Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ వార్తలే నిజమైతే… భారత జాతికి ఖచ్చితంగా ఓ నూతన సంవత్సరం కానుకే…

January 1, 2024 by M S R

ఈమధ్య కొన్నాళ్లుగా చదువుతూనే ఉన్నాం కదా… గుర్తుతెలియని వ్యక్తులు ప్రపంచానికి, ఇండియాకు శత్రువులుగా పరిణమించినవారిని ఒక్కొక్కరినే లేపేస్తున్నారు… ప్రపంచాన్ని వణికించిన పేరుమోసిన ఉగ్రవాదులు సైతం ప్రాణభయంతో వణికి చస్తున్నారు… సరే, భారత గూఢచార సంస్థ ఏజెంట్లు ఈ హత్యలు చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది గానీ, అంతటి బందోబస్తు మీద తిరిగే కఠోర ఉగ్రవాదులను అంత తేలికగా, అదీ వరుసగా దొరుకుతున్నారా..?

బెలూచిస్థాన్ సమరయోధులు కూడా కాదు… వాళ్లయితే గర్వంగా చెప్పుకునేవాళ్లు… అఫ్ఘనిస్తాన్‌లోని ఐఎస్ఐ వ్యతిరేక శక్తులా..? సరే, ఆ చర్చ ఎలా ఉన్నా తాజాగా ఓ వార్త భలే అనిపించింది… దావూద్ ఇబ్రహీం మరణవార్తలాగే ఇదీ ఫేక్ అయినా సరే, ఆ వార్త చదువుతుంటేనే… ఇది నిజమే అయితే బాగుండు అనే భావన బలంగా ఆవరించింది… ఆ వార్త ఏమిటంటే..?

మహ్మద్ మసూద్ అజహర్… కరడు గట్టిన జైషే మహ్మద్ స్థాపకుడు, చీఫ్… ఐఎస్ఐకి ఎన్నేళ్లుగానో దత్తపుత్రుడు… 1999లో కాందహార్ విమానం దారిమళ్లింపు, హైజాక్ గుర్తుంది కదా… అప్పుడు విడుదల డిమాండ్ చేయబడిన వాళ్లలో అజహర్ కూడా ఉన్నాడు… 2001లో పార్లమెంటు మీద దాడి, 2008 ముంబై దాడులు, 2016లో పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడి… ఇవే కాదు, ఎన్నెన్నో… ప్రపంచానికే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్… ఇక ఇండియాకైతే చెప్పనక్కర్లేదు… 2019లో ఐక్యరాజ్యసమితి తనను వరల్డ్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది…

Ads

https://twitter.com/TimesAlgebraIND/status/1741734792885084525?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1741734792885084525%7Ctwgr%5Ee678115bc26ddc49c6c1650195e2964d8ae12bad%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Finternational%2Fmasood-azhar-was-killed-bomb-blast-says-reports-1902625

టైమ్స్ అల్జీబ్రా అనే మీడియా హౌజ్ ‘ధ్రువీకరించబడని వార్త’ అంటూ ఈ వార్త ట్వీట్ చేసింది… ధ్వంసం అయిపోయిన ఓ కారు ఫోటో కూడా జతచేసింది… ధ్రువీకరణ జరగకపోయినా సరే, జరిగితే ఎంత బాగుండు అనిపించే వార్త… నూతన సంవత్సర కానుకగా నిజమే కావాలని ఆశించొచ్చు భారత జాతి… పాకిస్థాన్‌లో ఇలాంటి టెర్రరిస్టు నేతలు ఓపెన్‌గానే తిరుగుతూ ఉంటారు… పాకిస్థాన్ అంటేనే టెర్రరిస్టుల డెన్ కదా… సోమవారం ఉదయం ఎటో వెళ్తుంటే గుర్తుతెలియని వ్యక్తులు బాంబులు విసిరి హతమార్చారని కథనం…

తను కశ్మీర్ విముక్తి పేరిట ఈ ఉగ్రవాద చర్యలను ప్రారంభించాడు… ప్రపంచానికే కొరకరాని కొయ్యగా మారాడు… ఎప్పటిలాగే పాకిస్థాన్… ‘‘అబ్బే, అజహర్ మా దేశంలో లేనేలేడు’’ అని బుకాయిస్తూ వచ్చింది… అన్నట్టు మరో విషయం… ప్రపంచబ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలు దివాలా తీసిన పాకిస్థాన్‌కు ఆర్థికసాయం, రుణసాయం చేయకుండా మొరాయిస్తున్న సంగతి తెలుసు కదా… అదేదో FATF లిస్టులో చేర్చింది కదా… సో, డబ్బు కోసం ఐఎస్ఐ గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా ఉగ్రవాదుల్ని హతం చేస్తూ ‘‘సమర్థ ఉగ్రవాద నియంత్రణ చర్యలు’’ అనే నివేదికను ఇచ్చేసే ప్రయాసలో ఉందనే ప్రచారం కూడా ఉంది… అంటే, కడుపులో పెట్టుకుని చూసుకున్న దత్తత బిడ్డల్ని తనే కడతేర్చినట్టు..? అంతేనా..?!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions