.
ఇజ్రాయేల్ ఇరాన్ మీద ఎదురు దాడి చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నది?
చాలా మంది అనుకోవడం ఏమిటంటే ఇజ్రాయేల్ కనుక ఇరాన్ మీద దాడి చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలం అవకూడదు కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నది అని!
Ads
ఇజ్రాయేల్ దాడి ఎలా ఉండాలి అంటే సమీప భవిష్యత్ లో ఇరాన్ తిరిగి దాడి చేయడానికి భయపడేట్లుగా ఉండాలి! కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేస్తున్నది ఇజ్రాయేల్!
ఇరాన్ అణు విద్యుత్ ప్లాంట్, మిసైల్స్ తయారు చేసే ఫాక్టరీల మీద, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద, ఇరాన్ కి ఆయువు పట్టు అయిన ముడి చమురు ఉత్పత్తి చేసే ఆయిల్ రిగ్గుల మీద, ఇరాన్ లో ఉన్న ప్రధాన ముడి చమురు శుద్ధి కర్మాగారాల మీద ఒకేసారి దాడి చేయాలి!
…… ఇలాంటి అంచనాలతో యుద్ధ నిపుణులు బోలెడన్ని విశ్లేషణలు చేశారు గత నెల రోజులుగా!
ఇక ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమిన్ నేతన్యాహు హెచ్చరికల సంగతి సరేసరి! కానీ ఎందుకు ఆలస్యం అవుతున్నది? సమాధానం నాలుగు రోజుల కింద దొరికింది!
అరియనే తబతబాయ్ ( Ariane Tabatabai )!
అరియనే ఇరాన్ కి చెందిన మహిళ! అమెరికాలో అత్యంత శక్తివంతమైన పెంటగాన్ లో కీలకమైన స్థానంలో పనిచేస్తున్న ఆఫీసర్!
అరియనే పెంటగాన్ లో పనిచేస్తున్నా ఇరాన్ తో రాయబారాలు చేయడానికి గాను ఒక ప్రత్యేక మిషన్ మీద వాడుకుంటున్నది విదేశాంగ శాఖ!
అరియనే తబతబాయ్ డబుల్ ఏజెంట్!
Well! పెంటగాన్ లో ఇరాన్ కి చెందిన మహిళకి కీలక బాధ్యతలు అప్పచెప్పడం మీద విమర్శలు వచ్చాయి!
అలా అని పెంటగాన్ లో అమెరికన్స్ కాకుండా వేరే దేశానికి చెందిన వాళ్ళు లేరా అంటే… ఉన్నారు. చైనాలో పుట్టి అమెరికాకి వలసవచ్చి అమెరికా పౌరసత్వం తీసుకొని చైనాకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు CIA, పెంటగాన్, విదేశాంగ శాఖలో ఉన్నారు.
రష్యా నుండి వచ్చి అమెరికాలో స్థిరపడి రష్యాకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్లు ఉన్నారు! అలాగే భారత్, ఇరాక్, పాకిస్థాన్, లిబియా దేశాల వాళ్ళు ఉన్నారు!
సమస్య ఎక్కడ ఉంది?
CIA, పెంటగాన్, NSA, ఫారిన్ అఫైర్స్ లాంటి చోట్ల పని చేసే అధికారులకి బాధ్యతలు అప్పచెప్పే విషయంలో వ్యత్యాసాలు ఉంటాయి!
అధికారి అనగానే అన్ని ఫైల్స్ ని యాక్సెస్ చేసే అధికారం ఉండదు. సదరు అధికారి హోదా ఏమిటి, జీతం ఎంత ( Payroll ) అనే దానిమీద ఆధారపడి కీలకమైన ఫైల్స్ ని చూడడానికి అధికారం ఉంటుంది.
కానీ అరియనేకి తన హోదా, పేరోల్ తో సంబంధం లేకుండా కీలకమైన ఫైల్స్ ని చూడడానికి అనుమతి ఇచ్చింది పెంటగాన్!
