Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక ఆంధ్ర వ్యక్తి నవ్వులపాలు చేసేశాడా?

June 13, 2025 by M S R

–
తెలంగాణ ప్రభుత్వ ఫిలిమ్ అవార్డ్స్‌లో భాగంగా తెలుగు సినిమాపై రెంటాల జయదేవ రాసిన ‘మన సినిమా ఫస్ట్ రీల్’ ను ఉత్తమ పుస్తకంగా ఎంపిక చేసిన విషయం…

ఇది పూర్తిగా బాధపడాల్సిన, సిగ్గుపడాల్సిన విషయం. అధమపక్షపు విజ్ఞత కూడా లేకుండా ఆ జ్యూరీ సభ్యులు చేసిన పని ఇది. తెలంగాణ ప్రభుత్వం పరువు తీసే పని ఇది. ఏ ప్రయోజనం కోసం ఇందుకు ఒడిగట్టారో ఆ జ్యూరీ సభ్యులు?

‘తెలుగు సినిమాకు జరిగిన పెనుహాని మన సినిమా ఫస్ట్ రీల్ అన్న పుస్తకం’. అజ్ఞానం, అతి తెలివి, దురాలోచన వీటితో పుస్తక రచయిత రెంటాల జయదేవ చేసిన పెను తప్పులను, విదూషకత్వాన్ని నేను కొన్ని వ్యాసాలలో ఈవరకే బహిరంగంగా తెలియజేశాను.
1
సినిమా పెద్దలను, జర్నలిస్టులను, రచయితలను “అజ్ఞానులు” అని అన్న ఒక పుస్తకాన్ని,
2
చదువులేక, రాయడం చాతకాక హాస్యాస్పదమైన తప్పులను చెప్పిన ఒక పుస్తకాన్ని,
3
తెలుగు సినిమా చరిత్రకు తీవ్రమైన హాని చేసిన ఒక పుస్తకాన్ని,
4
తెలుగు సినిమా పరంగా భవిష్యత్ తరాలను తప్పుతోవ పట్టించే ఒక పుస్తకాన్ని- జ్యూరీ సభ్యులు అనబడే కొందరు ప్రభుత్వ పురస్కారానికి ఎంపిక చెయ్యడం గౌరవనీయమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు, అపహాస్యంపాలు చెయ్యడమే.

Ads

‘ఈ విషయంగా తెలంగాణ ప్రభుత్వం తప్పు, నైతికత లేవు, ఉండవు’. ఆ జ్యూరీ సభ్యుల విజ్ఞతా రాహిత్యం ఈ అవాంఛనీయమైన పరిణామానికి కారణాలు అని మనం అర్థం చేసుకోవచ్చు.

rentala

పుస్తకం పేరు మన సినిమా ఫస్ట్ రీల్. ఇక్కడే పుస్తక ‘రచయిత చదువు లేమి’ తేట తెల్లంగా తెలుస్తోంది. ‘మన సినిమా ద ఫస్ట్ రీల్’ అని ఉండాలి. ఇది బడి పిల్లల చదువు. పేరే పుస్తకం తప్పుడుతనానికి సరైన ఋజువు. సరే, రచయితకు చదువు ఎలాగూ లేదు. ఆ జ్యూరీ సభ్యులకు కూడా చదువు లేకపోవడం దయనీయం; గర్హనీయం.

పుస్తకం పేరుతో మొదలైన తప్పుడుతనం పుస్తకమంతా పెద్ద మోతాదులో తాండవించింది. ఆ పుస్తకంలోని వక్రతను, తప్పుడు తనాన్ని, పుస్తక రచయిత చదువు లేమిని నేను సాధికారంగా, ‘తిరుగులేని ఋజువుల’తో సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో తెలియజేశాను.

ఆ జ్యూరీ సభ్యులు ఈ లోకంలో ఉండి ఉంటే వాళ్లకూ నేను చెప్పినవి ఎప్పుడో తెలిసి ఉండేవి. ఆ జ్యూరీ సభ్యులు ఏ లోకంవాళ్లో? ఏ మాలోకంవాళ్లో?

