Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జగన్ బొద్దింకల్ని ముద్దాడటం వెనుక ఇంత పే-ద్ద కథుందా..?!

October 18, 2026 by M S R

.

అరెరె, జగన్ ఏమన్నాడు..? తాము కూడా బొద్దింకలమే అన్నాడు కదా… అంటే జెన్‌జీ మద్దతు కోసమా..? దీప్కే కూడా థాంక్స్ చెప్పాడట కదా… బొద్దింకల పట్ల జనం ఆసక్తి పెరుగుతోంది కాబట్టి జై కాక్రోచ్ అంటున్నాడా..? బొద్దింకల్ని ఇలా ముద్దాడటం వెనుక మర్మమేంటి..? యువత జగన్ వైపు వెళ్తే… అసలే కూటమి మీద వ్యతిరేకత పెరుగుతోంది… అబ్బో, జగన్‌కు యూత్ మద్దతు పెరగడం మంచిది కాదు… మరేం రాద్దాం..?

విదేశీ శక్తుల కుట్ర అని రాద్దాం… మోడీ ప్రభుత్వాన్ని పడేయటానికి విదేశీ శక్తులు, ప్రత్యేకించి అమెరికా కుట్రల గురించి రాద్దాం… పనిలోపనిగా జగన్ మెడలోనూ వేసేద్దాం… ఎస్, ఇదే కరెక్టు… పోనీ, ఇలా రాసేద్దాం… జగన్‌కూ మోడీకి బెడిసింది… ఎక్కడో తేడా కొట్టింది… అందుకే జగన్ అక్రమాస్తుల కేసులపై ఇక రోజువారీ విచారణలకు నిర్ణయం జరిగిపోయింది…

Ads

దాంతో ఇక మోడీతో గుప్తస్నేహానికి గుడ్‌బై అంటున్నాడు జగన్… బీజేపీ చెప్పినట్టు ఆడినా ఇక లాభం లేదనే నిర్ణయానికి వచ్చేశాడు… కాంగ్రెస్ వైపు కదులుతున్నాడా..? అవునూ, బొద్దింకలు ఇలాంటి అవినీతిపరుల పట్ల సానుకూలంగా ఉంటే వాళ్ల విశ్వసనీయత పోదా..? ఆమాత్రం ఆలోచించుకోవడం లేదా..? జగన్ వంటి నేతల్ని పక్కన పెట్టుకుంటే సీజేపీకి అవినీతి సొమ్ము అందుతోందనే భావన పెరిగిపోదా..? సీజేపీ రెచ్చిపోతే మోడీ బొద్దింకల్ని నలిపేయడం చిటికెలో పని…

అసలు ఈ బొద్దింకల వెనుక ఎవరున్నారు..? విదేశీ శక్తులేనా..?  విదేశీ శక్తులు అప్పటి ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ను, అనిల్ అంబానీని ప్రయోగించి మోడీని దింపేయాలని, రాహుల్ గాంధీకి పట్టం కట్టాలని చూశాయి… అమెరికాకే కాదు, పలు విదేశాలకు ఇండియా అభివృద్ధి ఓర్వలేకుండా మారింది… అసలే పలు పార్టీల మద్దతుతో ఉన్న ప్రభుత్వం కదా, ఆ పార్టీలతో మాట్లాడి, మోడీని దింపేస్తే సరి అనుకున్నాయి ఆ శక్తులు… అందరితోనూ బాగుండే ధన్‌ఖడ్ బెటర్ అని తనను ప్రయోగించారు…

ఆయన నితిశ్ కుమార్‌తో మంతనాలు చేశాడు, కేజ్రీవాల్‌ను కలిశాడు… కానీ దివాలా తీసిన అనిల్ అంబానీని మాత్రం ఏ పార్టీ పట్టించుకోలేదు… మోడీని ఆక్సిజన్ నితిశ్, చంద్రబాబే కదా… నితిశ్‌తో మంతనాలు సరే, మరి టీడీపీతో…? లేదు, లేదు, ధన్‌ఖడ్‌తో నేనెప్పుడూ మాట్లాడలేదని లోకేష్ వివరణ ఇచ్చుకున్నాడు… నితిశ్ కూడా కుదరదుపో అన్నాడు… ఇదంతా తెలిసి మోడీ కళ్లురిమాడు… దిగిపోతావా, దింపమంటావా అన్నాడు…

దెబ్బకు ఉపరాష్ట్రపతి రాత్రికిరాత్రి రాజీనామా చేసి, మళ్లీ పత్తాలేకుండా పోయాడు… మళ్లీ ఇప్పుడు విదేశీ శక్తులు యాక్టివ్ అయిపోయాయా..? ప్రముఖ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే కూడా తాజా అల్లర్ల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం అంటున్నాడు… ఆయన మాటల్ని కొట్టిపారేయలేం… ఎస్, ఇలా రాసేశాం కదా… ఇక పర్లేదు…

జగన్‌తో బాగుంటే నాశనమైపోతార్రోయ్ అని బొద్దింకలను హెచ్చరించినట్టూ అవుతుంది… విదేశీ శక్తులను అన్యాపదేశంగా జగన్ మెడలో వేసినట్టూ అవుతుంది… మోడీని కూడా బహుపరాక్ అని హెచ్చరించినట్టూ అవుతుంది… తద్వారా ఇంకా దూరం పెంచినట్టూ అవుతుంది… మా కూటమి ఇక సేఫ్… మా చంద్రబాబు ఇంకా సేఫ్… హమ్మయ్య… ఈరోజుకు నా కొత్త పలుకు పూర్తయింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జగన్ బొద్దింకల్ని ముద్దాడటం వెనుక ఇంత పే-ద్ద కథుందా..?!
  • ఇడిసిపెట్టలేదు- ఒడిసిపట్టలేదు… హరీష్- కేటీయార్ క్షుద్ర రాజకీయం !
  • కావ్య అనిరుధ్ పెళ్లి … కరుణానిధి – రజినీకాంత్ కుటుంబాల వియ్యం !!
  • నా చిన్నప్పటి ప్రియురాలు… ఈరోజుకూ కలలో పలకరిస్తుంది…
  • ప్రహార్ ! బాలీవుడ్ మరో మేలిమి కథ ! కసబ్ విచారణలో కొత్త కోణాలు !!
  • అమ్మ పేర్చిన బతుకమ్మ అమ్మంత అందంగా ఉండేది…!
  • యూపీలో యోగి *పవర్ తగ్గలేదు! *డీప్ స్టేట్ ఇంకా కష్టపడాలి !!
  • అనూహ్యం- 48 కోట్ల నుంచి 5,800 కోట్ల సంపద! ఎవరీ మహేంద్ర నహతా !!
  • ప్రధాని ఎవరైతేనేం..? టరమ్స్ శాసించేది అంబానీ..! ఇదీ జియో పుట్టుక !!
  • కవిత చెప్పింది ! సాయం చేసిన చేతులనే కాటేసే కేటీయార్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions