Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దాసరికి డబ్బు ఏం చేసుకోవాలో తెలియక… ‘జయసుధ’పై ఖర్చు…

February 11, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… బ్లాక్ మనీ బాగా ఉన్నవాళ్ళు దాన్ని ఖర్చు చేయటానికి గుర్రప్పందాలు , సినిమాలు తీయటం వంటి కార్యక్రమాలు చేస్తుంటారని అంటుంటారు . 1982 జనవరి ఒకటిన వచ్చిన ఈ జయసుధ సినిమా ఆ క్రమంలో వచ్చి ఉండాలి .

దాసరే నిర్మాత . కధ , స్క్రీన్ ప్లే , డైలాగులు ఆయనవే . ఆయన ఓ ప్రధాన పాత్రలో కూడా నటించారు . దర్శకత్వాన్ని మాత్రం కె వి నందనరావుకి అప్పచెప్పారు .

Ads

ఈ సినిమా చూస్తుంటే యస్వీఆర్ , నాగభూషణం నటించిన అందరూ దొంగలే సినిమా గుర్తుకొస్తుంది . వాళ్ళలాగానే దాసరి , మోహన్ బాబులు చిల్లర దొంగలు , జైలు పక్షులు . దుర్మార్గులు కారు .

జైలు నుండి బయటపడ్డాక తండ్రి కుదిర్చిన పెళ్లి తప్పించుకోవటానికి హీరోయిన్ జయసుధ పెళ్ళి దుస్తుల్లోనే పారిపోయి ఈ ఇద్దరు తోడుదొంగలకు తారసపడుతుంది . వీళ్ళిద్దరు జయసుధ ప్రేమించిన తన మేనత్త కొడుకు మురళీమోహనుతో పెళ్లి చేయించటమే సినిమా కధ .

జయసుధ పాత్ర పేరు కూడా జయసుధే . చాలా సినిమాల్లోలాగానే హీరో తల్లి కూడా ప్రేమించినవాడితో వెళ్ళిపోవటం , హీరోహీరోయిన్లు ప్రేమించుకోవటం అయిపోయాక బంధుత్వాలు తెలవటం , మేనమామ అల్లుళ్ళు సవాళ్లు విసురుకోవటం , వగైరా ఈ సినిమాలో కూడా ఉంటాయి .

కధ బాగానే ఉంది . స్క్రీన్ ప్లే మరెందుకనో చాలా విసిగిస్తుంది . అందువలనే సినిమా బాగా ఆడలేదు . దాసరి , మోహన్ బాబు పానకాలు , పర్వతాలుగా సినిమా అంతా వాళ్ళే కనిపిస్తారు . పిచ్చిపిచ్చిగా గోల చేస్తారు .
హీరోహీరోయిన్లుగా జయసుధ , మురళీమోహన్ , జయసుధ తల్లిదండ్రులుగా సత్యనారాయణ , పుష్పలత బాగా నటించారు .

జయసుధ , సత్యనారాయణలదే ప్రధాన భూమిక . అప్పటికే హీరో ఇమేజ్ ఉన్న నరసింహరాజు పిచ్చి పెళ్ళికొడుకులాగా కనిపిస్తాడు . బహుశా దాసరి మీద గౌరవంతో ఆ పాత్రని అంగీకరించి ఉంటాడు . ఇతర పాత్రల్లో సుకుమారి , ప్రభాకరరెడ్డి , రంగనాధ్ , అల్లు రామలింగయ్య , రమాప్రభ , ప్రభృతులు నటించారు .

ఫ్లాప్ సినిమా అయినా రమేష్ నాయుడు సంగీతం చాలా శ్రావ్యంగా ఉంటుంది . గోరువెచ్చని సూరీడమ్మా , కనురెప్ప పాడింది కనుసైగ పాటలు చాలా బాగుంటాయి . ఇతర పాటలు చెమ్మచెక్క చారడేసి మొగ్గ , అందాలు కురిసె ఆషాఢమాసం కూడా శ్రావ్యంగానే ఉంటాయి . బేక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది . సి నారాయణరెడ్డి , రాజశ్రీ , దాసరిలు పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు వాటిని పాడారు .

1982 లోకి వచ్చాం . ఇంతకుముందు అక్షరక్రమంలో వ్రాసాను . 1982 సినిమాలను క్రోనలాజికల్ గా వ్రాస్తున్నాను . సినిమా యూట్యూబులో ఉంది . జయసుధ , సత్యనారాయణ , దాసరి అభిమానులు ఖాళీ సమయంలో ప్రయత్నించేందుకు వాచ్ లిస్టులో పెట్టుకోవచ్చు . ఈ సినిమా ఏ హాల్లో చూసానో గుర్తు లేదు కానీ మా నరసరావుపేటలోనే సంక్రాంతి సెలవుల్లో చూసా . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీ రామజ్ఞానం ఎంత..? 108లో కనీసం 80 జవాబులు తెలిస్తే మీరు గొప్పే..!
  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions