.
Pardha Saradhi Potluri… భారత్ మాతాకీ జై! వందేమాతరం! జై శ్రీరామ్! ఇలాంటి నినాదాలు సోషల్ మీడియాలో చేయడం వేరు ప్రాక్టీకల్ గా చేసి చూపించడం వేరు!
పశ్చిమ బెంగాల్ బాంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిజంగానే జరిగింది! పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలోని సుఖ్‌దేబ్‌పూర్ గ్రామం బాంగ్లాదేశ్ తో సరిహద్దు కలిగి ఉంది.
Ads
సుఖ్‌దేబ్‌పూర్ బాంగ్లాదేశ్ సరిహద్దు వద్ద BSF జవాన్లు ముళ్ల కంచె నిర్మిస్తున్నారు. దీని మీద బాంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ BSF జవాన్లతో ఘర్షణ కి దిగారు.
BSF జవాన్లు మా దేశ సరిహద్దులో కంచె నిర్మిస్తున్నాము అని చెప్పినా వినకుండా బాంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ ఘర్షణకి దిగడంతో సుఖ్‌దేబ్‌పూర్ గ్రామస్థులు కొడవళ్లు, గడ్డపారలతో వచ్చి జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు! దాంతో బాంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ వెనక్కి వెళ్లిపోయారు!
పాకిస్తాన్ సరిహద్దుల వద్ద సైన్యానికి ఫ్రీ హాండ్ ఇచ్చింది ప్రభుత్వం… పై నుండి ఆదేశాలు ఇవ్వనక్కరలేకుండా పరిస్థితులని చూసి స్వంత నిర్ణయం తీసుకోవచ్చు అంటూ… కానీ బాంగ్లాదేశ్ సరిహద్దు వద్ద కాపలా ఉండేది రెగ్యులర్ ఆర్మీ కాదు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాబట్టి అలాంటి ఆదేశాలు ఇవ్వలేదు!
పరిస్థితి శృతి మించితే BSF కి బదులు రెగ్యులర్ ఆర్మీని మొహరిస్తారు. రెగ్యులర్ ఆర్మీ కి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి ఉన్న తేడా ఏమిటీ?
BSF : కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది. సరిహద్దు వద్ద కాపలా కాయడం, రాకపోకలని పర్యవేక్షించడం చేస్తుంది. అవసరం అయితే దేశ అంతర్గత రక్షణ కోసం BSF ని వాడుకుంటుంది హోమ్ శాఖ లా అండ్ ఆర్డర్ కోసం.
సైన్యంతో కూడా కలిసి పనిచేస్తుంది అవసరం అయితే. ముఖ్యంగా అక్రమ చొరబాట్లని నిరోధిస్తుంది! ఎప్పుడూ బోర్డర్ దగ్గర ఉంటుంది కాబట్టి శత్రు దేశ కదలికల మీద ఇంటిలిజెన్స్ రిపోర్ట్స్ ఇస్తుంది నేరుగా హోమ్ శాఖకి!
BSF అనేది సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ ( CAPF ) కిందకి వస్తుంది CRPF, CISF లాగా. సైన్యం : రక్షణ శాఖ అధీనంలో ఉంటుంది. శత్రు దేశం మీద ఎటాక్ చేయడానికి నిర్దేశించింది. నేరుగా రక్షణ మంత్రి నుండి ఆదేశాలు తీసుకుని పని చేస్తుంది! ఆర్మీ BSF ఒకటి కాదు!
Share this Article