జ్యూరీ సభ్యులు పుస్తకాన్ని చదివి ఉంటారా? కనీసం పుస్తకాన్ని కళ్లతో చూసైనా ఉంటారా? కనీసం పుస్తకం ముఖపత్రం చూసి ఉన్నా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న తప్పు జ్యూరీ సభ్యులకు తెలిసేది.
ఆ పుస్తక రచయిత రెంటాల జయదేవ ఒక ఆంధ్ర వ్యక్తి. తన విజయవాడ చిరునామాతో ఇటీవల ఆంధ్ర రాష్ట్ర ఉగాది పురస్కారం అందుకున్నాడు.

తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రవాళ్లకే ఇలాంటి పురస్కారాలు ఇస్తుందా? ‘ఒక ఆంధ్ర వ్యక్తి వల్ల తెలంగాణ ప్రభుత్వం నవ్వుల పాలు కావాలా?’

రెంటాల జయదేవ సాక్షి దిన పత్రిక ఎడిట్ పేజ్ ఇన్చార్జ్. సాక్షి దిన పత్రిక ఆంధ్ర రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకమైంది అని అందరికీ తెలిసిందే. ఆంధ్ర ముఖ్యమంత్రి మాన్య చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి మాన్య పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ప్రతిరోజూ విషం కక్కే సాక్షి పత్రిక ఎడిట్ పేజ్ ఇన్చార్జ్ రెంటాల జయదేవ ఆ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని పొందగలిగాడు!!

విడ్డూరం ఇది. రెంటాల జయదేవ ఎంతటి ఘటికుడో ఈ పరిణామం తెలియజేస్తోంది. అతడు ఏ మేరకు, ఏ స్థాయిలో ‘మేనేజ్’ చెయ్యగలడో, ఎలాంటి ‘లాబీయింగ్’ చెయ్యగలడో ఈ పరిణామం స్పష్టంగా తెలియజేస్తోంది.

రెంటాల జయదేవ ఒక ‘ప్రత్యేక వ్యక్తి’ అని అతణ్ణి బాగా ఎరిగినవాళ్ల మాటగా తెలియవస్తున్న దానికి ఆంధ్ర రాష్ట్ర ఉగాది పురస్కారం, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ పురస్కారం వంటివి గట్టి తార్కాణాలేమో?

వై.సీ.పీ. పార్టీ పత్రిక అయిన సాక్షిలో పనిచేస్తూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అభ్యర్థించడం, పొందడం ఏ నైతికత? సాక్షికి కూడా రెంటాల జయదేవ విశ్వసనీయుడు, నమ్మకస్థుడు కాదు అని ఇది తెలియజెయ్యడం లేదా?

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే సాక్షిలో ఎడిట్ పేజ్ ఇన్చార్జ్ అయుండీ ఆంధ్ర రాష్ట్ర పురస్కారాన్ని పొందడం నిజంగా రెంటాల జయదేవ ఘనతే. తన ఘనతతో రెంటాల జయదేవ మన సినిమా ఫస్ట్ రీల్ పుస్తకానికి ఆంధ్ర రాష్ట్ర నంది పురస్కారం సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు! కాకపోతే ఆ పుస్తకానికి ఏ పురస్కారమైనా ఇస్తే ఆంధ్ర ప్రభుత్వం ప్రజల మధ్యలో అపహాస్యమైపోతుంది.

సినిమాలపై ప్రజల్లో ఉన్న ఆసక్తి కారణంగా సినిమాలపై పుస్తకాలు అమ్మకాల పరంగా విజయవంతమే ఔతాయి. రావికొండల రావు, వి.వి. రామారావు, పైడిపాల, ఓలేటి శ్రీనివాస భాను, కంపెల్ల రవిచంద్రన్ వంటి రచయితలు సినిమాలపై రాసిన పుస్తకాలు విజయవంతమయ్యాయి.

ఇంత వరకూ తెలుగులో సినిమాపై వచ్చిన పుస్తకాల్లో అమ్మకాల పరంగా దారుణంగా విఫలమైన పుస్తకం ఈ మన సినిమా ఫస్ట్ రీల్. ఇది ఎంత మాత్రమూ నాణ్యమైన పుస్తకం కూడా కాదు. రెండు రాష్ట్రాల తెలుగు పాఠకులూ ఈ పుస్తకాన్ని తిరస్కరించారు.

