21 ఏళ్ల సినీ ప్రయాణం… కానీ 14 సినిమాలు మాత్రమే… 2005లో ఏదో పోలీస్ అధికారి పాత్ర వేసింది, అందరూ మరో విజయశాంతి అన్నారు… ఇప్పుడు సలార్‌లో లేడీ విలన్ పాత్ర… అందరూ ఇప్పుడు మరో రమ్యకృష్ణ, శివగామి అంటున్నారు… సలార్ అనగానే ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్‌కు ఎంత పేరొచ్చిందో ఆమెకూ అంతే పేరొచ్చింది… ష్, హీరోయిన్ శృతిహాసన్‌కన్నా… నిజంగా ఓ ఇంట్రస్టింగ్ ప్రయాణం ఆమెది… పేరు శ్రియారెడ్డి… వయస్సు 41 ఏళ్లు…
భరత్ రెడ్డి అనే ఓ ఇండియన్ క్రికెటర్… చెన్నైలో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబం… ఆయన బిడ్డే ఈ శ్రియారెడ్డి… మొదట మోడలింగ్ మీద ఆసక్తి ఉండేది… చదువయ్యాక చూద్దాంలే అన్నాడు తండ్రి… తరువాత సదరన్ స్పైస్ మ్యూజిక్‌కు వీడియో జాకీగా మారింది… మెల్లిమెల్లిగా ఆడిషన్స్ ఇస్తూ 2002లో సమురాయ్ అనే సినిమా చేసింది…
Ads
ఎడాపెడా ఆఫర్లు ఏమీ వచ్చిపడలేదు… చాన్నాళ్లు ఏ సినిమా చేయలేదు… తరువాత మలయాళంలో ఏకంగా మమ్ముట్టితో ఏదో సినిమా… అమ్మచెప్పింది అనే తెలుగు సినిమా కూడా చేసింది… అలా ముక్కుతూ మూలుగుతూ సాగుతున్న కెరీర్‌లో విక్రమ్ కృష్ణతో అనే నటుడితో పరిచయం… వాళ్లదీ తెలుగు కుటుంబమే… హీరో విశాల్ తెలుసు కదా, ఆయన సోదరుడు… నిర్మాత జీకేరెడ్డి కొడుకులు వాళ్లిద్దరూ… విక్రమ్ కృష్ణను పెళ్లి చేసుకున్నాక పదేళ్లపాటు మాయం… (హీరో విశాల్‌కు సొంత వదిన)… పెళ్లయ్యాక ఇక ఏ సినిమా చేయలేదు ఆమె… (అప్పట్లో పొగరు సినిమా ద్వారా మన తెలుగు ప్రేక్షకుల మెప్పూ పొందింది…)
పదేళ్ల తరువాత… వడివేల్ దర్శకుడిగా ఓ సినిమా తీస్తూ ఆమెను నటించడానికి ఒప్పించాడు… అమెజాన్ ప్రైమ్ వీడియో సీరీస్ ఒకటి చేస్తూ దర్శకుడు ప్రశాంత్ నీల్ కళ్లలో పడింది… తన సలార్ సినిమాలో వరదరాజు సోదరి రాధా రమ పాత్రకు ఆమె కరెక్టుగా సూటవుతుందని ఫిక్సయ్యాడు… ఆమె సరేనంది… వెరసి సలార్ శివగామి ప్రత్యక్షమైంది…
మరో సినిమా చేస్తోంది ఇప్పుడు… ఓజి… పవన్ కల్యాణ్ సినిమా అది… అందులో ఏ పాత్రో స్పష్టత లేకపోయినా… సరైన పాత్ర పడాలే గానీ ఇరగదీయడం ఖాయమని సలార్ పాత్రతో ప్రూవ్ చేసుకుంది… అవును, సరైన, సమర్థుడైన దర్శకుడి చేతిలో పడితే… సరైన పాత్ర దొరికితే… ప్రతిభ పదునెక్కుతుంది… శ్రియారెడ్డే ఓ తాజా ఉదాహరణ… !!
చిరంజీవి హీరోగా ఓ ఫాంటసీ చిత్రం రాబోతోంది కదా… విశ్వంభర అని టైటిల్ అంటున్నారు… త్రిష హీరోయిన్ అట… అందులో ఈ శ్రియా రెడ్డిని కూడా తీసుకుంటున్నారు ఓ ప్రధానపాత్రకు… సలార్ ఎఫెక్ట్… గుడ్…
Share this Article