ఓ కేసుకు సంబంధించి విచారణ పేరుతో ఓ జర్నలిస్టు ఫోన్‌ను పోలీసులు సీజ్ చేయడాన్ని కేరళ హైకోర్టు తప్పుపట్టింది. చట్టం నిర్దేశించిన నిబంధనలు అనుసరించకుండా జర్నలిస్టు ఫోన్‌ను సీజ్ చేయడానికి వీల్లేదని పేర్కొంది. జర్నలిస్టులు ప్రజాస్వామ్యంలో ‘నాలుగో స్తంభం’లో భాగమని.. ఏదైనా కేసులో వారి ఫోన్ అవసరమని భావిస్తే, సీఆర్‌పీసీ నిబంధనలను అనుసరించాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే..?
కేరళకు చెందిన షాజన్ స్కారియా అనే వ్యక్తి.. ఓ యూట్యూబ్ న్యూస్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు. అయితే, ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలతో తన పరువు తీశాడని ఆరోపిస్తూ స్థానిక ఎమ్మెల్యే పీవీ శ్రీనిజిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది. ఇదిలా ఉండగా.. స్కారియాతో జి.విశాఖన్ అనే ఓ మలయాళ జర్నలిస్టుకు వార్తల విషయంలో కొద్దిపాటి పరిచయం ఉంది.
సంబంధం లేకపోయినా… ఈ క్రమంలోనే షాజన్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ.. విచారణలో భాగంగా పోలీసులు వేధిస్తున్నారని విశాఖన్ ఆరోపించారు. ఇదే విషయంపై హైకోర్టును ఆశ్రయించారు. తన ఇంట్లో అక్రమంగా సోదాలు (జులై 3న) జరిపారని.. భయభ్రాంతులకు గురిచేస్తూ తన ఫోన్‌ను సీజ్ చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనను వేధించొద్దంటూ పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. సోదాలు నిర్వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Ads
పోలీసుల తీరు తప్పు…. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పీవీ కున్ని కృష్ణన్.. ఈ కేసులో పోలీసుల తీరును తప్పుపట్టారు. సదరు జర్నలిస్టు నేరంలో భాగస్వామ్యం కాదని.. అలాంటప్పుడు ఫోన్ సీజ్ చేయడం జర్నలిస్టు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని మౌఖికంగా అభిప్రాయపడ్డారు. ఒకవేళ అతడి ఫోన్ అవసరమని భావిస్తే నిబంధనలు పాటించాలన్నారు. ఫోన్‌ను సీజ్ చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ పోలీసులు నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను జులై 21కి వాయిదా వేసింది.
తెలంగాణ రూటే సపరేటు… తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అధోకారికంగా అనగా కేవలం వార్తలు రాశారు లేదా వార్తలను చూపారనే ఉద్దేశ్యంతో 47 మంది జర్నలిస్టుల (అనధికారికంగా 173 కేసులలో వివిధ రూపాలలో జర్నలిస్టు)లను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులలో వందకు పైగా ఫోన్లు సీజ్ చేశారు.
నల్గొండ కేసులో.. ఫోన్లు గాయబ్… రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఒక పాత్రికేయుడి అరెస్ట్ సందర్భంగా పది ఫోన్లు, ఒక ల్యాబ్ టాప్ ను పోలీసులు సీజ్ చేశారు. ఆ మేరకు పంచనామా కూడా న్యాయస్థానంలో దాఖలా చేశారు. అయితే తాజాగా కేసు కథ ముగిసింది. సీజ్ చేసిన ఫోన్లనో నాలుగు ఫోన్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై హైకోర్టులో కేసు ఉండటం గమనార్హం. ఈ విషయంలో పోలీసులపై కేసు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు, హైకోర్టు న్యాయవాది యల్లంకి పుల్లారావు చెప్పారు…. (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)
Share this Article