ప్రజల చేత తిరస్కరించబడిన, తప్పులతో హానికరమైన ఈ పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వ పురస్కారానికి ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులను ఏమనుకోవాలి? ఏమనాలి? చదువు, క్షేత్ర వాస్తవ అవగాహన, విజ్ఞత ఈ జ్యూరీ సభ్యులకు లేవనుకోవచ్చా? కొందరు జ్యూరీ సభ్యులు ఇలా తెలంగాణ ప్రభుత్వ పరువు తియ్యడం మాత్రం తీక్ష్ణమైంది.

మన సినిమా ఫస్ట్ రీల్ పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వ పురస్కారానికి ఎంపిక చెయ్యడం పెద్ద తప్పిదం. ఈ ఎంపిక తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమార్చడమే. మాన్య తెలంగాణ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, సంబంధిత శాఖామాత్యులు ఈ విషయంగా సరైన తీరులో స్పందించి జరిగిన తప్పిదాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది.

మన సినిమా ఫస్ట రీల్ అన్న పుస్తకం ఏ మేరకు తప్పుడు పుస్తకమో మళ్లీ ఏ వేదికపైనైనా తెలియజెయ్యడానికి సరైన ఆధారాలతో నేను సిద్ధంగా ఉన్నాను. జ్యూరీ సభ్యులకు ఏ మాత్రమైనా నైతికత, ప్రభుత్వంపై గౌరవం, చదువు, విజ్ఞత ఉంటే నాతో ఈ విషయంగా చర్చ చెయ్యాలి.
ఒక ఆంధ్ర వ్యక్తి వల్ల తెలంగాణ ప్రభుత్వం నవ్వుల పాలు అవాలా? లేదా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక ఆంధ్ర వ్యక్తి నవ్వుల పాలు చేసేశాడా?

మాన్య తెలంగాణ ప్రభుత్వం భవిష్యదవసరాల దృష్ట్యా ఈ విషయంగా సత్వరమే దిద్దుపాటు చర్యలు చేపట్టాలి; తెలంగాణ ప్రభుత్వం తన పరువును కాపాడుకోవాలి; ప్రపంచ తెలుగు పాఠకులకు తెలంగాణ ప్రభుత్వం సరైన సందేశం ఇవ్వాలి. తథాస్తు; తథాస్తు; తథాస్తు…… [[ రోచిష్మాన్ 9444012279 ]]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దేశవాళీ క్రికెట్‌లో అనూహ్యంగా ఓ కొత్త చరిత్ర రాసిన జమ్ముకశ్మీర్..!!
  • సీడాన్స్..! ఇలా చెప్పండి, అలా ఓ అవతార్ తాతను క్రియేట్ చేసిస్తుంది..!!
  • దేవుడే ఇచ్చాడు వీథి… నిజంగా ఈ పాట సందర్భానికి, పాత్రలకూ నప్పిందా..?!
  • “Kavitha walks free..! A massive blow to an already battered BRS..!!”
  • తండ్రి గ్యాస్ సిలిండర్లు మోసే ఓ కూలీ…! మరి ఇప్పుడు రింకూ సింగ్..?!
  • క్లీన్ కవిత..! అసలే మూలిగే బీఆర్ఎస్ మీద పే-ద్ధ తాటిపండు పడ్డట్టు..!!
  • ఆమె జేఆర్‌డి టాటాకు నేరుగా ఓ పోస్ట్ కార్డు రాసింది… ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ…
  • ఒక్కతే… 2 లక్షల కిలోమీటర్లు… మోటార్ బైక్‌పై… అనేక దేశాల్లో…
  • కోల్ మిథేన్..! వాడుకోగలిగితే సింగరేణికి సూపర్ ఛాన్స్… కానీ..?
  • అవును, కాబోయే ఈ టీఎంసీ ఎంపీ హైదరాబాదీ… అసలు ఎవరీమె..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions