Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హోప్‌లెస్ సీఎం విజయ్… హీరో గారి జ్ఞానశూన్యతపై ఇదీ చార్జ్‌షీట్…

November 29, 2026 by M S R

.

పిచ్చిజనం… అవును, జనాన్నే నిందించాలి… టీవీకే విజయ్‌కు రాజకీయం ఏం తెలుసు..? పాలన ఏం తెలుసు..? ప్రజల మనోభావాలు ఏం తెలుసు..? ఫ్యాన్లకు, డ్రైవర్లకు టికెట్లు ఇస్తే జనం వోట్లేసి గుడ్డిగా గెలిపించారు… అందుకే అనేది మూర్ఖజనం అని.., మన ప్రజాస్వామ్య చీకటికోణం ఇది…

1. ఓ ఎమ్మెల్యే… పేరు విఘ్నేష్… ఏకంగా కలెక్టర్‌కు (పద్మజ) బూతు మెసేజులు పంపించాడు… బంగ్లాకు వెళ్లి వేధించే ప్రయత్నం చేశాడు… ఆమె మొదట కిమ్మనలేదు… తరువాత వివాదం ముదిరింది… మొత్తం ఐఏఎస్ కేడర్ కస్సుమంది… కేసు నమోదైంది… ఐనా సరే విజయ్ కిమ్మనలేదు… హైకోర్టు ఆగ్రహం… చివరకు దిక్కులేక ఆ ఎమ్మెల్యేను అరెస్టు చేయాల్సి వచ్చింది… కోర్టులో విజయ్‌కు ఓ దెబ్బ…

Ads

padmaja ias

2. ఎమ్మెల్యే బద్రుద్దీన్… ఏకంగా మధుర మీనాక్షి అమ్మవారి గుడి గోపురం మీదకు ఎక్కాడు… అదేమంటే, నేను ఎమ్మెల్యేను, ఏదైనా ఎక్కుతాను అన్నాడు… విజయ్ కిమ్మనలేదు… హైకోర్టు కస్సుమంది… ఎవడివిరా నువ్వు అని కోపగించింది… విజయ్‌కు మరో దెబ్బ…

3. డిప్యూటీ స్పీకర్ ఎం.రవిశంకర్ ఏ సామాన్య పౌరుడిపై దాడి చేశాడనేది ఆరోపణ… తురైయూర్‌కు చెందిన కార్తీక్ కుమార్ అనే వ్యక్తి తాగునీటి కొరత, చెత్త పేరుకుపోవడంపై తనను నిలదీస్తే, తనపై చెంపదెబ్బ కొట్టి, కాలితో తన్నాడని ఆరోపణ… విజయ్ కిక్కుమనలేదు…

tiruparakundram

4. టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 30 కోట్ల చొప్పున 10 మందికి ఎరవేశారని మరో ఎమ్మెల్యే ఇళయరాజా ఆరోపణ… పిచ్చి కూతలు… టీవీకే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఒక్కొక్కరికి రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఆఫర్లు వచ్చాయని మంత్రి నిర్మల్ కుమార్ ఆరోపించాడు…

5. నాగపట్నం జిల్లాకు చెందిన పార్టీ నిర్వాహకుడు… చెన్నై నుంచి సముద్ర మార్గం ద్వారా శ్రీలంకకు డ్రగ్స్ రవాణా చేసే అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాకు సదరు నేత సూత్రధారిగా తేలింది… ఎప్పటిలాగే విజయ్ కిక్కుమనలేదు…

6. పెరంబూరు నియోజకవర్గంలో 53,715 ఓట్ల మెజారిటీతో తన గెలుపును సవాలు చేస్తూ ఓటరు దినేష్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను కొట్టివేయాలంటూ విజయ్ వేసిన క్వాష్ పిటిషన్‌ను జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ తోసిపుచ్చాడు… మరో ఎదురు దెబ్బ…

tvk vijay govt

7. కార్తీకదీపం విషయంలో సుప్రీంకోర్టుకే బురిడీ కొట్టించే రాజకీయం నెరిపాడు… ఓ క్రిస్టియన్ మహిళ సహా తన వాళ్లను ట్రస్టీలుగా చేర్చి, వాళ్లను ముందుపెట్టి కథ నడిపించే ప్రయత్నం చేశాడు… సుప్రీంకోర్టు కస్సుమంది… చివరకు డీజీపీ, సీఎస్, కలెక్టర్‌లపై కోర్టు ధిక్కరణ కత్తులు… విజయ్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ… సుప్రీం ఏమైనా సీరియస్ చర్యలకు దిగితే విజయ్ రాజీనామా చేయడం బెటర్…

8. తన ప్రధాన ప్రత్యర్థి డీఎంకే మోదీ కూటమికి జై అంటోంది… ఇది తమిళ రాజకీయాల్నే మలుపు తిప్పబోతోంది…

