అల్లూరి విగ్రహావిష్కరణ హడావుడి ముగిసింది కదా… ఇంకా దుమ్మూదుమారం సద్దుమణగలేదు… ఆంధ్రజ్యోతి అసలే అక్కసుగా ఉందిగా, అలా దుమ్ము చల్లబడనివ్వదు… మా చంద్రబాబుకు ప్రయారిటీ ఏది..? మా తెలుగుదేశానికి సముచిత గౌరవం ఏది..? ఇదే ధ్యాస..? దాంతో జగన్ మీదకు ఏడుపు… జగన్ చెప్పినట్టుగానే ఆహ్వానితుల జాబితా రూపొందిందనీ, గిట్టనివాళ్లను దగ్గరకు రానివ్వలేదనీ ఓ ఆరోపణ… అందుకే పవన్, బాబులు ఈ కార్యక్రమానికి దూరమయ్యారనీ, కిషన్ రెడ్డి జగన్ చెప్పినట్టు నడుచుకున్నాడనీ ఆంధ్రజ్యోతి విమర్శ…
ఇంకోకోణంలో చూద్దాం… జగన్‌కు కాదు, అక్కడికి చంద్రబాబు రావడం మోడీకే ఇష్టం లేదేమో… అందుకే కిషన్‌రెడ్డి జాగ్రత్తగా కట్ చేసి, మీ ప్రతినిధిని పంపించండి అని సన్నాయినొక్కులతో లేఖ పంపించాడేమో… విషయం అర్థమైపోయి చంద్రబాబు అచ్చెన్నాయుడిని పంపాలని నిర్ణయం తీసుకున్నాడేమో… అది కదా అసలు కోణం… గత ఎన్నికలకు ముందు చంద్రబాబు మోడీ మీద వేసిన వీరంగం మోడీ మరిచిపోయాడా..? ఈరోజు వరకూ బాబు ఎంత తపస్సు చేస్తున్నా సరే మోడీ తన దరిదాపులకు రానివ్వడం లేదు… నో అపాయింట్‌మెంట్… బాబుతో వేదిక పంచుకోవడం కూడా తనకు ఇష్టం లేదు… సో, మోడీ, జగన్ ఇద్దరికీ కావల్సింది అదే…
అంతేకాదు, తెలుగుదేశం ఓవరాక్షన్‌తో అసలు తమకు దక్కాల్సిన క్రెడిట్, మీడియా పబ్లిసిటీ వాళ్లు కొట్టేస్తారనే భావన కూడా ఉంటుంది… అచ్చెన్నాయుడు వెళ్లి, సభకు హాజరు గాకుండా మోడీ వచ్చే హెలిపాడ్ వద్దకు వెళ్లే పనేమిటి..? ఇక రఘురామరాజు అక్కడికి రావడం డెఫినిట్‌గా జగన్‌కు ఇష్టం లేదు… అందుకే అనివార్యంగా జాబితా నుంచి ఆ పేరు ఎగిరిపోయింది… రఘురామరాజు బీజేపీ మనిషి కాదు, వైసీపీ మనిషి అసలే కాదు… అనవసర కంట్రవర్సీ… అందుకే కట్…
Ads
ఎస్… పవన్ కల్యాణ్ అక్కడికి రావడం జగన్‌కు ఇష్టం లేదు… జనసేన తమ మిత్రపక్షమే అని చెప్పుకుంటూనే బీజేపీ పవన్ పేరు కట్ చేయడం అంటే, పవన్‌కు బీజేపీ ఏపాటి విలువ ఇస్తున్నదో అర్థం చేసుకోవాలి… జగన్ సూచన మేరకే, తనకు అనుకూలంగా నడుచుకుంటున్న చిరంజీవిని పిలిచారు… బాబువాది పవన్‌తో వేదిక పంచుకోవడం జగన్‌కు ఇష్టం లేదు… పవన్ వెళ్లి ఉంటే మీడియాకు తనే ఫోకస్ పాయింట్ అయ్యేవాడు… అదీ జగన్‌కు ఇష్టం ఉండదు…
నో, మా ఇష్టం వచ్చినట్టు కార్యక్రమాన్ని నడిపిస్తాం అనేంత సోయి, జగన్‌కు నచ్చకపోతే రాకపోనీ అనే వైఖరీ ఇప్పుడు బీజేపీకి లేదు… అనగా కేంద్ర ప్రభుత్వానికి..! పైగా జగన్‌ను కాదని, కార్యక్రమాన్ని మరెవరో హైజాక్ చేసే అవకాశాన్ని తెలుగుదేశానికి, పవన్‌కు ఎందుకిస్తుంది బీజేపీ..? ఏపీ రాజకీయాల్లో హుందాతనం ఎలాగూ లేదు… ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అనేమీ లేదు… అందరూ అందరే… సో, జగన్ చెప్పినట్టు విని, ఏదో మమ అనిపించేసి, చేతులు దులుపుకుంటే సరి అనుకున్నాడు కిషన్‌రెడ్డి… కాకపోతే తప్పుపట్టేవి ఇంకా లేవా ఈ కార్యక్రమంలో..? ఉన్నాయి…
హీరో కృష్ణను పిలవకపోవడం తప్పు… అల్లూరిని జనసామాన్యంలోకి బలంగా తీసుకెళ్లి, ఓ మరవలేని వ్యక్తిగా చిత్రీకరించింది కృష్ణే… అదీ కష్టనష్టాలకోర్చి, వ్యయప్రయాసలకోర్చి… ఇండస్ట్రీలో పెద్దల్ని ధిక్కరించి మరీ…! కృష్ణ అల్లుడు తెలుగుదేశమే అయినా, కృష్ణ కొడుకు రాజకీయాలకు అతీతంగానే ఉంటున్నాడు… టికెట్ల ధరల విషయంలో జగన్ వద్దకు వెళ్లిన అభ్యర్థన టీంలో కూడా ఉన్నాడు… కృష్ణ ఫ్యామిలీ ఎప్పుడూ ఎన్టీయార్, తెలుగుదేశ వ్యతిరేకమే… (గల్లా మినహా…)…
మాజీ కేంద్ర పర్యాటక మంత్రిగా చిరంజీవిని పిలిచారు సరే, మరి కృష్ణంరాజు కూడా మాజీ కేంద్ర మంత్రే కదా… పైగా అల్లూరి సామాజికవర్గం… ఇప్పటికీ మోడీ పట్ల సానుకూలంగా వ్యవహరించే కుటుంబం… తనెందుకు రాలేదు..? సరే, అశోకగజపతిరాజు పేరు జగన్‌కు ఇష్టం లేదని అనుకుందాం… కృష్ణంరాజు, కృష్ణలను పిలవకపోవడం ఖచ్చితంగా తప్పే…!
ఒక్కటి మాత్రం సుస్పష్టం… ఏపీలో సుహృద్భావ వాతావరణంలో హుందాగా ఓ రాజకీయేతర కార్యక్రమం నడిచే పరిస్థితి ఏమాత్రం లేదని..!! అవునూ, ఏపీలో తను ముఖ్యఅతిథిగా ఓ మీటింగు జరుగుతుంటే, మన మిత్రుడు పవన్ కల్యాణ్ రాలేదేమిటని కిషన్‌రెడ్డిని మోడీ అడిగి ఉంటాడా..? అసలు పవన్‌ను తమ మిత్రుడిగా భావిస్తోందా బీజేపీ..?! తనెప్పుడూ చంద్రబాబు మనిషే అనే నిర్ధారణకు వచ్చేసి, లైట్ తీసుకుంటోందా..?! ఇవన్నీ సరే, అప్పట్లో అశోకగజపతిరాజు మీద పోరాడిన ఆయన అన్న బిడ్డ సంచిత అలికిడే కనిపించినట్టు లేదు… ఏమైంది… బీజేపీలో లేదా..? జంపా..?!
Share this Article