********
అరియనే తబతబాయ్ ( Ariane Tabatabai ) కీలకమైన సమాచారాన్ని ఇరాన్ కి చేరవేసింది!
హార్వార్డ్ కెన్నేడీ స్కూల్ పూర్వ విద్యార్థి అయినందున అరియనే కి హార్వర్డ్ e mail యాక్సెస్ ఉంది.
హార్వర్డ్ e mail తోనే IRGC (Iran Revolutionary Guards Corps ) కి సమాచారం లీక్ చేసింది!
అరియనే IRGC కి ఇచ్చిన సమాచారంలో ఏముంది? ఇజ్రాయేల్ తాను ఇరాన్ మీద దాడికి దిగడానికి ఏ విధంగా ప్లాన్ చేసిందనే వివరాల్ని పెంటగాన్ కి ఇచ్చింది.
ఇజ్రాయేల్ తన దాడిలో భాగంగా ఇరాన్ లోని ఏ ప్రాంతాల మీద దాడి చేయదలుచుకున్నది వివరాలు పెంటగాన్ కి ఇచ్చింది – ఈ సమాచారాన్ని IRGC కి ఇచ్చింది అరియనే.
అయితే ఇవి అన్నీ ఊహగానాలు కావు!
అరియనే IRGC తో పంచుకున్న సమాచారంలో కొంత భాగం ఇరాన్ లోని టెలిగ్రామ్ ఛానెల్స్ లో ప్రత్యక్షం అయ్యాయి!
పెంటగాన్ కావాలనే అరియనే ద్వారా సమాచారం లీక్ చేయించి, ఇరాన్ ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేసింది అనుకోవడానికి వీల్లేదు!
ఎందుకంటే ఇజ్రాయేల్ తన విమానాలు ఏ మార్గం గుండా వెళ్లి దాడి చేసి తిరిగి ఏ మార్గంగుండా వస్తాయో ఎయిర్ స్పేస్ మాపులు కూడా టెలిగ్రామ్ ఛానెల్ లో ప్రత్యక్షం అయ్యాయి!
ఇరాన్, ఇరాక్ లలోని ఏ ప్రదేశాలలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయో వాటి పరిధిలోకి వెళ్లకుండా ఫైటర్ జెట్స్ ఎలా వెళ్లాలో అనేది క్లియర్ మ్యాప్ ఉంది! కాబట్టి నిజంగానే సమాచారం లీక్ అయింది!
అమెరికన్ సెనేటర్ రోగర్ వికర్ ( Roger Wicker )!
వికర్ మొదటినుండి అరియనే ని పెంటగాన్ లో కీలక పదవిలో నియమించడం మీద తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు!
రోగర్ వికర్ మాటల్లో….
‘నేను గత సంవత్సరం అరియనే ఇరాన్ కనెక్షన్ మరియు పెంటగాన్ లో ఆవిడని నియమించడం మీద మరియు కీలకమైన ఫైల్స్ ని యాక్సెస్ చేయడానికి గాను సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వడం మీద అభ్యంతరం వ్యక్తం చేశాను. ఇప్పుడు పెంటగాన్ లోని కీలక సమాచారం ఇరాన్ లోని టెలిగ్రామ్ ఛానెల్ లో వచ్చినా ఇంకా అరియనే ని పెంటగాన్ లో కొనసాగించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది!’
జో బిడెన్, కమలా హారీస్ లు అమెరికా దేశ భద్రతని గాలికొదిలేశారు! So! ఇజ్రాయేల్ వెంటనే ప్రతి దాడి చేయడానికి ఆలస్యం అవడానికి కారణం దాడి యొక్క ప్లాన్ పెంటగాన్ నుండి ఇరాన్ కి లీక్ అవడం వల్లనే అని స్పష్టమవుతున్నది!
No! కావాలని ఇన్ఫర్మేషన్ లీక్ చేయలేదు! ఇది మరో వెర్షన్… స్టే ట్యూన్….. (పొట్లూరి పార్థసారథి)
Share this Article