‘‘నాన్సెన్స్, అది సైన్స్ కాదు… జనాన్ని నాశనం చేస్తారా..? ఆ నాటు వైద్యాన్ని సమర్థిస్తున్నారా..’’ భీకరంగా కొందరు టీవీ డిబేట్లలో, సోషల్ మీడియా డిబేట్లలో ప్రశ్నిస్తున్నారు… ఆనందయ్య మందును ముందుపెట్టి మొత్తం ఆయుర్వేదం, హోమియో, యునాని, నేచురుపతిపై దాడి సాగుతోంది… టీవీలు వీటికి వేదికలు… దీనికి సింపుల్ సమాధానం… తిరిగి ప్రశ్నే… ‘‘సైన్స్ అంటే ఏమిటి..?’’….. నిజం… మాకు తెలిసిందే విజ్ఞానం అనే భ్రమల్లో బతకడమే ఓ అజ్ఞానం… నాటువైద్యాన్ని సమర్థిస్తారా అనే ప్రశ్నకు సమాధానం… సమర్థన కాదు, దేన్నీ ‘‘ముందస్తు అభిప్రాయాలతో’’ గుడ్డిగా వ్యతిరేకించొద్దు అని..! అల్లోపతి తప్ప ఇంకేదీ వైద్యమే కాదు అనే ప్రిజుడిస్ పొరల నుంచి బయటపడి, ఏది ఏమిటో విజ్ఞతతో పరిశీలించాలని..! ఎందుకంటే..?
ఈ కృష్ణపట్ణం ఆనందయ్య మందునే తీసుకుంటే…. ప్రపంచవ్యాప్తంగా హైడ్రాక్సీకోర్లోక్విన్ దగ్గర్నుంచి ఫెయిలైన రెమ్డెసివర్ వరకు ఈ ఏడాదిలో బొచ్చెడు మందులు పరిశీలించారు… ఒక్కటీ సక్సెస్ కాలేదు… రోగిలోని రోగనిరోధకశక్తే వ్యాధిని నయం చేయాలి తప్ప ఇవేవీ వైరస్ను చంపలేవు… పైగా ఇప్పుడు అల్లోపతి వైద్యం పుణ్యమాని బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ప్రబలుతోంది… మింగేస్తోంది… వాడుతున్న స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ సుగర్ లెవల్స్ పెంచేసి, రక్తంలో క్లాట్స్ పెంచేసి, హఠాత్తు గుండెపోటు మరణాలకూ కారణమవుతోంది… మాదీ సైన్స్ అని కళ్లురిమి వాదించడం, ఇదేం సైన్సో.., ఈ మహావిపత్తువేళ ఇతర వైద్యవిధానాల్ని కలుపుకుని వెళ్లని ధోరణి శాస్త్రీయమా..? అశాస్త్రీయమా..? ప్రాణాలు పోతుంటే నాకు టోస్లీజుమాబ్ అయినా ఒకటే… ఆనందయ్య మందు అయినా ఒకటే కదా…
Ads
ఏ జీవజాతికైనా రోగం ఉంటుంది… మనిషి పుట్టి ఎన్నేళ్లయింది… అప్పటి నుంచీ అల్లోపతియే జనానికి వైద్యం చేస్తూ వచ్చిందా..? గతంలో శశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసినట్టు రికార్డయి ఉంది… అందుకే చెప్పేది గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదు అని… ఇదే ఆనందయ్య గత శ్రీరామనవమి నుంచి మందు ఇస్తున్నాడు… అంటే ఇప్పటికి సరిగ్గా నెలరోజులు… మొదట్లో 500 మందితో స్టార్టయి, 5 వేల మంది దాకా వచ్చేవాళ్లు… ఈ మందులో ఏముంది అనే సహజమైన సైంటిఫిక్ ఇంట్రస్టు కలగలేదు, పరిశీలన లేదు… అదేదో నాటువైద్యంలే అనుకుంది ఆధునిక జ్ఞానసమాజం… సగటున 3 వేల మందిని లెక్కేసినా, ఈ నెల రోజుల్లో ఆనందయ్య లక్ష మందికి మందు ఇచ్చి ఉంటాడు… ఇంతేమందికి ఒక ప్రైవేటు అల్లోపతి వైద్యుడు గనుక చికిత్స చేసి ఉంటే… (కార్పొరేట్ వైద్యశాలల్ని నడిపే ఓనర్లలో డాక్టర్లు కానివాళ్లు కూడా బోలెడు మంది…) ఇప్పటి రేట్లు, ప్యాకేజీలు, దందాలతో ఎంత పోగేసుకుని ఉండేవాడు… మరణాల రేటు ఎంత ఉండేది..? ఆనందయ్య సంపాదించింది ఏమీ లేదు… మరణాల రేటు నిల్… మరెందుకు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు..? అంటే అది సైన్స్ కాదు అంటారు..? ఏది సైన్స్..?
టీవీ డిబేట్ల దరిద్రం ఏమిటంటే..? ఒక వైద్యవిధానం మీద రాళ్లు విసరడానికి, ఆ విధానాన్ని అసలు వైద్యమే కాదనే ప్రిజుడిస్ భావనల్లో ఉండే ప్లేసిబో బ్యాచును కూర్చోబెట్టడం ఏమిటి..? ఒకాయన భీకరంగా అరిచేస్తున్నాడు, ప్రకృతిలో దొరికే నాలుగు సరుకుల్ని దంచేసి, ఉడికించి, మందు అంటారా..? రేప్పొద్దున ఎవడికైనా ఏమైనా అయితే ఎవడు జవాబుదారీ అంటూ..!! 1) ఉరొకినాసే… (Urokinase)… మనిషి యూరిన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడిన మందు… వేలాదిమందిని బతికించింది… అంతెందుకు..? ప్రకృతి నుంచి తీయబడని మందు ఏది..? అసలు ఇప్పటికైనా వైరస్ను నిర్మూలించే మందు ఉందా అల్లోపతిలో..? 2) కొత్త వ్యాధులు ప్రబలేలా వైద్యం చేస్తూ, వేల మరణాలకు కొత్తగా కారకులవుతున్న వైద్యులనేం చేయాలి మరి..? రోజుకొక మందు ఫ్లాప్ అయిపోతోంది కదా, ఈ ప్రయోగఫలితాలూ లేకుండానే రోగులపై ప్రయోగిస్తున్నవారిని ఏమనాలి..?
ఆనందయ్యది నాటువైద్యం కాదు… సిద్ధవైద్యం… ఆయన వాడుతున్న సరుకులు ఆయుర్వేదంలో ఎక్కువగా కఫదోష నివారణకు వాడేవే… జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలు… అంతెందుకు..? గత ఏడాది ఈ నెలలోనే ఇదే మీడియా పిచ్చిపిచ్చిగా నెత్తికెత్తుకున్న మందు ఒకటి ఉంది… దాని పేరు ‘’కబాసుర కుడినీర్-ఆయుష్ 64’’… సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఎఎస్) అభివృద్ధి చేసింది… కబాసుర కుడినీర్’ పనితీరు పరిశీలన కోసం కోవిడ్ పేషెంట్లపై క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించారు… మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)తో పాటు ఫ్రాంక్ఫర్ట్ బయోటెక్నాలజీ ఇన్నొవేషన్ కూడా సహకరించింది… చెన్నైలోని తాంబరం సిద్ధ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కోఆర్డినేట్ చేసింది… మాత్రలు, పొడి, పేస్టు… ఇప్పటికీ మార్కెట్లో ఈ మందు దొరుకుతోంది… చెన్నై వీథుల్లో పోలీసులు ఉచితంగా ఈ కషాయం పంపిణీ చేశారు…
సిద్ధవైద్యం అశాస్త్రీయం అయితే ఈ సంస్థలన్నీ ఎందుకు..? రద్దు చేసేద్దామా..? సిద్ధవైద్యం వ్యాధుల్ని 4448 రకాలుగా వర్గీకరించి చూస్తుంది… వాటిల్లో 64 రకాల జ్వరాలు… తరాలకొద్దీ సాగుతున్న ప్రయోగం, అధ్యయనమే దీనికి ప్రాతిపదిక… చివరగా… ఆనందయ్య మందును పెన్నా ప్రవాహంలో కలిపేయడానికి డ్రగ్ మాఫియా ప్రయత్నం చేస్తుంది… ఏ ప్రభుత్వమైనా సరే తలొగ్గక తప్పదు… మెల్లిమెల్లిగా సైడ్ లైన్ చేసేస్తుంది… ప్రజలకు ఉపయోగపడే పనిచేస్తే దాన్ని ప్రభుత్వం అని ఎందుకంటారు..? ముందు కొన్నిరోజులు పంపిణీ ఆపేస్తారు, ఆనందయ్య మీద ప్రేమ నటిస్తారు… జస్ట్, తొక్కేస్తారు… ప్రజలు ఏమైపోతే ప్రభుత్వానికి ఏమిటి..? జగన్ అయితేనేం..? కేసీయార్ అయితేనేం..? మోడీ అయితేనేం..? ఐసీఎంఆర్ బదులు అదే సిద్ధవైద్యంపై కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ సంస్థలున్నాయి కదా, వాటినెందుకు ఇన్వాల్వ్ చేయలేదు, ఆ మందు ప్రమాణాలకు లోబడి ఉందా లేదా వాళ్లు కదా సరిగ్గా జడ్జి చేయగలిగేది… సర్లెండి, ప్రభుత్వాలు అంత ఆలోచిస్తే ఇండియాలో ఇన్ని మరణాలు, ఇన్ని కేసులు, ఇన్ని కొత్త వ్యాధులెక్కడివి..?! చివరగా :: ఈ మందు ఆనందయ్య సొంతంగా తయారు చేసుకున్నది కాదు… చెన్నైలో తను నేర్చుకుని, ఇక్కడ జనానికి తయారుచేసి ఇస్తున్నాడు..! ఒక వ్యక్తిని మూసేస్తే, లోపలేస్తే, కేసులు పెడితే, తొక్కేస్తే… సిద్ధవైద్యాన్నే వేళ్లతోసహా పీకేసినట్టు కాదు… అది చావదు..!!
Share this Article