9. తూత్తుకుడి జిల్లా, మేల సెక్కరకుడి (Mela Sekkarakudi) గ్రామంలో నవంబర్ 24, 2026 ప్రాంతంలో గురు నానక్ జయంతి (గురుపురబ్) వేడుకలకు స్థానిక అధికారులు అనుమతి నిరాకరించారు… ఇదీ ఓ వార్త…

10. కోయంబత్తూరులో రూ.301 కోట్లతో నిర్మించిన పెరియార్ అరివాలయం లైబ్రరీని విజయ్ అక్టోబర్ 16న ప్రారంభించాడు… అయితే పుస్తకాల కొనుగోలు, రచయితల ఎంపిక, ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియపై రచయిత పెరుమాళ్ మురుగన్ అభ్యంతరాలు లేవనెత్తాడు… దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించి, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ అదనపు బాధ్యతల్లో ఉన్న ఐఏఎస్ అధికారి జయంతిని ఆ బాధ్యత నుంచి తప్పించింది…

11. Guidance Tamil Nadu సంస్థ ద్వారా పరిశ్రమలు, పెట్టుబడులకు సంబంధించిన కీలక సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేరిందన్న ఆరోపణలు… పెట్టుబడుల సమీకరణలో మంచి స్థానంలో ఉండే రాష్ట్రం కాస్తా వచ్చే ప్రాజెక్టులను కోల్పోతోంది…

jananayakan

12. చెన్నై, తేని, కోయంబత్తూరు, మదురై ప్రాంతాల్లో జైళ్లు, పోలీసు కస్టడీ నుంచి ఐదారు హైప్రొఫైల్ ఖైదీల పరారీ ఘటనలు జరిగినట్లు ది ప్రింట్ నవంబర్ 24న ప్రచురించింది…

… ఎస్, సినిమా రచయితలు రాసిచ్చిన డైలాగుల్ని వల్లించడం కాదు పాలన అంటే… పైన చదివారు కదా… వరుసగా 8 దెబ్బలు… కనిపించనివి ఎన్నో… ఒకవేళ విజయ్ ప్రభుత్వంపై (ఆరు నెలల గడువు పరిమితి తీరింది కదా) డీఎంకే అవిశ్వాసం ప్రవేశపెడితే కథ ఇంకో రకంగా మారబోతోంది…

కానీ… విజయ్ మన ప్రజాస్వామ్య నెగెటివ్ కోణానికి ఓ సూచిక… మన వోటర్ల విజ్ఞతలేమికి ఓ ప్రతీక… చూడాల్సి ఉంది… ఇంకా ఇంకా…చదవటానికి కటువుగా ఉన్నా, నిష్ఠురంగా ఉన్నా ఇదే నిజం..!!

మధురై కలెక్టర్(విజయ్ చెప్పడంతో… సుప్రీంకోర్టు కళ్లకు గంతలు కట్టడానికి ప్రయత్నించిన మధురై కలెక్టర్ నిశాంత్ కృష్ణ… తనపై సుప్రీం సీరియస్ యాక్షన్ తీసుకోనుందని సమాచారం… పైగా జీవితకాలం ఈ రెడ్ మార్క్ తన కెరీర్‌ను వెంటాడుతుంది… దీపం వెలిగించడం కలెక్టర్ పని కాదు అని సుప్రీంకు జవాబు చెప్పడం ఓ బ్లండర్)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హోప్‌లెస్ సీఎం విజయ్… హీరో గారి జ్ఞానశూన్యతపై ఇదీ చార్జ్‌షీట్…
  • దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలకు కేంద్రం పరిష్కారం చూపిందా?
  • ఉప్పూనిప్పూ కలయిక! హరీశ్ తదుపరి అడుగులపై మళ్లీ చర్చ!!
  • మధురై కార్తీకదీపం… ఇద్దరే ఇద్దరు… ఆరిపోకుండా చూశారు…
  • నేలపై మెతుకులు ఏరుకున్న ‘పెళ్లి భోజనం’! దిక్కుమాలిన పెళ్లి జాతర!!
  • పాకిస్థాన్ ఎడారుల్లో తెలుగు బంధువులు!
  • నెట్‌ఫ్లిక్స్ పాకిస్థానీ కంటెంట్ వివాదం! కేంద్రం ఊరుకోవాలా..?!
  • యూపీ సభా? బహిరంగసభా? డీలిమిటేషన్‌ పర్వంలో ఓ ఉపకథ!!
  • ఇండస్ట్రియల్ పాలసీ 2.0 … గ్లోబల్ సమ్మిట్ వేదికగా 11 కొత్త పాలసీలు!!
  • మీరు బహుశా ఈ సినిమా గురించి విని ఉండకపోవచ్చు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions