Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శ్రీలీల ట్రెండింగ్..! ఎటొచ్చీ సాయిపల్లవితో పోటీ పోలికే అబ్సర్డ్…!!

December 25, 2022 by M S R

హఠాత్తుగా నటి శ్రీలీల ట్రెండింగ్‌లోకి వచ్చింది… మా సినిమాకు శ్రీలీలే స్పెషల్ అట్రాక్షన్ అని నిర్మాత భలే పొగిడేస్తున్నాడు… అబ్బో, ఆ నటన, ప్రతిభ, నాట్యం అదుర్స్ అని సైట్లు రాసేస్తున్నాయి… యూట్యూబర్లు మోసేస్తున్నారు… కొన్ని సైట్లయితే ఏకంగా సాయిపల్లవికి పోటీదారు వచ్చేసిందని కితాబునిచ్చేశాయి… ఆశ్చర్యం… మనవాళ్లకు ఎవరిపై ఎందుకు అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొస్తుందో అర్థం కాదు…

నో డౌట్… తెలుగు దంపతులకు అమెరికాలో పుట్టిన శ్రీలీల మంచి అందగత్తె… బెంగుళూరులో పెరిగింది… మొదట ఏదో కన్నడ సినిమాలో చేసింది… తరువాత తెలుగు ఇండస్ట్రీ పలకరించింది… పెళ్లిసందడి సినిమా చేసింది… ఇప్పుడు ధమాకా… ఎస్, ధమాకాలో చాలా ఈజ్‌తో డాన్సులు చేసింది… చాలా ఫ్రీ మూమెంట్స్… పలుచోట్ల రవితేజ ఇబ్బందిపడ్డాడు…

ఆమె మొహం కూడా ఎక్స్‌ప్రెసివ్… కాకపోతే ధమాకాలో ఆమె పాత్రకు ప్రాధాన్యం లేదు… కాస్త సంక్లిష్టమైన పాత్ర లభిస్తే ఆమె నటన రేంజ్ ఏమిటో తేలిపోయేది… పరీక్షగా ఉండేది… కానీ ఇప్పటివరకూ ఆమెకు గ్లామర్ ఆరబోసే పాత్రలు తప్ప ఆమె చేసిన క్లిష్టమైన పాత్రలేమున్నాయి..? ఎందుకీ మోత అంటే… ఆమె అందం… దాచుకునే తరహా కూడా కాదు… ప్రత్యేకించి ధమాకాలో జింతాక పాట…

Ads

sreeleela

అయితే మరీ అతిశయోక్తి ఎక్కడంటే… సాయిపల్లవి డాన్స్‌ను శ్రీలీల డాన్స్‌తో పోల్చడం… స్టెప్పులో వ్యాంపుతనం వేరు, వయ్యారితనం వేరు… అర్థమైంది కదా… కాకపోతే సాయిపల్లవికన్నా శ్రీలీల గ్లామర్ రేంజ్ ఎక్కువ… కానీ ఒక్కసారి జింతాక పాటను, సారంగదరియా పాటను పోల్చి చూడండి… శ్రీలీల కనీసం యాభై ఆమడల దూరంలో ఉండిపోతుంది… నటన అనే పోలికను వదిలేయండి… సాయిపల్లవి డిస్టింక్షన్…

అసలు ఇద్దరి నడుమ ఏమైనా పోలిక ఉందా అంటే… ఒక్క విషయంలో ఉంది… ఇద్దరూ రియల్ లైఫులో డాక్టరీ చదివారు… వీళ్లే కాదు శివానీ రాజశేఖర్, రూప కూడా డాక్టర్లే… ఇంజనీరింగ్ చదివినవాళ్లు కూడా బోలెడు మంది హీరోయిన్లున్నారు ఇప్పుడు… ఇది గతకాలం కాదు, అల్లాటప్పా చదువులతో తెర మీదకు ఎక్కిపడేయటానికి…! సో, ఫలానా నటి సూపర్ అని ప్రేమించడంలో తప్పులేదు… కానీ ఫలానా అని వేరే నటితో పోల్చినప్పుడు, మరీ పోటీదారుగా చిత్రించినప్పుడు కాస్త జాగ్రత్త అవసరం…

అవునూ, నిజంగానే సాయిపల్లవికి ఏమైంది… గార్గి సినిమా రిలీజు తరువాత హఠాత్తుగా మాయమైంది… అయిపూజాడ లేదు… చెన్నైలో గానీ, హైదరాబాద్‌లోగానీ ఆమె మళ్లీ కనిపించలేదు… కొత్త సినిమాలు ఏవీ సైన్ చేయలేదు… ఒక మంచి యాడ్ చేయడానికి అంగీకరించింది అన్నారు గానీ మళ్లీ అప్‌డేట్ లేదు… ఇంత పాపులారిటీ సంపాదించిన నటి హఠాత్తుగా ఈ సందడికి దూరంగా ఉండిపోవడం మామూలు విషయం కాదు, అది ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది… అయితే అది ఏమై ఉంటుంది..?

పెళ్లా..? ఇప్పుడప్పుడే చేసుకోను అని చెప్పింది… కొన్నిసార్లు అసలు పెళ్లే చేసుకోను అన్నది… హాస్పిటల్ కట్టేసి ప్రాక్టీసు పెడుతోందా..? నిజానికి తను గైనకాలజీలో పీజీ చేస్తానని చెప్పింది… జార్జియాలో డాక్టరీ చేసింది కదా… ఇలా ఫారిన్‌లో చదువుకున్న డాక్టర్లకు ఇండియాలో ప్రాక్టీసుకు గానీ, తదుపరి చదువులకు గానీ అనుమతి ఇవ్వాలంటే మెడికల్ కౌన్సిల్  FMGE Examination ఏటా రెండుసార్లు పెడుతుంది… కరోనా కాలంలోనే ఆమె అది రాసింది… రిజల్ట్ తెలియదు… మొత్తానికి సాయిపల్లవి వేర్ అబౌట్స్ ఒక మిస్టరీ… అవునూ, రానా, సాయిపల్లవి లాపతాకు కారణం ఏమిటి..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!
  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions