జాకీష్రాఫ్, శివరాజకుమార్, మోహన్‌లాల్… హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాపులర్ హీరోలు… స్టార్లు… ఇదంతా ఆయా భాషల్లో మార్కెటింగ్, వసూళ్ల అడ్వాంటేజ్ కోసం, ఆయా రాష్ట్రాల నేటివిటీని కృత్రిమంగా అద్దే ప్రయాస… సరే, తెలుగులో, తమిళంలో సేమ్ రజినీకాంత్ చాలు… అఫ్‌కోర్స్ సునీల్ ఉన్నాడు… రమ్యకృష్ణ ఉంది, తమన్నా ఉంది… ఐతేనేం… సినిమా మొత్తం రజినీకాంత్ హీరోయిజం చుట్టూ తిరుగుతుంది…
మిగతావాళ్లు ఆయా భాషల్లో హీరోలు కావచ్చు, ఈ సినిమాకు వచ్చేసరికి జీరోలు… ఎవరికీ పెద్ద ప్రాధాన్యమున్న పాత్ర లేదు… ఎన్నో ఏళ్ల తరువాత, మళ్లీ నర్సింహ కాంబో అంటూ రమ్యకృష్ణ గురించి ఊదరగొట్టారు గానీ తీరాచూస్తే ఆమె పాత్రకు కూడా పెద్ద సీన్ లేదు… అంతెందుకు… హీరోయిన్ తమన్నా కూడా రెండు పాటలు, రెండు సీన్లకు పరిమితం… కాకపోతే కావాలయ్యా పాటలో ఇరగ్గొట్టేసింది… పాట ట్యూన్, పాడిన తీరు, దానికి స్టెప్స్ కంపోజింగ్ బాగా కుదిరాయి…
ట్యూన్ అంటే గుర్తొచ్చింది… ఈ సినిమాలో మరో హీరో ఎవరంటే… అనిరుధ్… సంగీత దర్శకుడు… ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సంగీత దర్శకులెవరికీ లేనంత డిమాండ్, అట్రాక్షన్ అనిరుధ్‌కు ఉన్నాయంటే చాలామంది నమ్మరు… డీఎస్పీ, థమన్ సహా… ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది… దేశవిదేశాల్లో అనిరుధ్ కచేరీ పెడితే ఆ ఊపే వేరు ఇప్పుడు… రజినీకాంత్ హీరోయిజాన్ని అనిరుధ్ బీజీఎం భలే ఎలివేట్ చేసింది… కావాలయ్యా పాట సరేసరి… అందుకే సినిమాకు మరో హీరో అనిరుధ్…
Ads
అన్నింటికన్నా ముఖ్యంగా రజినీకాంత్ పోషించిన ప్రధానపాత్ర తన వయస్సుకు సూటయ్యేది… (చిరంజీవి ఈ సినిమా చూసి నేర్చుకోవాలి)… రిటైర్డ్ ఆఫీసర్… సరే, ఏదో సమస్యలో కొడుకు కోసం మనందరికీ తెలిసిన మాస్ హీరో అయిపోతాడు… ఇక ఓ పక్కా కమర్షియల్ సినిమా లక్షణాలన్నీ చూపిస్తాడు… అక్కడక్కడా కాస్త కామెడీ… రజినీకాంత్ నటన గురించి చెప్పడానికి, వంక పెట్టడానికి ఏముంటాయి..? సినిమాను ఒంటిచేత్తో దున్నేశాడు…
రజినీకాంత్ ఈమధ్య కథలపరంగా కొన్ని ప్రయోగాలకు వెళ్లాడు… అవన్నీ ఫ్లాప్… అందుకే తనకు అచ్చొచ్చిన, తనను ఫ్యాన్స్ ఏ రీతిలో చూడాలని అనుకుంటారో అదే మాస్ రోల్ ఎంచుకున్నాడు… ఈ వయస్సులోనూ అదే ఎనర్జీ… అవే మేనరిజమ్స… అదే రొటీన్ కథ… కానీ దర్శకుడు పెద్దగా బోర్ కొట్టకుండా జాగ్రత్తగా ప్రజెంట్ చేశాడు… కాకపోతే రజినీకాంత్‌ను కాస్త తక్కువ వయస్సున్నవాడిగా చూపించకపోతే ఫ్యాన్స్ ఒప్పుకోరు అనుకున్నాడేమో, కథలో ఓ ఫ్లాష్ బ్యాక్ ప్లాన్ చేశాడు…
కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ గానీ… సెకండాఫ్ మొదట్లో కథ గానీ ఎక్కడెక్కడికో వెళ్లిపోయి కాసేపు బోర్… తరువాత ప్రిక్లైమాక్స్, క్లైమాక్స్ దశలో కథ గాడిలో పడి, పర్లేదు అనే రేంజులో ముగుస్తుంది… రజినీ సినిమా అంటే భారీగా ఖర్చు… అందుకని నిర్మాణ విలువలు బాగానే ఉంటాయి, ఉన్నాయి… సో, సినిమాలో మిగతా వారి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు… ఇది ఫక్తు రజినీకాంత్ సినిమా… ఎస్, రజినీ ఈజ్ బ్యాక్ అగెయిన్…
(కాకపోతే ఏపీలో చాలామందికి ఈ సినిమా నచ్చకపోవచ్చు… కారణం రజినీ మొన్నామధ్య వచ్చినప్పుడు చంద్రబాబును బాగా మెచ్చుకున్నాడు… దాన్ని వైసీపీ బ్యాచ్ కడిగి పారేసింది… మొన్న ఈ సినిమా ఫంక్షన్‌లోనూ తనను విమర్శించేవారి మీద అన్యాపదేశంగా సెటైర్లు వేశాడు రజినీకాంత్… ‘‘మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఈ రెండు జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతానే ఉండాలి.. అర్ధమైందా రాజా!!…. ఫాఫం, చిరంజీవిలాగే ఏదో ఇండస్ట్రీలో కార్మికులు బతకడం కోసం ఈ వయస్సులోనూ రజినీకాంత్ ఒళ్లు వంచుతున్నాడు రజినీ.,. ఆయన్ని అపార్థం చేసుకుంటే, ఆయన త్యాగాల్ని అర్థం చేసుకోకపోతే ఎలాగండీ…)
Share this Article