అప్పట్లో…. చాలా ఏళ్ల క్రితం… కాకతీయ రైలు బోగీ విషాదం గుర్తుందా..? కొందరు పీపుల్స్‌వార్ నక్సలైట్ల అత్యుత్సాహం ప్లస్ అజ్ఞానం కారణంగా… ఎస్, అజ్ఞానం అనే పదాన్నే వాడుతున్నాను… అనేకమంది ఆ మంటల్లో ఎటూ పోలేక, తప్పించుకోలేక ఏమైందనేది ఓ చరిత్ర… పీపుల్స్‌వార్ క్షమాపణ చెప్పవచ్చుగాక… పోయిన అమాయకుల ప్రాణాల్ని ఎవరూ తిరిగి తీసుకురాలేరు…
వాళ్లకు ఉద్యమంలో సంబంధం లేదు… రాజ్యహింసతో సంబంధం లేదు… ఐనా ప్రాణాలు కోల్పోయారు, అంతకుముందు ఓసారి ఇలాగే ఓ బస్సును పేల్చేస్తే కొందరు మరణించారు… యుద్ధం జరుగుతున్నప్పుడు అమాయకుల ప్రాణాలు కూడా పోతాయి అనేది అబ్సర్డ్ థియరీ… భవనాలు పేల్చివేత, బస్సుల కాల్చివేత అనేవి నిరసన రూపాలే కావచ్చుగాక… అలా సమర్థించుకోవచ్చుగాక… కానీ ఒక్కడంటే ఒక్కడూ దాన్ని సమర్థించడు…
యుద్ధం శత్రువు మీద… అసలు శత్రువు ఎవరో క్లారిటీ ఉందా..? ఇప్పుడున్న ప్రపంచ రాజకీయ స్థితిగతుల్లో జనం వేలాదిగా, లక్షలాదిగా ఉద్యమంలో చేరి, సాయుధులై రాజ్యాన్ని కూలదోసే సీన్ ఉందా..? నిజంగా సొసైటీ మీద, ప్రజల మీద ప్రేమ ఉన్నవాళ్లు ఆచరించాల్సిన కొత్త పద్ధతులేమిటి..? ఒకప్పటి రోజుల్ని కాసేపు మరిచిపొండి… ప్రస్తుత యువతరంలో రిక్రూట్‌మెంట్ ఎంత..? వచ్చేవాళ్లకు పొలిటికల్ ట్రెయినింగ్ ఎంత..? నిజానికి ఆ అడవుల్లో నిరర్థక త్యాగాలకు బదులు, సిస్టంలో చేరి, మార్పులకు ఉపక్రమిస్తే, పోరాడితే వచ్చే ప్రజాప్రయోజనం ఎంత..?
Ads
ఈ మథనం ఎందుకు అకస్మాత్తుగా కలుగుతున్నదీ అంటే… జైపూర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఒడిశా బస్సును రాత్రి 10:30pm కి నక్షల్స్ దగ్ధం చేశారు… ప్రయాణికులను బస్సులో నుంచి దిగండి అన్నారు.., అయినా ప్రయాణికులు వినలేదు… దిగక పోవడంతో, ప్రయాణికులతో ఉన్న బస్సునే కాల్చి వేసినట్టు ఒక వార్త….
భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు ఒక్కసారిగా మంటలు అంటుకున్న బస్సు నుంచి తొక్కిసలాడుతూ బయటకు పరుగులు తీశారుట… ఇద్దరి ప్రయాణికులకు నిప్పు అంటుకుని, తల భాగం కాలడంతో, తోటి ప్రయాణికులు ఆర్పారట… చాలా మంది ప్రయాణికుల నిత్యావసర సామగ్రి (బ్యాగులు) బస్సులోనే ఉండి పోయాయట…
ఎటు పోతున్నాం..? ఇదేం పోరాటం..? విచక్షణ ఎరగని పోరాటంతో సాధించేదేమిటి..? ఆ బస్సు కాల్చివేతతో వచ్చే ప్రయోజనం ఏమిటి..? ఇదేనా యుద్ధం..? ఇదేనా రాజ్యంతో పోరాటం..? ఈ ప్రశ్నలకు జవాబులు దొరకవు… ఇచ్చేవారుండరు… ఉన్నా సరే, ఓ వితండవాద సమర్థన… సారీ కామ్రేడ్స్… మీ సంకల్పం, మీ త్యాగం గొప్పవే… కానీ మీ ఆచరణ, అడుగులకు ప్రజామోదం లేదు… లేదు… రాదు… ఇంకా కారణాల లోతుల్లోకి వెళ్లాల్సిన పని కూడా లేదు ఇక్కడ…! పోరాట సమీక్ష మరిచిన తరువాత ఉగ్రవాదానికీ, రాజ్యంపై పోరాటానికీ తేడా ఉండదు… అచ్చం ఇలాగే…!!
Share this Article