్య… ఇది జపాన్‌లోని ప్రాచీన సమురాయ్ (Samurai) యోధులు యుద్ధ రంగంలో శత్రువులను ఎదుర్కోవడానికి ఉపయోగించే విద్య… ఇందులో ప్రధానంగా కటానా (Katana) అనే జపనీస్ ఖడ్గాన్ని వాడతారు… ఇది కరాటేలో భాగం కాదు… ఇది ఒక ప్రత్యేకమైన, స్వతంత్రమైన యుద్ధ కళ…

2. కరాటే (Karate): ఇది “ఖాళీ చేతుల విద్య”… ‘కరా’ అంటే ఖాళీ (Empty), ‘టే’ అంటే చెయ్యి (Hand)… అంటే చేతిలో ఎటువంటి ఆయుధం లేకుండా కేవలం శరీర భాగాలతో (గుద్దులు, తన్నులు) చేసే యుద్ధ విద్య… జపాన్‌లోని ఒకినావా దీవుల్లో పుట్టింది… సామాన్య ప్రజలు ఆయుధాలు లేనప్పుడు తమను తాము రక్షించుకోవడానికి దీనిని అభివృద్ధి చేశారు… కరాటేలో ఆయుధాలు ఉండవు (ఒకవేళ ఆయుధాలు వాడితే దానిని ‘కోబుడో’ అంటారు)…

sogo budo

రెండింటికీ సంబంధం ఎక్కడ?

నిజానికి ఈ రెండు విద్యలు వేరైనప్పటికీ, కొన్ని మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ (ముఖ్యంగా గోల్డెన్ డ్రాగన్ వంటివి) రెండింటినీ నేర్పిస్తాయి… దీనిని ‘సోగో బుడో’ (Sogo Budo) అంటారు, అంటే అన్ని రకాల యుద్ధ విద్యల సమాహారం…

పవన్ కల్యాణ్‌కు కరాటేలో ‘బ్లాక్ బెల్ట్’ ఉంది, అలాగే ఆయన కెంజుట్సూ (కటానా వాడకం) లో కూడా శిక్షణ తీసుకున్నాడు… అందుకే ఆయనకు గౌరవ సూచకంగా ఆ ఖడ్గాన్ని బహూకరించారు…

హరి హర వీరమల్లు, OG సినిమాల కోసం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ‘కటానా’ యుద్ధ విద్యలో శిక్షణ తీసుకున్నాడు…

ఈ స్కూళ్లు బిరుదులు కూడా ఇస్తాయా..? ఇప్పుడు ఫిఫ్త్ డాన్ ఇవ్వడం ఏమిటి..? మార్షల్ ఆర్ట్స్‌లో ‘ఫిఫ్త్ డాన్’ అనేది కేవలం శారీరక దృఢత్వం మీద మాత్రమే కాదు, ఆ విద్య పట్ల ఉన్న అవగాహన, అనుభవం మీద కూడా ఇస్తారు… ఆ విద్యలో చూపిన ప్రతిభకు, దానికి వారు చేస్తున్న ప్రచారానికి గుర్తింపుగా గురువులు ఇలాంటి బిరుదులు ఇవ్వడం మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో కొత్తేమీ కాదు… ఇది సంస్థాగతమైన నియమం కంటే, గౌరవ సూచకంగా ఇచ్చేది…

(ఇదంతా పలు ఎఐ ప్లాట్‌ఫారాలు, గూగుల్ పేజీలు వడబోసిన తరువాత తేలిన సారాంశం... ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాడా, ఈ విద్యలు నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నాడా అనేవి కాదు... ఫిఫ్త్ డాన్, కటానా, బిరుదు ప్రదానాలు ప్రస్తుతం గౌరవ పురస్కారాలు మాత్రమే..)

.

అలాగే తన తెలంగాణ పక్కా వ్యతిరేకత, అవకాశవాద దిష్టి సిద్దాంతాలూ వేరు, మార్షల్ ఆర్ట్స్ మీద తన ప్రేమ వేరు... రెంటినీ కలపాల్సిన అవసరం లేదు...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పవన్ కల్యాణ్… ఓ యుద్ధ ఖడ్గం… ఓ బిరుదు ప్రదానం… ఓ క్లారిటీ..!!
  • హఠావో లుంగీ- బజావో పుంగీ..! వీళ్లు వారసులా..? విద్వేష వైరసులా..?!
  • మళ్లీ ఓ చిరంజీవి రెట్రో లుక్కు… జోడీగా ఇదే నయనతార… ఏమిటది..?!
  • హైడ్రోజన్ రైల్..! ఈ పైలట్ రన్స్ గనుక సక్సెసైతే… రవాణా విప్లవమే..!!
  • ‘‘తెలంగాణ వ్యతిరేకులతో కలిసొస్తాం.., కాస్త కరుణించి వోట్లేయండి ప్లీజ్..!!
  • జూ..లకటక..! మతాంతర పెళ్లిళ్ల సినిమా కథలు అందరూ తీయలేరు..!!
  • అమెరికా మైక్రోవేవ్, సోనిక్ వెపన్స్ వాడిందా..? అసలు అవేమిటో తెలుసా..?!
  • హై-ప్రొఫైల్ వ్యక్తులో బోల్తాపడుతున్నారు – జేడీ లక్ష్మినారాయణ ఎంత..?!
  • పండుగ వాసనల్లేని… రెండు ముదురు బెండకాయల సంక్రాంతి షో..!!
  • అనిల్ రావిపూడి ‘మన శివశంకర ప్రసాద్ గారిని’ పాస్ చేసేశాడు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions