ఒక సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ రమణ మీద… తన సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, అదీ కులరాజకీయాల్లో కంపుకొడుతున్న ఒక రాష్ట్రం నుంచి… తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుకు సన్నిహితుడు అని ఆరోపణల్ని వ్యాప్తి చేస్తున్న స్థితిలో………. అదే జడ్జిని భావి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించే స్థితి వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం ఖచ్చితంగా ఓ డిబేటబుల్ సబ్జెక్టు…. కానీ ఎప్పుడైతే సుప్రీం అంతర్గత విచారణలో ముఖ్యమంత్రి చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చి, సదరు ఆరోపణలకు గురైన జడ్జి తప్పేమీ లేదని తేల్చేసి, సీజే పట్టాభిషేకం దిశగా మార్గం క్లియర్ చేసిన దశలో………… రకరకాల ఊహాగానాలు… భవిష్యత్తు పరిణామాలపై అనేక అంచనాలు, ఆశలు గట్రా…! ఒక ముఖ్యమంత్రి ఆరోపణలకు వాల్యూ లేదా అనే పాయింట్ దగ్గర్నుంచి… రేప్పొద్దున జగన్ బెయిల్ రద్దవుతుందా..? మళ్లీ జైలుకు వెళ్లాల్సిందేనా..? అనే పాయింట్ దాాకా రకరకాల చర్చలు, వాదోపవాదాలు, ఆశలు, అంచనాలు, విశ్లేషణలు గట్రా… అయితే ఇవేకాదు…?
- ఎంపీ విజయసాయిపై అధికారుల దురుసుప్రవర్తన ఆరోపణలు, ఫిర్యాదులను ప్రివిలేజ్ కమిటీ తోసిపుచ్చింది…
- ప్రత్యేక హోదా విషయం మరిచిపొమ్మని కేంద్రం పార్లమెంటు సాక్షిగా మరోసారి తేల్చిచెప్పింది…
- విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వందశాతం ప్రైవేటీకరణ తప్పదని మళ్లీ స్పష్టం చేసేసింది…
- తొలిసారిగా… ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాల బిల్లును వైసీపీ వ్యతిరేకించించి, వాకౌట్ చేసింది…
- కేంద్ర ప్రైవేటీకరణ యజ్ఞానికి వ్యతిరేకంగా వైసీపీ భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించింది…
అంటే… బీజేపీ, వైసీపీ దోస్తానాకు తెరపడినట్టేనా..? బీజేపీలోని చంద్రబాబు మనుషులు (తెలుగు బీజేపీ) క్రమేపీ పట్టు సాధిస్తున్నారా..? చంద్రబాబు అండ్ కంపెనీ కోరుకున్నట్టు రేప్పొద్దున జగన్‌ను మళ్లీ జైలుకు పంపిస్తారా..? తద్వారా ఏర్పడే స్పేసులోకి జొరబడి వెళ్లాలని బీజేపీ భావిస్తున్నదా..? అసలు చంద్రబాబుకన్నా జగనే తమకు ప్రమాదకారి అని మోడీషా టీం భావిస్తున్నదా..? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు… సందేహాలు… అవునూ, చంద్రబాబు అండ్ కంపెనీ ఆశిస్తున్నట్టు జగన్ బెయిల్ రద్దు, మళ్లీ జైలు అనేది సాధ్యమేనా..?
Ads
- బెయిల్ నిబంధనల మేరకు జగన్ సాక్షుల్ని ప్రభావితం చేయడం గానీ, విచారణకు సహకరించకపోవడం గానీ లేదు… అంటే బెయిల్ రద్దుకు హేతుబద్ధ కారణాలు లేవు…
- ఒకవేళ రాజకీయ కారణాలతో ఈడీ గానీ, సీబీఐ గానీ జగన్ బెయిల్ రద్దు కోరే పక్షంలో…. అది నేరుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాకా రాదు… వచ్చినా సరే, అంతకుముందు తనపై కంప్లయింట్స్ చేశాడు కాబట్టి అది వేరే ధర్మాసనానికి అప్పగించబడొచ్చు… నిజానికి బెయిల్ రద్దుపై నిజంగానే ఈడీ, సీబీఐ అడుగులు వేయాలనుకుంటే అది సీబీఐ కోర్టు నుంచి స్టార్ట్ కావాలి…
- ఇప్పటికిప్పుడు జగన్ మళ్లీ జైలుకు వెళ్లినా సరే, చంద్రబాబుకు ఉపయోగమే తప్ప బీజేపీకి వచ్చేదేమీ లేదు…
- కొన్ని పొలిటికల్ సెక్షన్లు అనుమానిస్తున్నట్టుగా… మమత, స్టాలిన్, కేసీయార్, జగన్, ఒవైసీ రేప్పొద్దున శరద్ పవార్‌తో కలిసి బలమైన థర్డ్ ఫ్రంటుకు శ్రీకారం చుట్టినా సరే… కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేసినా సరే… మోడీషా చేతులెత్తేసి, సరెండర్ అయ్యే సవాలే ఉండదు… ఎందుకంటే… బేసిక్‌గా బీజేపీ స్థూల స్ట్రాటజీలు వేరు… అవి దీర్ఘకాలికం… ఇప్పట్లో జగన్‌కో, కేసీయార్కో అర్థమయ్యేవి కావు… దీర్ఘకాలం డార్మెంట్ స్టేజీకైనా బీజేపీ రెడీగా ఉంటుంది… ఈ దిశలో మోడీని, అమిత్ షా జస్ట్, పాత్రధారులే కానీ సూత్రధారులు కాదు… అది వేరే లోతైన చర్చ…
- ఇప్పటికిప్పుడు జగన్‌తో తెగదెంపులు బీజేపీకి అవసరం లేదు… దానికి సరిపడా రాజకీయ కారణాలు ఏమీ లేవు… ప్రత్యేక హోదాపై జగన్ కిమ్మనడు… ఏదో పైపైన కొన్ని అంశాల్లో బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టుగా కనిపిస్తాడు… అంతే…
- చంద్రబాబుతో ఒకవేళ దోస్తీ పెంచుకున్నా సరే, ఆయన గారు ఏదో ఊడబొడుస్తాడనే భ్రమలూ మోడీషాలకు లేవు… తనను ఆ టీం అస్సలు నమ్మదు… సో, ఓ సందిగ్ధ స్థితి… ఒకవేళ మమత గనుక బెంగాల్ ఎన్నికల్లో ఓడిపోతే… జాతీయ రాజకీయాలు బాగా మార్పులకు గురి కాబోతున్నాయి… అదీ అసలు నిజం,..!!
- సౌతిండియా రాజకీయాలు బీజేపీకి అంతుబట్టవు… దానికి శశికళతో వాళ్లు ప్లే చేసిన గేమ్సే నిదర్శనం… జగన్‌తో కూడా ఆ గేమ్సే ప్లే చేసినా సరే బీజేపీ సాధించేదేమీ ఉండదు… దానికి బేసిక్‌గా దక్షిణ భారత రాజకీయాలు తెలియవు… అంతుపట్టవు… ప్రస్తుతానికి ఇదే నిజం…!!
Share this Article