.
ఇజ్రాయేల్ Vs హెజబోల్లా part 6…
అక్టోబర్ 1వ తేదీన ఇరాన్ తన భూభాగం నుండీ 200 కి పైగా బాలిస్టిక్ మిస్సయిల్స్ ని ఇజ్రాయేల్ మీదకి ప్రయోగించింది! ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇరాన్ ప్రయోగించిన క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ కంటే గత మంగళవారం ప్రయోగించిన బాలిస్టిక్ మిసైల్స్ కొంచెం అడ్వాన్స్ టెక్ కలిగివున్నాయి!
Ads
ఇరాన్ 200+,హెజ్బొల్లా 40, యెమెన్ హుతి 20 కలిపి దాదాపుగా 300 మిసైల్స్ ప్రయోగించారు ఇజ్రాయేల్ మీదకి! ఇజ్రాయేల్ కి ఎంత నష్టం జరిగింది? ఇరాన్ మిసైల్ దాడి మీద వార్తలు అందించే ప్రెస్ మీద ఆంక్షలు (సెన్సార్ ) విధించింది ఇజ్రాయేల్! కాబట్టి CNN, FOX NEWS, BBC లాంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు ప్రచురించిన వివరాలు అంత నమ్మతగ్గవిగా ఉండకపోవచ్చు!
ఆఫ్కోర్స్! టైమ్స్ ఆఫ్ ఇజ్రాయేల్, జెరూసలేం పోస్ట్ లాంటివి ప్రాణ నష్టం లేదనీ, ఇజ్రాయేల్ లో ఉన్న ఒక పాలస్తిాన యువకుడు మరణించాడు అని రిపోర్ట్ చేశాయి. అయితే అన్ని మీడియా అవుట్ లెట్స్ కూడా బాలిస్టిక్ మిసైల్స్ జనావాసాలకి దూరంగా పడ్డాయి అన్నాయి. కొన్ని మిసైల్స్ మధ్యధరా సముద్రంలో పడ్డాయి అన్నది నిజమే!
So! ఏప్రిల్ దాడి తరువాత అక్టోబర్ దాడి కూడా అంతగా సఫలం కాలేదని చెప్పవచ్చు! ఇరాన్ తన మిసైల్ ఎటాక్ ద్వారా అవి ఎంత ఖచ్చితంగా టార్గెట్ మీద దాడి చేయగలిగాయనే డేటాని విశ్లేషణ చేయకుండా ఉండడానికి ఇజ్రాయేల్ వార్తల మీద సెన్సార్ విధించింది. మిసైల్ లో వాడే నావిగేషన్ సిస్టమ్ ని మెరుగుపరుచుకునే అవకాశం ఇరాన్ కి లేకుండా చేసింది!
******************
ఇరాన్ మిసైల్ టెక్నాలజీ లో గణనీయమైన మార్పు!
ఇరాన్ దగ్గర 3,000 బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయని అంచనా! అయితే అవి అన్నీ సుదూరం ప్రయాణించేవి కావు.
అక్టోబర్ 1 న ప్రయోగించిన బాలిస్టిక్ మిసైల్ పేరు ఫతా -1 ( Fattah 1). రేంజ్ 1400 km ( 870 miles ).
గత ఏప్రిల్ నెలలో ప్రయోగించిన బాలిస్టిక్ మిసైల్స్ లిక్విడ్ ప్రొపెలెంట్ తో ఎగిరేవి కాగా మంగళవారం ప్రయోగించిన మిసైల్స్ సాలిడ్ (ఘన ఇంధనం ) ప్రొపెల్లెంట్ తో నడిచేవి.
గత ఏప్రిల్ లో ఇరాన్ మిసైల్స్ ప్రయోగిస్తున్నట్లు ముందుగా తెలిసిపోయింది. ఎందుకంటే ద్రవ ఇంధనం రాకేట్లలోకి నింపాలి అంటే గంట ముందే ఆ పని చేస్తారు. అదీ బహిరంగ ప్రదేశంలో చేయాలి కాబట్టి సాటిలైట్లకి దొరికిపోతాయి! ఈసారి ఘన ఇంధనంతో నింపారు కాబట్టి ఆల్రెడీ ఎక్కడో నింపేసి ప్రయోగించే సమయానికి బయటికి తెచ్చారు.
ఈసారి ఎలాంటి ఇంటెలిజెన్స్ లీక్ లేదు ఇరాన్ నుండీ!
ఆస్తుల నష్టం వుందా లేదా అనేది ఇతమిద్ధంగా తెలియరాలేదు!
లెబనాన్ నుండీ హెజ్బొల్లా ప్రయోగించిన మిసైల్స్ మాత్రం ఇజ్రాయేల్ ఎయిర్ బేస్ ల మీద పడ్డాయి.
1.నెగెవ్ ఎడారి లో ఉన్న నేవటిమ్ (Nevatim ) ఎయిర్ బేస్ మీద మిసైల్ దాడి జరిగింది. ఈ ఎయిర్ బేస్ లో F-35 లు ఉన్నాయి. ఇజ్రాయేల్ డిజిటల్ మేఘాలు ( Digital Clouds ) ని సృష్టించడం వలన సాటిలైట్ తో ఫోటో తీసినా తెల్లటి మేఘాలు ఉంటాయి తప్పితే ఏమీ కనపడదు. ఎన్ని F 35 లు దెబ్బతిన్నాయో ఇజ్రాయేల్ చెప్పదు.
