.
నిన్ననే కదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రత్యేక ఎక్స్‌క్లూజివ్ కథనం అని ఫస్ట్ పేజీలో రాసుకొచ్చాడు… ఏమని..?
‘మొన్నటి ఎన్నికల దెబ్బతో జగన్ వణికిపోతున్నాడు… కేంద్రంలో కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం… అసలే కేసులు, ఏం కక్ష సాధిస్తారో అనే భయంతో దిగివస్తున్నాడు… కాంగ్రెస్ శిబిరంలో చేరడానికి వీలుగా… ఇన్నాళ్లూ తీవ్రంగా తనతో ఆస్తి పంపకాల కోసం పోరాడుతున్న చెల్లితో రాయబేరాలు మొదలుపెట్టాడు, దాదాపు కొలిక్కి వచ్చినట్టే… తను కాంగ్రెస్ వైపు చేరకుండా ఆమె అడ్డుపడుతుందనే భావనతోనే ఈ రాజీ…’
Ads
… ఇదే కదా తను రాసుకొచ్చింది… కానీ తెల్లవారే పూర్తి భిన్నమైన ట్విస్ట్… పూర్తి కంట్రడిక్షన్‌తో వార్తలు కనిపిస్తున్నాయి… అఫ్‌కోర్స్, అవి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో… సోకాల్డ్ యెల్లో టీవీల్లో కూడా కనిపించకపోవడం ఆశ్చర్యమే… జగన్ వైపు మళ్లీ వేలెత్తి చూపేందుకు వాటికి ఉపయోగపడే వార్త… సరే, ఆ వార్త ఏమిటంటే..?
(ది పయనీర్ ఆంగ్ల పత్రికలో కనిపించింది… కొన్ని వాట్సప్ గ్రూపుల్లో… ముచ్చట ఈ వార్తల్ని ధ్రువీకరించడం లేదు… ఎన్‌సీఎల్‌టీ సమాచారాన్ని కూడా వాట్సప్ గ్రూపులు స్క్రీన్ షాట్స్ పెడుతున్నాయి… )
‘‘జగన్, ఆయన భార్య భారతి కలిసి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో (NCLT) ఓ పిటిషన్ దాఖలు చేశారు… తన చెల్లెలికి ప్రేమతో సరస్వతి పవర్ షేర్లు ఇస్తే ఆమె రాజకీయంగా తనతో విభేదించి, విరోధించి విమర్శలు చేస్తోందనీ, సో, తల్లికి, చెల్లికి ఇచ్చిన షేర్లను తిరిగి తమ పేరిట బదిలీ చేయాలని’’ ఆ పిటిషన్ సారాంశం…
వచ్చే నెల 8న హైదరాబాద్ ట్రిబ్యునల్‌లో విచారణకు రానుందని సమాచారం… ఒకసారి బదిలీ చేసిన షేర్లను, అవి పొందినవారి సమ్మతి లేకుండా తిరిగి వాపస్ తీసుకోవచ్చా..? ఒరిజినల్ డోనర్‌కు బదిలీ అవుతాయా..? ఇదీ ఆస్తుల రిజిస్ట్రేషన్లలో గిఫ్ట్ డీడ్లలాంటి వ్యవహారమేనా..? ఇది న్యాయనిపుణులు, అదీ కంపెనీ చట్టాలు తెలిసినవాళ్లు క్లారిటీ ఇవ్వాల్సిందే… అందుకే ఈ వార్త మీద సందేహాలు… ఎన్‌సీఎల్‌టీ విచారణకు స్వీకరించిందీ అనే సమాచారం మీద సందేహం…
(143 పేజీల పిటిషన్ ఒకటి, 21 పేజీల పిటిషన్ మరొకటి… ఈ షేర్ల బదిలీ ప్రాసెస్‌లో ఉందనీ, ఇంకా పూర్తి కాలేదనీ, దాన్ని నిలిపేసి, గతంలో ప్రాసెస్ మొదలుపెట్టిన షేర్ల బదిలీ ఏర్పాటును రద్దు చేసి, తమ షేర్లు తమకే ఉంచేయాలనేది జగన్ దంపతుల వాదనగా తెలుస్తోంది… షేర్ల బదిలీ పూర్తిగా గిఫ్ట్ డీడ్ తరహాలో గాకుండా ఓ సంక్లిష్టమైన ఒప్పందం టైపులో ప్రయత్నించినట్టున్నారు… చట్టబద్ధంగానే…)
ఈ వార్తే నిజమైతే… తనతో విరోధించిన షర్మిలతో జగన్ ఎలాంటి రాజీ ప్రయత్నాలు చేయడం లేదనీ, ఆంధ్రజ్యోతి కథనం పూర్తిగా అబద్ధమనీ తేలుతుంది… చూశారా, చూశారా, జగన్ తన సొంత చెల్లి, తల్లి మీద ఎంత ద్వేషాన్ని చూపిస్తున్నాడో, ఆస్తి పంపకం చేయాలని ఆమె కోరుతుంటే, గతంలో ఇచ్చిన షేర్లను కూడా లాక్కుంటున్నాడు… అని ప్రచారం చేయడానికి ఈ వార్తను ఈనాడు, ఆంధ్రజ్యోతి టాంటాం చేయాలి కదా… ఎలా వదిలేశాయబ్బా…! మీడియా, పొలిటికల్ సర్కిళ్లలో ఇదీ చర్చ..!!
Share this Article