Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రజెంట్ జనరేషన్‌‌కు లీస్ట్ ప్రయారిటీ కెరీర్… జర్నలిజం… ఎందుకంటే..?

March 23, 2026 by M S R

.

అగ్రశ్రేణి దినపత్రిక ఈనాడులో కనిపించిన ఓ వ్యాసం, అందులోని ఓ పేరా గురించి కాస్త చెప్పుకోవాలి… జర్నలిస్టు కొలువు పట్ల, ఆ వృత్తి (?) పట్ల నేటితరం అనాసక్తి మాత్రమే కాదు, ప్రస్తుత మీడియా జర్నలిజం దురవస్థను కూడా కళ్లకు కడుతోంది… చదువు పేజీలో ఈ వ్యాసం సాక్షాత్తూ ఈనాడు ఎడిటర్‌తో రాయబడింది… వివరాల్లోకి వెళ్దాం…

ప్రజెంట్ జనరేషన్‌కు జర్నలిజం లీస్ట్ ప్రయారిటీ… కారణాలు అందరికీ తెలిసినవే… మానవ వనరుల దోపిడీ  (కొన్ని అసలు జీతాలే ఇవ్వవు, లేదా ఏవో వార్తా సంస్థల పేరిట అరకొర జీతాలు, పే కమిషన్ల అమలు ఉల్లంఘనలు)… అస్థిరమైన కొలువు (ఎప్పుడు ఊడుతుందో తెలియదు).., చిన్న వయస్సులోనే బీపీలు, సుగర్లు (స్ట్రెస్, నైట్ డ్యూటీలు, తక్కువ సెలవులతు)… ఏ ఇరవై ఏళ్లో చేశాక, బయటికొస్తే ఇక ప్రపంచంలో ఏ కొలువుకూ పనికిరారు, ఎవరూ నమ్మరు (ఈ అనుభవం ఓ బ్యాడ్ రిమార్క్)… ఇలాంటివన్నీ చేదు నిజాలు…

Ads

యూనివర్శిటీల్లో జర్నలిజం కోర్సులుంటాయి, కానీ ఆ సిలబస్ వర్తమాన జర్నలిజానికి నయోపైసా పనికిరాదు… వాళ్లను మెయిన్ స్ట్రీమ్ ఎంకరేజ్ చేయదు… గతంలో పెద్ద మీడియా సంస్థలు తమ అవసరాల కోసమైనా సరే జర్నలిజం స్కూళ్లు నడిపించేవి… (ఈ విషయంలో ఈనాడు చాలా బెటర్, మంచి శిక్షణ, స్టయిఫండ్ ఇస్తుంది… కాకపోతే సర్వీస్ అగ్రిమెంట్ అనే వెట్టిచాకిరి బాండ్ సిస్టమ్ ఉంటుంది…) (గతంలో న్యూస్‌టుడే ఉన్నట్టు ఇప్పుడు ఈనాడు డిజిటల్, ఎక్కువ జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా…)

తెలుగులో సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి కూడా స్కూళ్లు నడిపించేవి, ఇప్పుడు ఆ దుకాణాలు బందయ్యాయి… ఈనాడు ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ చేసింది… కానీ పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించడం లేదు, ఎంత అంటే… కనీస విద్యార్హత డిగ్రీ ఉండేది… ఇప్పుడు ఇంటర్ పాసైనా చాలు, పరీక్ష రాయండి అంటున్నారు…

ఈనాడు

…. పరిస్థితి ఇలాగే ఉంటే, ఇంకా రేప్పొద్దున అర్హతల సడలింపు ఇంకా ఏ రేంజులో ఉంటుందో..? జాతీయ స్థాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఇంగ్లిషు డెయిలీలు, ప్రముఖ టీవీలు కూడా పెద్దగా ఈ ట్రెయినింగ్ స్కూళ్ల గురించి పట్టించుకోవడం లేదు… ప్రింట్ మీడియా అయితే నానాటికీ దిగదుడుపు వ్యవహారమే అయిపోయింది…

కాకపోతే ఈ వ్యాసంలో పేర్కొన్న కొన్ని వాక్యాలు అనవసరంగా ఈ వృత్తిలోకి యువతరాన్ని ల్యూర్ చేసే ప్రయత్నమే అనిపిస్తుంది… మరీ అంతటి ప్రాశస్త్యం, మహత్తు ఏమీ లేవు ఈ వృ‌త్తిలో, అసలు ఇది ఓ వృత్తేనా అనే ప్రశ్నే పెద్ద డిబేటబుల్…

‘‘దేశానికి సైనికుడు- సమాజానికి పాత్రికేయుడు’’ ‘‘అసాధారణమైన సామాజిక శక్తిగా ఎదిగే అవకాశం’’ ‘‘‘ఎప్పటికీ వాడిపోని వృత్తి- ఎవర్ గ్రీన్ కెరీర్’’ ‘‘ఐఏఎస్ అధికారుల నుంచి ముఖ్యమంత్రి దాకా జర్నలిస్టు మాటను గౌరవిస్తారు’’ ‘‘అక్షరం ఆయుధం’’… సాధారణంగా కమ్యూనిస్టు పార్టీల్లో వినిపించే పడికట్టు పదజాలం ఇదంతా…

ఎస్, ఈనాడు తన అవసరాల కోసం అయినా సరే, ట్రెయిన్ చేసుకుని మరీ రిక్రూట్ చేసుకునే తీరు అభినందనీయం… ఎంతోకొంత ప్రమాణాలకు అది దోహదపడుతుంది… మిగతా మీడియాకు ఈ సోయి లేదు, ఈ నిబద్ధత లేదు… ఏదో నడిపించేయడమే… పత్రికల్లో, టీవీల్లో ప్రమాణాల పతనం చూస్తున్నదే కదా… మొబైల్, వెబ్, డిజిటల్ మీడియా గురించి చెప్పనక్కర్లేదు… ఐతే ఈ పాత్రికేయ వృత్తికి ఏదో పవిత్రత, మహత్తు, శక్తిని ఆపాదించే ప్రయత్నం మాత్రం వృథా మాస్టారూ… అన్యథా భావించకండి…

‘‘ఒక చిన్న ఇంగ్లిషు వార్తను తెలుగులో రాయమని అసైన్ చేస్తే, రెండు గంటలు తీసుకున్నాడు మా సబ్ ఎడటర్, అదీ నానా వంకరలతో ఉంది… కొత్తవాళ్లు రావడం లేదు, వచ్చినవాళ్లు ఉపయోగపడటం లేదు…’’ రెండుమూడు ప్రధాన పత్రికల డెస్కుల్లో సీనియర్ల బాధ ఇది… ఇదీ ప్రజెంట్ జర్నలిజం దురవస్థ..!!

(ఏ ట్రెయినింగ్ లేకపోయినా సరళమైన శైలిలో, తప్పుల్లేకుండా, స్ట్రెయిట్ కంటెంట్ రాసేవాళ్లు సోషల్ మీడియాలో చాలామంది కనిపిస్తున్నారు... వాళ్లది జర్నలిజం వృత్తి కూడా కాదు... వాళ్లను ఈ సందర్భంగా అభినందిద్దాం...)

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రజెంట్ జనరేషన్‌‌కు లీస్ట్ ప్రయారిటీ కెరీర్… జర్నలిజం… ఎందుకంటే..?
  • ‘ఎర్ర’కోటకు బీటలు…! చివరి లెఫ్ట్ నౌక మునక..? కేరళ ముఖచిత్రం..!!
  • దురంధర్… నిజంగా నాటి సాహసి మేజర్ మోహిత్ శర్మ కథేనా..?!
  • రచ్చ ఆగడం లేదు… ఆ రోత పాటకు నానా విఫల సమర్థనలు…
  • రామ రామ… గోత్రాల పేరిట రాములోరి పెళ్లిపై ఓ శుష్క రాద్ధాంతం..!
  • జాణవులే వరవీణవులే – కిలికించితాలలో… స్మితను కూడా మరవలేం…
  • జియో పాలిటిక్స్… క్యూబాలో నిత్యనరకం… 18 నెలల్లో 6 బ్లాక్ అవుట్స్…
  • తెగ నవ్విస్తున్న టూప్లస్‌టూ పెళ్లిచూపుల కథ… మార్కెటింగ్ కన్సల్టెన్సీ…
  • సత్వర న్యాయం Vs చట్టప్రకారం న్యాయం… ఇదెప్పుడూ తెమిలే ప్రశ్న కాదు…
  • సతి అనుమతి లేని సంభోగం కూడా ఓ అత్యాచారమే… చిరైయా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions