‘‘మంత్రి పదవి వచ్చింది, ఇక జబర్దస్త్ షో చేయలేను, ఒకేసారి రెండు కామెడీ షోలు చేయడం కష్టం’’ అని రోజా అంటున్నట్టుగా నిన్న మీమ్స్, చెణుకులు కనిపించాయి సోషల్ మీడియాలో…. మంత్రి పదవిని కామెడీ షోతో పోల్చడం కరెక్టు కాదు, కానీ జబర్దస్త్ కామెడీతో పోలిస్తే ఇదేమంత పెద్ద తప్పుగా అనిపించడం లేదు… నేను ఇక టీవీ షోలు చేయను అనే రోజా వ్యాఖ్యను మీడియా, సోషల్ మీడియా నిన్న హైలైట్ చేసింది…
అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వను అని రోజా పట్ల చంద్రబాబు ప్రదర్శించిన అప్రజాస్వామిక ధోరణిని ఓసారి గుర్తుచేసుకున్నప్పుడు… రోజా ఓ మంత్రి కావడం ఆమెకు ఎమోషనల్‌గా, పొలిటికల్‌గా పెద్ద మలుపే… ప్రత్యేకించి ఆమెకు సొంత నియోజకవర్గంలోనే, సొంత పార్టీ నాయకులే పొగబెడుతున్న స్థితిలో ఈ ప్రమోషన్ ఆమెకు పెద్ద ప్లస్ పాయింట్… తనను ఇక్కడిదాకా తీసుకొచ్చింది జబర్దస్త్ షో మాత్రమే అనే భ్రమ కూడా రోజాలో ఉంది… అవన్నీ వదిలేస్తే…
అసలు రోజాయే కాదు, జబర్దస్త్ పూర్తిగా ఖాళీ అయిపోతోంది… ఈటీవీని ఇన్నాళ్లూ రేటింగుల్లో నిలబెట్టిన జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ నాణ్యతలో ఘోరంగా దిగజారిపోయింది… (అంటే అంతకుముందు ఏదో బాగుందని కాదు, పాతాళం నుంచి ఇంకా దిగువన ఉండే మహాతలం వైపు పయనం అని…) దత్తపుత్రుడిగా భావించబడిన ఆది సెలవు తీసుకున్నాడు… చమ్మక్ చంద్ర, అభిరె అది దగ్గర నుంచి బోలెడు మంది కమెడియన్లు ఆ షో వదిలేసి వెళ్లిపోయారు, పోతున్నారు…
Ads
రెండు షోలనూ కలిపి చూస్తే సుధీర్ టీం తప్ప పాత టీం ఏదీ లేదిప్పుడు… సుధీర్ టీంలో కూడా గెటప్ సీను బయట సినిమా అవకాశాల వల్ల రెగ్యులర్‌గా రావడం లేదు… సుధీర్ టీం కూడా ఏదో ఓ స్కిట్ చేశాంలే అన్నట్టుగా నాన్ సీరియస్ వర్క్ చేస్తోంది… సుధీర్ కూడా పక్కచూపులు చూస్తున్నాడు… రోహిణి, ఫైమా, కొత్తగా గీత తదితరులు బాగానే చేస్తున్నా సరే… నూకరాజు, ఇమాన్యుయెల్, పంచ్ ప్రసాద్, నరేష్ కూడా బాగానే చేస్తున్నా సరే… సరైన దశ, దిశ లోపించింది…
జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ లేకపోతే ఈటీవీ మరీ జెమిని టీవీని కూడా దాటేసి నాలుగో స్థానానికి పడిపోవడం ఖాయం… అందుకే ఈ కామెడీ షోలను నిర్మించే మల్లెమాల ఎంటర్‌టెయిన్‌మెంట్స్ మీద ప్రెజర్ పెరిగింది… ఎందుకు అందరూ వదిలేసి వెళ్లిపోతున్నారు..? ఈ ప్రశ్నకు జవాబులు వెతుక్కోకుండా కొత్త రక్తం కోసం ప్రయత్నిస్తోంది… ఆడిషన్స్ ప్రారంభించింది…
జాతిరత్నాలు పేరిట ఈటీావీ ప్లస్‌లో ఓ స్టాండప్ కామెడీ షో కోసం ఆడిషన్లు భారీగా నిర్వహించినా… పెద్దగా నవ్వించే సరుకేమీ రాలేదు… ఏదో ఆ షో అలా నడిపిస్తున్నారు… కొత్త కంటెస్టెంట్లకన్నా ఇమ్ము, ప్రసాద్, శ్రీముఖి, నూకరాజు ప్రదర్శనే అధికంగా ఉంది… జబర్దస్త్ ఆర్టిస్టులే తప్ప శ్రీదేవి డ్రామా కంపెనీలో కొత్త రక్తమేమీ లేదు… ఈ స్థితిలో అర్జెంటుగా జబర్దస్త్‌కు కమెడియన్లు కావాలి… ఏదో ఓ షో గురించి ఎప్పుడూ ఆడిషన్స్ జరుగుతూనే ఉంటాయి కానీ ఇప్పుడు ఈటీవీకి యమర్జెన్సీ…
నిజానికి జబర్దస్త్‌కు మంచి జడ్జిలు కావాలి… స్కిట్ల నడుమ పదే పదే ఎంటరైపోయి, పంచ్ డైలాగులు తనే చెప్పి ఆ స్కిట్ల నాణ్యతకు పంక్చర్ చేస్తూ రోజా చేసిన నష్టం అంతా ఇంతా కాదు… నాగబాబు ఉన్నప్పుడు అదో తరహా… తరువాత ఎవరూ కుదురుకోలేదు… ఉన్నంతలో కాస్త ఇంద్రజ నయం… ఒకప్పుడు స్కిట్లలో లోపాల మీద ప్రస్తావన ఉండేది నిర్మొహమాటంగా… ఇప్పుడు ఆహా ఓహో అనే డప్పు తప్ప ఇంకేమీ లేదు…!!
Share this Article