Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పట్లో యద్దనపూడి నవలాచిత్రాలు అంటే ఓ ట్రెండ్… ఇదీ అదే…

September 25, 2024 by M S R

జయసుధ తనను తాను కేరెక్టర్ ఏక్టరుగా చెక్కుకుంటున్న క్రమంలో వచ్చిన సినిమా . అన్నపూర్ణ బేనరుపై 1977 లో వచ్చిన ఈ ప్రేమలేఖలు సినిమా రాఘవేంద్రరావుకు కూడా మంచి పేరుని తీసుకుని వచ్చింది . యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా తీసారు . బ్లాక్ అండ్ వైట్ సినిమా అయినా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది .

ఈ సినిమాలో మ్యూజికల్ సిగరెట్ లైటర్ని తన లవరుకు ప్రెజెంట్ చేస్తుంది హీరోయిన్ . అలాంటి లైటర్ కొనుక్కోవాలని భలే కోరిక ఉండేది . మద్రాసు , బెంగుళూరు వెళ్ళినప్పుడల్లా వెతికేవాడిని . ఎక్కడా దొరకలేదు . చివరకు 1988 లో అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ కూడా వెతికా . అక్కడా దొరకలేదు . చివరకు Service Merchandise మాల్లో సిగరెట్ కేస్ కం లైటర్ కొనుక్కొని తృప్తి పడ్డా . ఇదీ నా సిగరెట్ లైటర్ – ప్రేమలేఖలు సినిమా అనుబంధం .

జయసుధ , అనంత నాగ్ , మురళీమోహన్ , దీప , జగ్గయ్య , సత్యనారాయణ , గిరిబాబు , శుభ , పుష్పలత , అల్లు రామలింగయ్య ప్రభృతులు నటించారు . కన్నడం నుండలా అనంత నాగ్ ని ఎందుకు తెచ్చుకొన్నారో నాకు అర్ధం కాదు .

Ads

సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు బాగుంటాయి . సుశీలమ్మ , బాలసుబ్రమణ్యం , రామకృష్ణ , వాణీ జయరాంలు పాడారు . ఆరుద్ర వ్రాసిన ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెల కన్నా హాయి , శ్రీశ్రీ వ్రాసిన ఈరోజు మంచి రోజు మరువరానిది మధురమైనది పాటలు చాలా బాగుంటాయి . బాగా హిట్టయ్యాయి కూడా . మిగిలిన ఈ అందం ఈ పరువం , విన్నానులే పొంచి ఉన్నానులే , ఆ కాలపు బొమ్మను కాను ఈ కాలపు పిల్లను నేను పాటలు కూడా శ్రావ్యంగా ఉంటాయి .

45 ఏళ్ల కింద వచ్చిన ఈ సినిమా కుర్రాళ్ళకు , ఆడవాళ్ళకు బాగా నచ్చింది . సినిమా యూట్యూబులో ఉంది . జయసుధ అభిమానులు చూడవచ్చు . పాటల వీడియోలు కూడా ఉన్నాయి ….    (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ వెధవ ట్రోలర్‌కు వేణుస్వామి భార్య వీణశ్రీవాణి పర్‌ఫెక్ట్ కౌంటర్ !!
  • CJP – కూలీ ఇచ్చి మరీ తన్నించుకున్నట్టు అయిపోయింది !!
  • రైతు డిస్కమ్‌పై బీఆర్ఎస్ వక్రబాష్యాలు – పసలేని విమర్శలు
  • అసలే గతితప్పిన సంసారి… పైగా సమాజానికి బోడి ఉచిత సలహాలు…
  • పిచ్చి స్క్రిప్టుతో అభాసుపాలు – ఇప్పుడు దిద్దుబాటుకు మరో ప్రయాస
  • డియర్ చంద్రబోస్, ఓ నాలుగు రోజులు చల్లగరిగెలో ఉండి రావచ్చుగా…
  • Ellis Island – అమెరికా పారడాక్స్ వలస కథలకు అచ్చమైన సాక్ష్యం !!
  • నిషా నూర్‌..! ఈమెదీ సిల్క్ స్మిత కథేనా..? డర్టీ పిక్చర్‌-2 అదేనా..?
  • ఘర్షణ వద్దు – అదెటు దారితీస్తుందో ఎవరూ చెప్పలేని రోజులివి !!
  • FSD … మస్కా కాదు, మస్క్ మార్క్ ఆటో పైలట్ Tesla కారు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions