.
బీహార్‌లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించింది కదా… అంత భారీ గెలుపు ఎన్డీయే వీరాభిమానులు అమిత్ షాతో సహా ఊహించలేదు… ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు మట్టికరిచాయి… అసలు యాంటీ ఇన్‌కంబెన్సీ వోటు పనిచేయాల్సిన స్థితిలో ఇలా ప్రొ ఇన్‌కంబెన్సీ సునామీ ఏమిటి..? ఏదో భారీ తప్పు జరిగింది..?
సర్ ప్రక్రియ (వోట్ల జాబితాల ప్రక్షాళన) ఒక కారణం కాగా… అసలు ఎన్నికల సంఘం ప్రకటిస్తున్న లెక్కల్లోనే బోలెడు తప్పులున్నాయి… ఉన్న వోట్లకన్నా ఎక్కువ పోలింగు ఎలా జరిగింది..? ఇదుగో ఇలాంటి విశ్లేషణలు, ప్రశ్నలతో అందరూ ఎన్నికల సంఘం వైపు వేలెత్తి చూపుతున్నారు… ఎన్నికల సంఘం బీజేపీ అనుబంధ సంస్థగా మారిందనీ విమర్శిస్తున్నారు…
Ads
యాంటీ బీజేపీ వెబ్ పోర్టల్ ‘ది క్వింట్’లో ఓ చిత్రమైన విశ్లేషణ కనిపించింది… అదేమంటే..? సర్ ప్రక్రియ ద్వారా ఎన్నికల సంఘం 174 నియోజకవర్గాల్లో తొలగించిన వోట్లకన్నా విజేతల మెజారిటీలు తక్కువ… 91 సీట్లలో ఓడిన సిట్టింగులు… వారిలో 75 మంది మహాగఠ్ బంధన్ అభ్యర్థులే… సర్ ప్రక్రియతో వోట్లు భారీగా తొలగించిన నియోజకవర్గాల్లో చాలావరకూ ఎన్డీయే గెలుచుకున్నది…
ఇదీ దాని విశ్లేషణ… అంటే సర్ ప్రక్రియ కేవలం ఎన్డీయే గెలుపు కోసమే చేపట్టిన కార్యక్రమం అని తేల్చిపడేసింది… కానీ నిజం ఏమిటంటే..? మళ్లీ మహాగఠ్ బంధన్‌కు గత ఎన్నికలతో పోలిస్తే కేవలం ఒక శాతంలోపు వోట్లు తగ్గాయి… గతంలో చిన్న పార్టీలకు పడిన వోట్లు ఈసారి ఎన్డీయేకు మళ్లాయి… అన్ని గణాంకాలూ చెబుతున్న నిజమిదే…
సో, సర్ ప్రక్రియ ఏ పార్టీకి అనుకూలం లేదు, వ్యతిరేకమూ లేదు… కూటములు గాకుండా చిన్న పార్టీలకు గతంలో 12 శాతం వోట్లు రాగా, ఇప్పుడవి 7.9 శాతానికి పడిపోయాయి… ఎన్డీయే కూటమి వోట్లు 5.5 శాతం వోట్లు పెరిగాయి… ఇదే అసలు లెక్క… సో, సర్ ప్రక్రియ కేవలం ఎన్టీయే కోసమే చేపట్టబడిన కార్యక్రమం అనే ముద్రలో అర్థం లేదు…

పోలైన వోట్లు, ఎవరెవరికి ఎన్ని శాతాలు, ఎన్ని వోట్లు, మొత్తం కలిసి ఎన్ని, ఒక్కో సీటుకు సగటున ఎన్ని వోట్లు అనే లెక్క ఇదీ… సో, దేశవ్యాప్తంగా ఈ సర్ ప్రక్రియ సాగాలి… వోటర్ల జాబితాల ప్రక్షాళన జరగాలి… ఎవరు వ్యతిరేకిస్తారు..? దొంగ వోట్లతో ఇన్నాళ్లూ లబ్ధి పొందే పార్టీలు మాత్రమే..!! మరి బీహార్‌లో ఎన్డీయేకు అంత భారీ విజయం ఎలా సాధ్యం అయ్యింది..? దీనికి కారణాలు బోలెడు..!!
Share this Article