.
అసలు సాయిబాబాను ఎందుకు పూజించాలి..? ఈ ప్రశ్న కొన్నాళ్లుగా హిందువుల్లోనే చిచ్చు రాజేస్తున్న సంగతి, వాదోపవాదాలు, వివాదాల సంగతి తెలిసిందే కదా… ఓ ముస్లిం పకీరును దేవుడిగా పూజించడం ఏమిటని వ్యతిరేకవాదులు, సాక్షాత్తూ దైవస్వరూపుడిని పూజిస్తే తప్పేమిటని అనుకూలవాదులు… ఎవరి వాదన వాళ్లది…
మధ్యలో గురువారాన్ని సాయివారం అంటున్నారు, గురువంటే సాయిబాబే అని తేల్చేస్తున్నారు… ఎవరో నటి చేసిన వ్యాఖ్యల మీద కేసులు కూడా పడ్డట్టున్నయ్… సాయిచరిత్ర చదవండి, నేను చెప్పేది నిజమో కాదో మీకే తెలుస్తుంది అని ఆమె ఎదురుదాడి చేస్తోంది… సరే, ఆ వాదవివాదాలు, తర్కాలు, చర్చల్లోకి ఇక్కడ పోవడం లేదు… కానీ, ఓ వార్త మాత్రం నిన్న ఇంట్రస్టింగు అనిపించింది… ఇదీ ఆ వార్త…
Ads

వార్త ఏమిటీ అంటే..? షిర్డి సాయిబాబా ముస్లిం కాదు, పక్కా బ్రాహ్మణుడు అని ఓ పెద్దమనిషి సర్టిఫికెట్ జారీ చేస్తున్నాడు… ముస్లిం కాదు, హిందువు అని చెప్పడం కాదు, బ్రాహ్మణుడు అని కులధ్రువీకరణ ప్రకటన జారీ చేయడం విచిత్రం అనిపించింది… అంతేకాదు, శివుడిని సమాన దేవుడు లేడనీ, సాయిబాబాను మించిన గురువు లేడనీ, ఇద్దరూ సమఉజ్జీలేనని తేల్చిపారేస్తున్నాడు…
అంతేకాదు, కొందరు పీఠాధిపతులు సాయిబాబాపై చేసే వ్యతిరేక వ్యాఖ్యల వెనుక కుట్రపూరిత వ్యూహాలు ఉన్నాయంటున్నాడు… చర్చకు రావాలని తాను ఎన్నిసార్లు సవాళ్లు చేసినా ఎవరూ రావడం లేదట, అందుకని 11 భాషల్లో శతప్రశ్న శరసంధానం అని ఓ పుస్తకం రాసేసి, విడుదల చేశాడట… (తనదీ ఓ ఆధ్యాత్మిక జ్ఞానపీఠమే అన్నమాట)… (తన పేరు రమణానంద మహర్షి అట, కాస్త పంచ్ ఉండేలా రమణానంద సర్వసతి మహర్షి అని పెట్టుకుంటే పవర్ ఉండేదేమో…)
అసలు శివుడికీ, సాయిబాబాకు పోలిక ఏమిటనేది ఈయన జ్ఙానానికే వదిలేద్దాం గానీ… ఇంతకీ ఎవరీయన..? భువనగిరి మండలం, నాగిరెడ్డిపల్లిలో వందల ఎకరాల్లో రమణేశ్వర ఆశ్రమం కట్టాడు… బంగారు లింగం, స్ఫటికలింగం, అరుదైన శిలల లింగాల పేరిట కొన్ని వందల శివలింగాలు ప్రతిష్ఠించాడు… మొదట్లో కాస్త జనం హడావుడి కనిపించినా, తరువాత జనం దీన్ని పట్టించుకోవడం మానేశారు, కళతప్పింది…
ఓవైపు అమ్మవారి రూపాల విగ్రహాలు… చుట్టూ కొలువు దీరిన శివలింగాల నడుమ సాయిబాబా విగ్రహాలు… అత్యంత విచిత్రంగా కనిపించే కాంబినేషన్… ఎక్కడో కర్నూలుకు చెందిన ఈయన ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమం కట్టడం ఏమిటో కూడా అర్థం కాదు… పైగా ఆయన షిర్డిలో సిద్ధిపొందాడని అక్కడి సేవికలు చెబుతుంటారు… హేమిటో… ఈ జ్ఞానపీఠాధిపతి ఆశ్రమం గురించి ఆమధ్య ‘ముచ్చట’ ప్రచురించిన కథనం ఇదుగో…
Share this Article