జనరల్‌గా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా… ప్రతి తండ్రికీ తన బిడ్డ ఓ యువరాణి… ప్రేమగానే చూసుకుంటాడు… తన శక్తిమేరా అలా చూడటానికి ప్రయత్నిస్తాడు… మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా అంతే… తనూ నలుగురు పిల్లలకు తండ్రి… కాకపోతే వారిలో ఇద్దరు దత్తత బిడ్డలు… వాళ్లూ దైహికంగా వైకల్యాన్ని అనుభవిస్తున్నవాళ్లు… కానీ తెలివైన బిడ్డలు… వాళ్ల గురించి చెప్పుకోవడానికి ఎప్పుడూ ఆ తండ్రి సంతోషిస్తాడు, అపురూపంగా షేర్ చేసుకుంటాడు…
తన బిడ్డల పేర్లు ప్రియాంక, మహి… ఢిల్లీ హైకోర్టులో డిజిటల్ లా రిపోర్ట్స్‌ను ప్రారంభించడంతోపాటు శౌర్య ఫౌండేషన్‌తో అనుబంధం ఉన్న సాగర్ రతన్న అవుట్‌లెట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నాడు…
‘‘నా బిడ్డలు అనేక విషయాల్లో నన్నే గైడ్ చేస్తుంటారు, నాకు స్పూర్తినీ ఇస్తుంటారు… క్రూరత్వంతో సంబంధం లేని జీవనం దిశగా పయనించాలని నా బిడ్డ ఈమధ్య చెప్పింది… ఆ తరువాత నేను పక్కా శాకాహారిగా మారిపోయాను… అంతేకాదు, పట్టు బట్టలే కాదు, ఏ పట్టు ఉత్పత్తినీ నేను కొనడం లేదు… లెదర్ సంబంధ ఉత్పత్తులనూ వదిలేశాను… నాతో పాటు నా సతీమణి కూడా…’’ అని చెప్పుకొచ్చాడు…
Ads
ఢిల్లీ యూనివర్శిటీలో లా… తరువాత హార్వర్డ్‌లో మాస్టర్స్ … తండ్రి వైవీ చంద్రచూడ్ గతంలో సుప్రీం చీఫ్ జస్టిస్… రాజ్యాంగపరమైన కేసులే గాకుండా చాలా ముఖ్యమైన కేసుల్లో తీర్పులతో తను చాలామంది అభిమానాన్ని చూరగొన్నాడు… తను అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నప్పుడు, అంటే 2015లో ఈ ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్నాడు…
ఈ ఇద్దరు పిల్లలు ఉత్తరాఖండ్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందినవాళ్లు… సరైన స్కూల్ కూడా లేకుండేది… తనే అలహాబాద్‌లోని తన నివాసంలోనే వాళ్లకు విద్యాభ్యాస ఏర్పాట్లు కల్పించాడు… తరువాత ఢిల్లీకి షిఫ్టయ్యాక తమన్నా స్కూల్‌లో చేర్పించాడు, తరువాత సంస్కృత్ స్కూల్… ‘‘వాళ్లు మా జీవితాల్లో వస్తారనీ, మమ్మల్ని ప్రభావితం చేస్తారనీ ఎప్పుడూ అనుకోలేదు, చాలా కోణాల్లో మా జీవితాల్లో మార్పులకు వాళ్లు కారకులయ్యారు… వాళ్లవి చురుకైన బుర్రలు…’’ అన్నాడు ఓ ఇంటర్వ్యూలో ధనుంజయ్ వై చంద్రచూడ్, అనగా డీవై చంద్రచూడ్…!!
Share this Article