Jagan Rao…… రెడ్ వైన్ తాగితే ఎంతవరకు ప్రయోజనకరం..? రెడ్ వైన్ లో “రెస్వరట్రాల్” అనే ఫైటో కెమికల్ ఉంటుంది. ఇది శరీరానికి చాలా మంచిది. యాంటీ ఇన్ ఫ్లమేషన్ మరియూ యాంటీ ఏజింగ్, యాంటీ యాక్సిడెంట్ గా పనిచేస్తుంది “రెస్వరట్రాల్”.
అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది, రోజుకి 1000 రెడ్ వైన్ బాటిల్స్ తాగినప్పుడు మాత్రమే మన శరీరానికి తగినంత రెస్వరట్రాల్ లభిస్తుంది. రోజుకి మన లివర్ 350 ML ఆల్కహాల్ మాత్రమే క్లీన్ చేయగలదు. అంతకంటే ఎక్కువ అత్యంత ప్రమాదకరం మరియూ ప్రపంచంలో ఏ ఒక్కరూ 1000 రెడ్ వైన్ బాటిల్స్ ఒక్క రోజులో తాగలేరు కాబట్టి రెడ్ వైన్ వలన రెస్వరట్రాల్ మన శరీరానికి వస్తుంది/ మంచి చేస్తుంది అనేది తప్పు.
ఫ్రెంచ్ పారడాక్స్ అని, జడ్జ్ మెంట్ ఆఫ్ ప్యారిస్ అని 1970 ఆ ప్రాంతం నుంచి ప్రారంభమయ్యింది. రెడ్ వైన్ తాగితే ఆరోగ్యానికి మంచిది అని ఫ్రాన్స్ నుంచి మొదలు అయ్యింది. నిజానికి వైన్ కంపనీలు తమ రెడ్ వైన్ వ్యాపారాలు పెంచుకోటానికి వేసిన ఎత్తుగడ ఇది. ప్రపంచంలో ఈ విషయం మీద జరిగిన ఏ స్టడీ కూడా రెడ్ వైన్ మంచిది అని కానీ గుండె జబ్బులని తగ్గిస్తుంది అని కానీ నిరూపణ చేయలేదు. అమెరికన్ హార్ట్ అసోషియేషన్ కానీ, యూరోపియన్ హార్ట్ అసోషియేషన్ కానీ ప్రపంచంలోని ఏ ఇతర సంస్థ కానీ రెడ్ వైన్ శరీరానికి మంచిది అని చెప్పి తాగమని ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదు.
Ads
అయితే ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది. రెడ్ వైన్ లో లిపిడ్స్ ని రెగ్యులేట్ చేసే గుణం ఉన్న మాట వాస్తవం. రెడ్ వైన్ లో యాంటీ ఇన్ ఫ్లమేషన్ , యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న మాట వాస్తవం. అయితే కొన్ని వందల ఆకుకూరలు, వెజటబుల్స్ లో ఆ లక్షణాలు ఉన్నై. రెడ్ వైన్ తాగితే BP పెరుగుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది, శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. నిజానికి రెడ్ వైన్ వలన గుండె జబ్బులు వస్తాయి. ప్రయోజనకరమైనది 0.1 శాతం ఉంటే హానికరమైనవి 99.9% ఉంది.
రెడ్ వైన్ తాగితే శరీరానికి మంచి రంగు వస్తుంది అనేది పూర్తి గా పచ్చి అబద్ధం. కారణం రెడ్ వైన్ లో ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉంటుంది. మనం ఆల్కహాల్ తాగినప్పుడు అది శరీరంలోని లివర్ లోకి వెళ్ళినప్పుడు ఎసిటాల్డిహైడ్ గా మారుతుంది. అప్పుడు హిస్టమిన్ అనే కెమికల్ రిలీజ్ అయ్యి ఎలర్జీ వచ్చి శరీరం మంచి రంగు వచ్చినట్లు తాత్కాలికం గా కనిపిస్తుంది కానీ అది నిజానికి చర్మానికి ఒక రోగం (ఎలర్జీ అది, మంచి రంగు కాదు).
వైన్ తాగితే మంచి నిద్ర పడుతుంది అందుకే కొద్ది మోతాదులో తాగుతాం అనేది వాళ్ళని వాళ్ళు మోసం చేసుకునే ప్రక్రియ. నిద్రని రాపిడ్ ఐ మూవ్ మెంట్ లల్లో కొలుస్తారు ( REM అంటారు). సాధారణం గా నిద్ర పోయినప్పుడు 6-7 REM సైకిల్స్ ఉంటాయి. వైన్ లేదా ఆల్కహాల్ తాగినప్పుడు ఆ సైకిల్స్ పూర్తిగా తగ్గిపోయి 1-2 REM మాత్రమే ఉంటై అందుకే మంచిగా నిద్రపోయాం అని అనుకుంటారు కానీ నిజానికి అది మెదడుని మొద్దుపరచటం అంటారు, నిద్ర అనరు దాన్ని. ఆల్కహాల్ తాగితే నిద్ర వస్తుంది అనేది పచ్చి అబద్ధం (మెదడు మొద్దుబారుతుంది అనేది నిజం).
వైన్ తాగినా ఆల్కహాల్ తాగినా ఎనర్జీ వస్తుంది అనేది పచ్చి అబద్ధం. దాన్ని BP అంటారు, ఎనర్జీ అనరు. అసలు లేని వాళ్ళకి కొద్దిగా పెరిగితే చూడటానికి బాగుంటుంది తాత్కాలికంగా తాగినప్పుడు కానీ అదొక డిజార్డర్. ఫలానా రోగానికి డాక్టర్ గారే తాగమని చెప్పారు అంటే ఆయా పేషెంట్ మానసిక స్థితిని బట్టి చెప్పి ఉంటారు కానీ డాక్టర్స్ కి క్లియర్ గా తెలుసు చుక్క రెడ్ వైన్ తాగినా, చుక్క ఆల్కహాల్ తాగినా 99% ప్రమాదకరం అని. ఒకేసారి మానమని ఏ డాక్టర్ చెప్పరు అందుకే 30 ML తాగమని ముందు చెప్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకి మానేయమని చెప్తారు.
రెడ్ వైన్ అయినా, ఆల్కహాల్ అయినా 100 కి 100% హానికరం. బయోకెమిస్ట్రీ పరంగా మాట్లాడుకుంటే 1% మంచి లక్షణాలు ఉన్న మాట వాస్తవమే కానీ నిజానికి రెడ్ వైన్ అయినా, ఆల్కహాల్ అయినా మిగతా 99% హనికరం మరియూ ప్రమాదకరం. ధర్మరాజు లాంటోడే తాగి జూదం ఆడి పూర్తిగా సంక నాకిపోయి అరణ్య వాసం చేయాల్సి వచ్చింది, అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా, మనమెంత, మన బతుకెంత …? అందుకే తాగితే తాగండి కాని ఆల్కహాల్ తక్కువ మోతాదులో అయితే మంచిది అనే కటింగ్స్ మాత్రం వద్దు…. – పూర్తి వ్యక్తిగత అభిప్రాయం
Share this Article