.
జగన్ మోహన్ రెడ్డి ఉగాది పంచాంగ శ్రవణం పెద్ద విశేషమేమీ కాదు… ఈ సందర్భంగా ఆయనను,, తన భార్య భారతిని పంతుళ్లు అక్షితలు జల్లి ఆశీర్వదిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది… జగన్ తిరుమల వెళ్లినా, ఏ హిందూ సంబంధ కార్యక్రమంలో పాల్గొన్నా ఆమె పెద్దగా కనిపించదు, టీడీపీ సోషల్ మీడియా అదే విమర్శిస్తూ ఉంటుంది కదా… సో, ఈ భారతి సహా జగన్ ఫోటో కాస్త ఇంట్రస్ట్…
ఐతే రుషికేష్ హోమాలు, పుష్కర స్నానాలు, పంచాంగ శ్రవణాలు జగన్‌కు కొత్తేమీ కాదు… తను ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అయినా సరే, రాజకీయ నాయకుడు కాబట్టి హిందూ సంబంధ ఎక్స్‌పోజర్ ప్రయత్నాలు అధికంగా చేస్తుంటాడు… తండ్రి వైఎస్‌కు ఆ అవసరం రాలేదు, తను కూడా ప్రాక్టీసింగ్ క్రిస్టియనే ఐనా, ప్రతి ఏటా జెరూసెలం వెళ్లొచ్చినా… తను చూడగానే ఓ పెద్ద రెడ్డి తరహాలో పంచెలో కనిపించేవాడు కాబట్టి పెద్దగా ఈ ప్రయత్నాలు తనకు అవసరపడలేదు…
Ads
ఏడుకొండలు కాదు, రెండు కొండలే బాపతు వివాదం మాత్రం తన మీద కొంత వ్యతిరేకత తీసుకొచ్చింది, అంతే… ఐతే ఈరోజు ప్రధానంగా చెప్పాల్సింది సాక్షి ఫస్ట్ పేజీ జాకెట్ యాడ్ గురించి… ఇది చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరిట ఉంది… గతంలో కేసీయార్ జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా… మజ్లిస్‌తో దోస్తీ లేదనీ, ప్రపంచంలోకెల్లా అత్యంత పే-ద్ద హిందువు అని చెప్పుకోవడానికి నానా ప్రయాసపడింది కదా పార్టీ… సేమ్, ఈ యాడ్ కూడా అలాగే అనిపించింది… ఆ యాడ్ ఇదుగో…
అన్ని ఫోటోలూ జగన్ హిందూ మత సంబంధ పూజలు, కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలే… జగనన్న పాలనలో హిందూ ధర్మ రక్షణకు ఏమేం చేశాడో ఏకరువు పెట్టాడు… కొన్ని ఫోటోల్లో భారతి ఉన్నవీ కనిపిస్తున్నాయి, కావాలనే అకామిడేట్ చేసినట్టున్నారు… ఎందుకిలా, ఎన్నడూ లేని రీతిలో జగన్- హిందూ బాపతు ప్రచారం దేనికి..?
పార్టీ, జగన్, కేడర్ ఫుల్లు డిఫెన్సులో పడ్డాయి కాబట్టి… ప్రత్యేకించి తిరుపతి లడ్డూ జంతుఅవశేషాల నెయ్యి, నెయ్యి కాని నెయ్యి జగన్‌ను హిందూ ద్వేషి, హిందూ దైవద్రోహి అన్నంతగా కూటమి పదే పదే ప్రచారం ఊదర గొట్టడంతో జగన్ నిజంగానే బాగా ఆత్మరక్షణలో పడ్డాడు… ప్రత్యేకించి తిరుమల వ్యవహారాల్లో సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి తదితరులు చేసిన అరాచకాలు, అపచారాలు అన్నీ ఇన్నీ కావు… (చివరకు భగవద్గీత పుస్తకాల ప్రచురణ వరకూ…)
కోర్టు నేతృత్వంలోని సీబీఐ జగన్‌ను బాగా ఇరుకునపెట్టేసేలా గాకుండా, ఓ సాఫ్ట్ నివేదికను ఇచ్చిందనే అసంతృప్తితో ఉన్న చంద్రబాబు కూటమి… ఈ అపచారాల నెయ్యిని ఇప్పట్లో వదిలేందుకు సిద్ధంగా లేదు, అందుకే మాజీ సీఎస్ దినేష్ కుమార్‌తో ఓ సిట్ ఏర్పాటు చేసింది… ఇంకా ఇంకా ప్రచారంలో ఉంచడమే చంద్రబాబు స్ట్రాటజీ…

తనకు ప్రత్యక్ష ప్రమేయం ఏమీ లేకపోయినా సరే, అవన్నీ జగన్ మోయాల్సి వస్తోంది… లడ్డూ నెయ్యిపై కరుణాకర్‌రెడ్డి ప్రత్యేకంగా సాక్షిలో రాసిన వ్యాసాలు టీడీపీ కూటమిని మరింత రెచ్చగొట్టి, మరింత ప్రచారానికి దిగేలా రెచ్చగొట్టాయి… జగన్ హిందూ ద్రోహి కాదు అని చెప్పడటానికి కరుణాకర్ రెడ్డి వ్యాసాలు విఫల ప్రయత్నం చేశాయి… అలాంటి ప్రయత్నమే చెవిరెడ్డి యాడ్స్…
కొన్ని ఇరకాటపు పరిణామాలు, బయటపడే యవ్వారాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు… ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అన్నట్టు కొన్నాళ్లు సైలెన్స్ మెయింటెయిన్ చేయాలి… కానీ జగన్ బ్యాచ్ ఇంకా ఇంకా గోకి, పుండు చేసుకోవడంలో పర్‌ఫెక్ట్ కదా… ఇదుగో ఇలాగే..!
Share this Article