ఇదొక ఇంట్రస్టింగు జానర్… మలయాళం వాళ్లకే ఇలాంటి ప్రయోగాలు, ఆలోచనలు వస్తాయి తప్ప మనవాళ్లకు రావు… వచ్చినా తీయరు… అఫ్ కోర్స్, మనవాళ్లు తీసినా ఎవరూ చూడరు, ఎందుకంటే, చూసేలా తీయరు… ఈ ఉపోద్ఘాతం దేనికంటే… మన కోడి మెదళ్లకు ఒకే ఫార్ములా తప్ప మరొక టేస్ట్ తెలియదు…
మలయాళంలో గత ఏడాది ఓ సినిమా వచ్చింది… దాన్ని సినిమా అనవచ్చా అనకండి, ఫీచర్ ఫిలిమేనా అని నొసలు ముడేయాల్సిన అవసరమూ లేదు… గంటన్నర సేపు ఉంటుంది… నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు వెర్షన్‌తో కూడా ఉంది… అది ఫిక్షన్ కాదు… రియల్ స్టోరీ…
గతంలో టీవీలో ఓ భీకరమైన డిక్షన్‌తో నేరాలు ఘోరాలు వంటి టీవీ క్రైమ్ షోస్ వచ్చేవి కదా… ఎదురుగా ఎవరో సైకో కిల్లర్ నిలబడి అరుస్తున్నట్టుగా కామెంటరీ ఉండేది… అందులో రియల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌నే నటీనటులను బెట్టి సీన్ రీక్రియేట్ చేసేవాళ్లు… డ్రామా కోసం కొంత క్రియేటివ్ ఫ్రీడం తీసుకునేవాళ్లు… పర్లేదు, జనం తిట్టుకుంటూనే చూసేవాళ్లు బాగానే…
Ads
ఇప్పుడు నేను చెబుతున్న ఈ సినిమా పేరు కర్రీ అండ్ సైనైడ్… దీన్ని ట్రూ క్రైమ్ డాక్యుసీరీస్ జానర్ అంటారట… అంటే వాస్తవ నేర కథల్నే ఓ డాక్యుమెంటరీగా ప్రజెంట్ చేయడం… నటీనటులు వేరేగా ఉండరు, సీన్ రీక్రియేషన్ ఉండదు… జరిగిన సంఘటనలు టీవీల్లో రిపోర్ట్ అయినవే కొన్ని షాట్స్ తీసుకుని, ఆ నేరకథల్లో ముఖ్యులను, ఇతరులను ఇంటర్వ్యూలు చేస్తూ… ఓ కథాగమనాన్ని రాసుకోవడం…
ఎక్కడా బోర్ రాకుండా గ్రిప్పింగ్‌గా ప్రజెంట్ చేయడం… ఈ సినిమా అదే… ఆసక్తికరంగా తీశారు… ఒక ఇల్లాలు రకరకాల కారణాలతో తనకు నచ్చని ఆరుగురిని సింపుల్‌గా, గుట్టుచప్పుడు కాకుండా హతమారుస్తుంది… కూడత్తయ్ సైనైడ్ కిల్లింగ్స్ అని కేరళలో సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టోరీ ఇది… జాలీ జోసెఫ్ కేస్ అంటారు… అదే ఆమె పేరు… భర్త, అత్త, మామ… ఇలా తన కుటుంబానికే చెందిన ఆరుగురిని హతమారిస్తే 14 ఏళ్లు అలా సాగిపోతాయి తప్ప ఎవరికీ డౌట్ కూడా రాదు…
మంచి రెస్పెక్టబుల్ ఫ్యామిలీ… గుండె పోటు, ఇతరత్రా మరణాలుగా అంత్యక్రియలు జరిపించేస్తారు… పోస్ట్ మార్టం జోలికి వెళ్లరు… అనుకోకుండా ఆమె ఆడపడుచుకు ఓ డౌట్ వస్తుంది… ఎందుకొచ్చింది..? ఎక్కడ పట్టుకుంది అసలు పాయింట్..? అసలు ఆ గృహిణికి సైనైడ్ ఎలా దొరికింది..? దానికి ఏం వేషాలు వేసింది..? ఇంతమందిని ఎందుకు చంపింది..? ఇదే కథ… తరువాత పోలీసులు, దర్యాప్తు, వెల్లడైన నిజాలు ఆసక్తికరమైన కథనం…
ఇలాంటి జానర్‌కు పకడ్బందీ ఎడిటింగ్, మంచి స్క్రీన్ ప్లే ప్రధానం… ఎందుకంటే, ఇందులో క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకోవడానికి కూడా ఏమీ ఉండదు… ఆ క్రైమ్ స్టోరీనే నటీనటులు లేకుండా చెప్పాలి… ఇంట్రస్టింగ్, చాలెంజింగ్ టాస్కే… బాగుంది… ఇండియాటుడే ఒరిజినల్స్ తీసిన కొత్త తరహా సినిమా… క్రైమ్ కథల్ని చెప్పడంలో మలయాళీ ఇండస్ట్రీ రూటే వేరు…!
Share this Article