జూనియర్ ఎన్టీయార్‌తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సినిమా తీయబోతున్నాడు… ప్రస్తుతం ప్రభాస్‌తో తీస్తున్న సాలార్ షూటింగ్ అయిపోగానే, అంటే వచ్చే ఏడాది మధ్యలో జూనియర్‌తో ఆ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనేది ప్రశాంత్ ప్లానింగ్… ఈలోపు జూనియర్ కూడా కొరటాల శివతో ఓ సినిమా కంప్లీట్ చేసేయాలి… ప్రశాంత్ దర్శకత్వంలో తీయబోయే సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్‌తోపాటు కల్యాణ్‌రామ్ కూడా సహనిర్మాతగా ఉంటాడు… గుడ్…
అయితే ప్రశాంత్ అక్కడక్కడా చిట్‌చాట్‌లలో ఆఫ్ దిరికార్డ్‌గా ‘జూనియర్‌తో తీయబోయేది ప్యూర్ కన్నడ సినిమా’ అన్నాడని కన్నడ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి… సో గుడ్… ఇతర భాషల్లో లీడ్ రోల్స్ చేసే అవకాశాలు మనవాళ్లు అందిపుచ్చుకుంటే అంతకన్నా కావల్సింది ఏముంది..? తమిళ హీరోలు, మలయాళ హీరోలు బోలెడు మంది స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేశారు… కన్నడం నుంచి ప్రముఖ హీరోల స్ట్రెయిట్ సినిమాలు అత్యంత అరుదు… ఉన్నాయోలేదో తెలియదు కానీ ఉపేంద్ర, సుదీప్ తదితరులు మనకు పరిచయమే…
జూనియర్‌కు కన్నడంలో లీడ్ రోల్ చేయడం చాలా ఈజీ… పైగా తల్లి శాలిని పుట్టి, పెరిగింది కర్నాటకలోనే… జూనియర్‌కు కూడా కన్నడంలో ఫ్లూయెన్సీ ఉంది… ఆర్ఆర్ఆర్ డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నాడు కన్నడంలో… సో, కన్నడ సినిమా తీస్తారు సరే, కానీ దానితో ఏం ఫాయిదా..? జూనియర్ అంటే కనీసం వంద కోట్ల సినిమా… పెట్టుబడి- లాభం లెక్కలు చూసుకోకుండా, జస్ట్ కన్నడంలో తీసేద్దాం అనే ధోరణి ఉండదు కదా…
Ads
పైగా ప్రశాంత్ సినిమా అనేసరికి ప్రేక్షకుల్లో కేజీఎఫ్ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి… తెలుగులో తీసి, కన్నడంలో డబ్బింగ్ చెప్పిస్తే సరిపోతుంది కదా అనేది సింపుల్ ప్రశ్న… సాలార్ కూడా తెలుగులోనే తీస్తూ, ఇతర భాషల్లోకి డబ్ చేయబోతున్నారుు, పాన్ ఇండియా రిలీజ్ కోసం… మరి కన్నడంలో తీయడం వల్ల ఫాయిదా ఏముంటుంది..? నిజానికి ఏమీ ఉండదు… అది వర్కవుట్ కాదు…
కన్నడ ప్రేక్షకులు వేరే భాషల హీరోల్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు… అసలు తమిళ సినిమాలే కర్నాటకలో సరిగ్గా ఆడవు… మన తెలుగు, కన్నడ ఇండస్ట్రీల నడుమ వ్యక్తిగత బంధాలే తప్ప సినిమా సంబంధాలు చాలా తక్కువ… (తెలుగు టీవీ సీరియళ్లలో మాత్రం ఆడ పాత్రలన్నీ కన్నడ పరిమళాలే, అది వేరే విషయం)… సో, జూనియర్‌ను ఎంతవరకు ఓన్ చేసుకుంటారు..? అదే అసలు కీలకం… సో, అప్పుడు మళ్లీ తెలుగు మార్కెట్ మీదే పూర్తిగా ఆధారపడాలి… అలాంటప్పుడు కన్నడంలో సినిమా అనే ప్రయోగం దేనికి..?
పోనీ, కన్నడ నటీనటులతో కన్నడ సినిమానే తీశారనుకుందాం… అప్పుడు తెలుగు ప్రేక్షకులు లైట్ తీసుకునే ప్రమాదం ఉంది… మనకు అరవ వాసన అలవాటైంది తప్ప కన్నడ వాసన పెద్దగా తగల్లేదు… కేజీఎఫ్, కాంతార సినిమాల్లాగా అప్పుడప్పుడూ ఒకటీ అరా… ఇలా ఏరకంగా చూసుకున్నా సరే, జూనియర్‌తో పాన్ ఇండియా సినిమా తీయాలంటే తెలుగు మార్కెట్ మీద ఆధారపడి, తెలుగు సినిమా తీయాల్సిందే, తరువాత వేరే భాషల్లోకి డబ్ చేసుకోవాల్సిందే…
సాహో కూడా అంతే కదా… కానీ రాధేశ్యామ్ హిందీలో తీసి, తెలుగులోకి డబ్ చేస్తే మట్టిగొట్టుకుపోయింది… ఇప్పుడు లెంపలేసుకుని సాలార్ పూర్తిగా తెలుగులోనే తీస్తున్నారు… (ఆదిపురుష్ గురించి అడక్కండి ప్లీజ్… దాన్ని సినిమా అనడానికి మనసొప్పడం లేదు…) సో, ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటయ్యా అంటే… జూనియర్ ప్యూర్ కన్నడ సినిమా అనేది ఏమాత్రం ఫాయిదా ఇవ్వలేని ఆలోచన… ఇప్పటి కమర్షియల్ బిజినెస్ లెక్కల్లో అది అసాధ్యం…!!
Share this Article