WW-3 అప్డేట్… ! ఇరాన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! రష్యాకి తన సత్తా చూపిస్తున్న ఉక్రెయిన్!
********
19-04-2024 తెల్లవారు ఝామున 2 నుండి 3 గంటల మధ్య ఇజ్రాయెల్ ఇరాన్ లోని 9 టార్గెట్స్ మీద మిస్సైల్స్ తో దాడి చేసింది.
ఇరాన్ లోని ఇస్ఫహాన్ (Isfahan) నగరంలో ఉన్న ఎయిర్ బేస్ మీద డ్రోన్లు, మిస్సైల్స్ తో ఇజ్రాయెల్ దాడి చేసినట్లు తెలుస్తున్నది.
ఇస్ఫాహన్ నగర శివార్లలో ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ కూడా ఉంది, కానీ దాని మీద దాడి జరిగిందా లేదా అన్నది తెలియరాలేదు.
అమెరికన్ వార్తా సంస్థ ABC NEWS మొదటగా దాడి విషయం వెల్లడించగా ఈ రోజు ఉదయం ఇరాన్ అధికార వార్త సంస్థ ఇర్నా (IRNA) ఇజ్రాయెల్ దాడి విషయం వెల్లడించింది.
మరో ఇరాన్ వార్తా సంస్థ అయిన ఫార్స్ (FARS) మాత్రం ఇస్ఫహాన్, షిరాజ్, టెహ్రాన్ ఎయిర్పోర్ట్ సమీపంలో పెద్ద శబ్దాలు వినిపించాయి అని పేర్కొంది.
అయితే ఇజ్రాయెల్ కి చెందిన వార్తా సంస్థలు మాత్రం ఎలాంటి కథనాలు ప్రచురించలేదు.
మరోవైపు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ప్రపంచ దేశాలలో ఉన్న తమ రాయబార కార్యాయాలకి ఒక సందేశం పంపిస్తూ ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడుల గురుంచి ఎలాంటి వ్యాఖ్యలు కానీ మీడియా సమావేశాలు నిర్వహించవద్దని కోరింది!
అఫ్కోర్స్ అమెరికా వత్తిడితో పాటు ఇజ్రాయెల్ భయాలు ఇజ్రాయెల్ కి ఉన్నాయి.
అందుకే ముందస్తు ప్రకటన చేయకుండా ఇజ్రాయెల్ దాడి చేసినట్లు తెలుస్తున్నది!
*********
ఈ రోజు ఇజ్రాయెల్ చేసిన దాడి కేవలం ఏదో మేము కూడా ఎదురు దాడి చేసాము అన్నట్లుగా ఉంది తప్పితే ఇజ్రాయెల్ దాడి వల్ల ఇరాన్ కి పెద్ద నష్టం కలిగినట్లుగా లేదు.
ఇస్ఫహాన్ నగర ఎయిర్ బేస్ మీద చేసిన దాడి వలన ఎలాంటి ప్రయోజనం ఉంటుంది ఇజ్రాయెల్ కి..?
Isfahan ఎయిర్ బేస్ లో ఉన్నవి F-14 టామ్ క్యాట్ జెట్ ఫైటర్స్ మాత్రమే!
వాటిని ధ్వంసం చేయడం వల్ల ఎవరికి లాభం?
ఎవరికీ లాభం లేదు, నష్టం లేదు.
1975 లో ఇరాన్ కి అమెరికాకి సంబంధాలు బాగా ఉన్న సమయంలో అమెరికా అప్పట్లో అధునాతన టెక్నాలజీ కలిగి ఉన్న F-14 Tomcat ఫైటర్ జెట్ లని అమ్మింది.
1979 లో ఆయుతొల్ల ఖోమెనీ తిరుగుబాటు చేసి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ గా ప్రకటించాక అమెరికాతో సంబంధాలు క్షీణించాయి.
అదే సంవత్సరంలో ఇరాన్ లోని అమెరికన్ రాయబార కార్యాలయ సిబ్బందిని బందీలుగా చేశాడు ఖోమేనీ, దాంతో అమెరికాతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి ఇరాన్ కి.
1979 నుండి F-14 టామ్ క్యాట్ ఫైటర్స్ అప్గ్రేడ్ కి నోచుకోలేదు సరికదా విడిభాగాల సరఫరా కూడా చేయలేదు అమెరికా.
మెయింటేనెన్స్ లేక అవి దిష్టి బొమ్మలుగా ఉండిపోయాయి 1979 నుండి.
F 14 లని ఉంచుకోలేదు, అలా అని పారేయలేక, అలానే రన్ వే దగ్గర పార్కింగ్ చేసి ఉన్నాయి Isfahan ఎయిర్ బేస్ లో.
అలాంటి ఎయిర్ బేస్ మీద దాడి చేసి ఏం లాభం?
2006 లో అమెరికా పూర్తిగా తన ఎయిర్ ఫోర్స్ నుండి తీసివేసింది F14 లని.
Ads
*********
ఇజ్రాయెల్, అమెరికాల భయానికి కారణం ఏమిటి?
ఏప్రిల్ 14 న ఇరాన్ ఇజ్రాయెల్ మీద చేసిన దాడిలో నాలుగు బాలిస్టిక్ మిస్సైల్స్ అమెరికా, బ్రిటన్ నావీల నుండి తప్పించుకొని నేరుగా ఇజ్రాయెల్ లోని నెవాటిమ్ ఎయిర్ బేస్ (Nevatim Air base) మీద దాడి చేశాయి.
Nevatim ఎయిర్ బేస్ లో ఇజ్రాయెల్ F-35 లు ఉన్నాయి. అలాగే ఒక న్యూక్లియర్ బేస్ కూడా ఉంది. అలాంటి ఎయిర్ బేస్ దగ్గర ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పెట్టలేదు IDF.
ఇరాన్ నేరుగా నెవాటిమ్ ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తూ, మరో వైపు కామికాజ్ డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైల్స్ తో అమెరికన్, బ్రిటన్, ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లని బిజీగా చేసింది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యూహం కానీ అగ్ర దేశాలు పసిగట్టలేక పోయాయి.
నిజం చెప్పాలి అంటే ఇరాన్ వ్యూహం వెనుక చైనా ఉంది.
మూకుమ్మడిగా వచ్చి పడుతున్న డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైల్స్ ను ఎదుర్కోవడంలో తలమునకలై ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మొత్తం దొడ్డి దారిన వచ్చిన బాలిస్టిక్ మిస్సైల్స్ ను ఎదుర్కోవడంలో విఫలం అయ్యాయి.
So! అమెరికన్, బ్రిటన్ యుద్ధ నౌకల మీద ఉండే రాడర్లు ఒకే సమయంలో ఎన్ని టార్గెట్స్ ను ట్రాక్ చేయగలవు అనే సమాచారం చైనా దగ్గర ఉంది.
అఫ్కోర్స్ అవి ఫ్రిగెట్స్ అయినా, డిస్ట్రాయర్స్ అయినా పరిమిత సంఖ్యలో టార్గెట్స్ ను ట్రాక్ చేసి దాడి చేయగలవు. ఇది అన్ని దేశాల నావీలకి వర్తిస్తుంది.
ఇక్కడే ఇరాన్ అడ్వాంటేజ్ తీసుకుంది.
ఏ మాత్రం ఆధునిక టెక్నాలజీ లేకుండా చవకగా మిస్సైల్స్ తయారు చేసి వాటిని మూకుమ్మడిగా ప్రయోగిస్తూ అదే సమయంలో అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న నాలుగు మిస్సైల్స్ తో టార్గెట్ ను కొట్టవచ్చు అనేది నిరూపితం అయ్యింది.
ఇరాన్ కి ఒక డాలర్ ఖర్చు అయితే ఇజ్రాయెల్ కి 500 వందల డాలర్లు ఖర్చు అయ్యింది. దీర్ఘకాలిక యుద్ధం అంటూ జరిగితే నష్టపోయేది నాటోతో పాటు ఇజ్రాయెల్ కూడా ఉంటుంది.