2.నెట్ జరిమ్ ( Netzarim ), టెల్ నోఫ్ (Tel Nof ) ఎయిర్ బేస్ లు దాడి కి గురయ్యాయి.
3. 100 ఇళ్ళు దెబ్బతిన్నాయి.
*********************
మరి ఇజ్రాయేల్ ఎయిర్ డిఫెన్స్ సంగతి ఏమిటి?
ఇజ్రాయేల్ ఎయిర్ డిఫెన్స్ ప్రాబబులిటీ 60% మాత్రమే!
అమెరికా సహాయం లేకపోతే ఇజ్రాయేల్ దారుణంగా నష్టపోయేది అన్నది నిజం! గత ఏప్రిల్ దాడి, అక్టోబర్ 1 దాడులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి!
రెండు సార్లు అమెరికా అడ్డుపడింది.
అక్టోబర్ 1న తూర్పు మధ్యదరా సముద్రంలో ఉన్న రెండు డిస్ట్రాయర్స్ ఉన్నాయి ఆరోజు.
USS COLE మరియు USS BULKELEY అనే రెండు గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు ఇరాన్ నుండీ వస్తున్న మిసైల్స్ లో దాదాపు 20 మిసైల్స్ ని మార్గ మధ్యంలో ఉండగానే కూల్చేసాయి.
ఈ రెండు డిస్ట్రాయర్లు Aegis Ballistic Missile Defence System ని కలిగి ఉన్నాయి.
SM 3 మిసైల్స్ ని ప్రయోగించి ఇరాక్ మిసైల్స్ ని కూల్చేసాయి.
ఒక్కో SM 3 మిసైల్ ధర 27 మిలియన్ డాలర్లు!
అమెరికా తన రక్షణ బడ్జెట్ లో కోత పెట్టింది ఈ ఆర్ధిక సంవత్సరం. దానిలో భాగంగా SM 3 మిసైల్స్ ప్రోడక్షన్ కోసం నిధులు కేటాయించలేదు.
ఇప్పుడు మళ్ళీ SM 3 ANTI BALLISTIC MISSILE కోసం బడ్జెట్ ఇవ్వాల్సి ఉంటుంది!
దీనిని చూస్తే ఏమర్ధమవుతుంది?
చీప్ మిసైల్స్ ని ఎదుర్కోవడానికి ఖరీదైన మిసైల్స్ ని వాడాల్సి వచ్చింది. ఈ లెక్కన ఇరాన్ అంతో కొంత విజయం సాధించినట్లే కదా?
ఇక ఇజ్రాయేల్ తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఎలా వాడింది?
ఇజ్రాయేల్ కి మూడు అంచెల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది.
1.ఐరన్ డోమ్. దీని పరిధి 70 km. రాకెట్లు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్స్ లాంటి వాటిని మాత్రమే కూల్చే విధంగా రూపొందించారు కాబట్టి బాలిస్టిక్ మిసైల్స్ ని ఏమీ చేయలేదు. 10 km పరిధిలో మాత్రమే అడ్డుకోగలదు.
2.David’s Sling Air Defence System. దీని పరిధి 300 km. అంటే మిడ్ రేంజ్ అన్నమాట! బాలిస్టిక్ మిసైల్ ని ఎదుర్కొగలదు అదీ 300 km పరిధిలోకి వచ్చినప్పుడు మాత్రమే. కానీ 15 km వరకు మాత్రమే అడ్డుకోగలదు.
3.Arrow Air Defence System. దీని పరిధి 2000 km. అఫ్కోర్స్, భూ ఉపరితల వాతావరణం దాటి వెళ్లి బాలిస్టిక్ మిసైల్స్ ని కూల్చగలదు. ఈ సిస్టమ్ మాత్రమే ఇజ్రాయేల్ ని రక్షించింది!
So! మొత్తానికి 60 శాతం మాత్రమే సఫలం అయ్యాయి!
మరి ఇరాన్ సక్సెస్ రేట్ ఎంత?
కనీసం 15 మిసైళ్ళు ఇరాన్ లోని పట్టణాలలో పడిపోయాయి! మరో 20 దాకా సముద్రంలో పడ్డాయి.
ఒక్క మిసైల్ మాత్రం మోస్సాద్ ప్రధాన కార్యాలయం సమీపంలో పడ్డది.
ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ యాక్యూరసీ 100 మీటర్లు. కానీ వాస్తవంలోకి వచ్చే సరికి అది 500 మీటర్లుగా ఉంది అంటే అర కిలోమీటర్.
అదే ఇరాన్ కనుక 500 మిసైల్స్ ని ఒకే సారి ప్రయోగించినట్లయితే ఇజ్రాయేల్ కోలుకోలేని విధంగా నష్టపోయేది!
సో, ఇజ్రాయేల్ ఎప్పటికీ శత్రు దుర్భేద్యం కాదు! Contd.. Part 7 …… (పొట్లూరి పార్థసారథి)
Share this Article