అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ఉద్యమం ఏళ్ళ తరబడి
మీడియాలో నడిచింది.
కానీ భూములిచ్చేది లేదని మొరాయించి ప్రభుత్వంతో యుద్ధం చేసిన
రైతుల గురించి అసలు తెలుసా?
హైడ్రా కూల్చేసిన ఒకటి రెండు నిర్మాణాల దగ్గర గగ్గోలు రోజూ కనిపిస్తోంది.
ఇదే తెలంగాణాలో మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ లాంటి రిజర్వాయిర్లను వ్యతిరేకించిన వేలాది నిర్వాసితుల యుధ్దం ఏ మీడియాలో అయినా
కనిపించిందా?
మీడియా మేనేజ్మెంట్ అనేది కేవలం ప్రధాన స్రవంతికే కాదు
సోకాల్డ్ సోషల్ మీడియాకి కూడా వర్తిస్తుంది.
ఈ మేనేజ్ మెంట్ కొందరు నాయకులకు, కొన్ని ప్రభుత్వాలకే
సాధ్యమవుతుంది.
Ads
…
ఇవాళ బాగా వైరల్ అవుతున్న డిజిటల్ కంటెంట్ ఏంటి?
తెలంగాణ ముఖ్యమంత్రిని నానా బూతులు తిడుతున్న వీడియోలే..
నాకే రోజుకి పదో పదిహేనో వస్తున్నాయి.
ఫోనున్న వాళ్ళందరికీ ఇప్పుడిదొక టైమ్ పాస్.
హైడ్రా తప్పా.. ఒప్పా..
ముందే చెప్పి చేయాలా? చెప్పకుండా చేయాలా?
ధనికులవి కూలగొట్టాలా? మధ్యతరగతివి కూలగొట్టాలా?
ఈ చర్చంతా చాలా మంది చేసేస్తున్నారు కాబట్టీ.. వాటి జోలికి వెళ్ళను.
ఇప్పుడు తెలంగాణలో వున్న ప్రభుత్వ , ప్రతిపక్ష నేతలు ఇద్దరూ చంద్రబాబు శిష్యులే.
కాకపోతే, గురువు దగ్గర ఎవరు ఎక్కువ విద్య నేర్చుకున్నారన్నదే పాయింట్.
రేవంత్ దగ్గర చంద్రబాబు లక్షణాల కన్నా జగన్ తరహా దూకుడు ఎక్కువ కనిపిస్తోంది.
జగన్ కూడా ఇంతే..
ఉద్దేశం ఏమైనా కానీ,
జనాలకు మంచి చెడు ఏమైనా చేయనీ..
optics మేనేజ్ చేయలేకపోయాడు
జనరల్ పబ్లిక్ పర్సెప్షన్ ఆర్గనైజ్ చేయలేకపోయాడు.
అధికారంలోకి రాగానే ఒక నిర్మాణం కూలగొట్టాడు
అది అక్రమ నిర్మాణమే కావచ్చు.
కానీ, జనం మైండ్ సెట్ పట్టించుకోలేదు.
ఈ మైండ్సెట్ manufacture చేయడంలో తెలుగుదేశం ప్రావీణ్యాన్ని అంచనా వేయలేదు.
ఇంకేముంది?
చంద్రబాబు అంటే, construction,
జగన్ అంటే destruction..
ఈ narrative జనంలోకి వెళ్ళడానికి ఎంతో టైమ్ పట్టలేదు.
ఇప్పుడు రేవంత్ అయినా గురువుని ఈ విషయంలో సంప్రదిస్తాడా లేదా చూడాలి.
ఇప్పటికే గురువు తరపున వకాల్తా పుచ్చుకుని కొన్ని పత్రికలు రేవంత్ ని హెచ్చరిస్తున్నాయి.
ఇదొక రకంగా చంద్రబాబు స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ మధ్య పరీక్ష
ఈ పరీక్షలో ఇప్పటికే సీనియర్ స్టూడెంట్ కేసిఆర్ దూసుకుపోతున్నాడు.
మరి జూనియర్ రేవంత్ ఈ వేగాన్ని అందుకోగలడా?……… (ఓ సీనియర్ జర్నలిస్ట్ పోస్టు సంగ్రహించబడింది…)
Share this Article