ఇరాన్ చేసిన దాడి వల్ల చైనాకి డాటా అనలైజ్ చేసే అవకాశం దక్కింది.
ఇదే తరహాలో తైవాన్ మీద దాడి చేసే అవకాశం ఉంది చైనాకు.
ఆధునిక టెక్నాలజీతో చేసే ఏ ఆయుధం అయినా ఖర్చుతో పాటు సమయం కూడా ఎక్కువగా ఉంటుంది తయారు చేయడానికి. ఈ సమస్య పశ్చిమ దేశాలకి ఉంది చైనాకి ఉండదు.
రష్యా విషయానికి వస్తే క్రమశిక్షణ, training లేని ఉద్యోగుల వల్లనే దెబ్బ తింటున్నది. మరో వైపు రష్యన్ సైనిక జనరల్స్ యుద్ధ వ్యూహాలు కూడా రెండవ ప్రపంచ యుద్ద కాలం నాటివి.
చైనా ఇరాన్ విషయంలో ఉత్సాహం చూపించడానికి కారణం చవకగా ముడి చమురుతో పాటు 400 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నది ఇరాన్ లో. ఇజ్రాయెల్ వల్ల ఇరాన్ దెబ్బతింటే అది ఇరాన్ కంటే చైనాకే నష్టం.
అందుకే చైనా ఉత్తర కొరియాతో పాటు ఇరాన్ కి కూడా హైపర్ సానిక్ మిసైల్ టెక్నాలజీ ఇచ్చింది. ప్రస్తుతం ఇరాన్ దగ్గర హీన పక్షం 10 హైపర్ సానిక్ మిసైళ్ళు ఉండవచ్చు అని అంచనా!
వీటిని ఉపయోగించి Nevatim ఎయిర్ బేస్ ను ధ్వంసం చేస్తుంది అనే భయం అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కి కూడా ఉంది.
ఇజ్రాయెల్ చిన్న దేశం అవడం వలన తన కీలక అణ్వాయుధాలు, F35 లని Nevatim ఎయిర్ బేస్ నుండి సురక్షిత ప్రాంతానికి తరలించలేదు!
ఇరాన్ అమెరికా తో పాటు ఇజ్రాయెల్, జోర్డాన్, సౌదీ, UAE లకి హెచ్చరిక చేస్తున్నది అంటే డర్టీ బాంబ్ ను కూడా సిద్ధం చేసింది అని అనుకోవాలి.
ఏ మాత్రం పరిస్థితి అదుపు తప్పినా ఇరాన్ ఈసారి టెల్ అవీవ్, జెరూసలేం మీద దాడి చేస్తుంది. ఇప్పటికే ఈ హెచ్చరిక చేసింది కూడా!
********
అయితే ఇరాన్ ను కట్టడి చేయడం ఇజ్రాయెల్ కి కష్టమా?
ఇరాన్ ఎయిర్ ఫోర్స్ చాలా బలహీనమైనది!
ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ఎక్కువగా సోవియట్ కాలం నాటి S200 మీద ఆధారపడి ఉంది. రెండు రెజిమెంట్లు S300 లు ఉన్నాయి!
ఇజ్రాయెల్ F-35 లు చాలా తేలికగా ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ని జామ్ చేసి దాడి చేయగలదు. అమెరికాతో పాటు జపాన్ దగ్గర ఉన్న F35 లు వేరు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న F35 లు వేరు.
ఇజ్రాయెల్ తన స్వంత టెక్నాలజీ ను వాడి జామర్లని అమర్చుకున్నది F35 లకి.
ఈ రోజు చేసిన దాడిలో ఇరాన్ షహీద్ కామి కాజ్ డ్రోన్లు తయారు చేసే ఫాక్టరీని ధ్వంసం చేసింది ఇజ్రాయెల్!
అణు విద్యుత్ ప్లాంట్ జోలికి పోలేదు!….. Article By… Potluri Parthasarathy
Share this Article