ఏదో పెద్దదే జరగబోతున్నది! రష్యాకు చెందిన IL – 76 రవాణా విమానం మాస్కో నుండి టెహ్రాన్ చేరుకుంది! రష్యన్ IL – 76 ట్రాన్స్పోర్ట్ విమానం హెవీ మెషిన్స్ లేదా ఎక్కువ బరువు కల ఎక్విప్మెంట్ ను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు!
తక్కువ పరిథిలో విధ్వంసం సృష్టించగల అణు బాంబు ఉన్న వార్ హెడ్ ను తీసుకొచ్చి ఉండవచ్చు! దానిని ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ మిస్సైల్ తో అనుసంధానం చేయడానికి కావొచ్చు!
లేదా MIRV ( Multiple Indipendently Targetble Re entry Vehicle) వార్ హెడ్ ను తీసుకొని వచ్చి ఉండవచ్చు!
MIRV కి ఏ దేశం దగ్గరా సమాధానం లేదు ఇప్పటి వరకూ!
Ads
********************
ఇరాన్ దగ్గర FATAH – 1 హైపర్ సానిక్ మిసైళ్ళు కనీసం 40 వరకూ ఉన్నాయని తెలుస్తున్నది! ఇక FATAH – 2 హైపర్ సానిక్ మిస్సైల్స్ 30 వరకూ ఉండవచ్చు! FATAH – 1 హైపర్ సానిక్ మిస్సైల్ వేగం MACH – 15 అంటే శబ్ద వేగానికి 15 రెట్లు! వేగం కనుక MACH 5 దాటితే అది హైపర్ సానిక్!
FATAH- 1 హైపర్ సొనిక్ వేగం MACH 15 అని ఇరాన్ చెప్తున్నది. అదే కనుక నిజం అయితే ప్రపంచంలో ఏ దేశం దగ్గర కూడా MACH 15 వేగంతో వచ్చే మిసైల్ ను ఇంటర్సెప్ట్ చేయగల వ్యవస్థ లేదు! ఇజ్రాయెల్ ప్రమాదంలో ఉన్నది! టెహ్రాన్ నుండి FATAH 1 ను ప్రయోగిస్తే అది TEL AVIV చేరుకోవడానికి 400 సెకన్లు లేదా 6 నిముషాలు పడుతుంది! INTERCEPT లేదా అడ్డుకోవడం అసంభవం!
**************
ఇరాన్ దాడి చేయక ముందే అమెరికాతో పాటు ఇతర నాటో దళాలు కలిసి ఇరాన్ మీద దాడి చేసే అవకాశం ఉంది! అమెరికా తన విమాన వాహక నౌక అయిన USS ROOSEVELT ను హర్మోజ్ జలసంధి ( STRAIT OF HORMUZ) లో ఇరాన్ తీరానికి దగ్గరలో మొహరించింది నిన్న!
ఇప్పటికే మధ్యధరా సముద్రంలో ఉన్న రెండు అమెరికన్ యుద్ధ నౌకలకి తోడుగా మరో రెండు నౌకలని పంపింది . SO! చాలా పెద్ద దానికే ప్లాన్ చేస్తున్నది ఇరాన్ రష్యా తో కలిసి! హర్మ్యూజ్ జలసంధి కనుక యుద్ధ క్షేత్రం అయితే ఇరాన్ నుండి క్రూడ్ ఆయిల్ సరఫరా ఆగిపోతుంది!
ఫలితంగా క్రూడ్ ఆయిల్ ధర పెరగడంతో పాటు బంగారం ధర తగ్గుతుంది! మదుపరులు క్రూడ్ షేర్ల మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి బులియన్ మార్కెట్ నుండి తమ పెట్టుబడులు తగ్గిస్తారు! 2024-25 సంవత్సరాలు బహు కష్ట కాలం!……. [ పోట్లూరి పార్థసారథి ]
Share this Article