.
(Ashok Pothraj)…… ‘కాదలిక్క నేరమిల్లై’ తెలుగు (నెట్ ఫ్లిక్స్)… తమిళంలో రూపొందిన ఈ సినిమా జనవరి 14న విడుదలై ఒక రేంజ్ హిట్ టాక్ తో ముందుకు వెళ్ళింది. ఫిబ్రవరి 12నుంచే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
జయం రవి, నిత్యామీనన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. కృతిగ ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి నుంచే ప్రేక్షకులలో మంచి ఆసక్తి రేకెత్తించింది. భార్యాభర్తల మధ్య వచ్చే కోపతాపాలు, కష్టాలు, కన్నీళ్లు ఎలా ఉంటాయనేది బాగా చూపిస్తూనే ఇన్ డెప్త్ గా ఇందులో ఒక సోషల్ మేసేజ్ ను కూడా చాలా కన్వే అయ్యేలా చూపారు.
Ads
మొత్తానికైతే కొన్ని ఎమోషనల్ సీన్స్ ను చాలా చక్కగా తెరకెక్కించారు. ప్రతి ఫ్రేమ్ లో సినిమా తాలూకు మోరల్ వాల్యూస్ అయితే కనిపిస్తాయి. లేడీ డామినేషన్ ప్రతిబింబిస్తుంది. ఇక ప్రీ ఇంటర్వెల్ సీన్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు.
సెకండాఫ్ లో వచ్చే హాస్పిటల్ సీన్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అందుకే ఒక సినిమాలో ఏ అంశాలు ఉంటే ఆ సినిమా ఆడుతుందో, అలాంటి సీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి ఏదో ఒక రకంగా ఈ మూవీకి కనెక్ట్ అవుతూనే ఉంటాడు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ చాలా బాగా కుదిరింది. ఒక పాట హైలెట్ గా టాప్ ట్రెండ్ చేస్తూ ఉంది.
నిత్యా మీనన్ ఆర్కిటెక్ట్ గా చెన్నైలో ఒక కంపెనీలో జాబ్ చేస్తూ తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. మొదటి నుంచి కూడా ఆమెకి స్వతంత్ర భావాలు ఎక్కువ. కరణ్ (జాన్ కొక్కెన్)తో ఆమె ప్రేమలో ఉంటుంది. ఆమెకు నిశ్చితార్థం తరువాత అతని నిజస్వరూపం తెలియడంతో దూరం పెడుతుంది.
ఇక జయం రవి బెంగుళూర్ లో నివసిస్తూ ఉంటాడు. అతను కూడా ఆర్కిటెక్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. తనకూ ఒక లవర్ ఉంటుంది. పెళ్ళి తర్వాత పిల్లలు వద్దు అనే అంశంపై ఆమె అతన్ని కాదనుకునీ వెళ్లిపోతుంది.
జయం రవికి గౌడ (యోగి బాబు), సేతు (వినయ్ రాయ్) “గే” అనే స్నేహితులు ఉంటారు. వీళ్లు ఒకసారి ఫ్యూచర్ జనరేషన్ గురించి మాట్లాడుతూ భవిష్యత్తులో తమ తరాల కోసం ఇప్పుడే ‘స్పెర్మ్’ ప్రిసర్వ్ చేయాలని అనుకుంటారు. అయితే రవి ఆ ప్రిసర్వ్ చేసిన సెంటర్ లో తన పేరు, అడ్రెస్ తప్పుగా ఇస్తాడు.
అదే సమయంలో కరణ్ కి దూరమైన నిత్య సమాజంలో ఉన్న కట్టుబాట్లను ధిక్కరిస్తూ టెస్టు ట్యూబ్ బేబీని కనాలనుకుంటుంది. అలా ఒక ఫెర్టిలిటి సెంటర్ ద్వారా తన గర్భంలో( IVF) ప్రిజర్వ్డ్ స్పెర్మ్ ఇంజెక్ట్ చేయించుకుని, గర్భం దాల్చిన తర్వాత ఆమె తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ స్పెర్మ్ హీరోది అవడం అనేది ఇక్కడ ఆ ఇద్దరికీ తెలియదు అదే దాచి ఉంచబడిన అంశం. ఈ పాయింట్ తోనే సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మరింత ఆసక్తి రేపుతుంది.
ఆ తర్వాత హీరోయిన్ ఒక మగ బిడ్డకు జన్మనిస్తుంది. ఎనిమిదేళ్ల తరువాత కంపెనీ పనిపై హీరో చెన్నైకి వెళతాడు. అక్కడ అతనికి నిత్యా మీనన్ తో పరిచయం పెరుగుతుంది. ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. అదే సమయంలో జయం రవి జీవితంలోకి మాజీ లవర్ భాను రీఎంట్రీ ఇస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమవుతుంది? అనేది కథ.
జీవితంలో కొంతమందికి కొన్ని విలువలు, అభిప్రాయాలు, నిర్ణయాలు ఉంటాయి. వాటిని మార్చుకోవడానికి వాళ్లు ఎంతమాత్రం ఇష్టపడరు. మరికొంతమంది అవసరం, అవకాశం బట్టి మారిపోతూ ఉంటారు. అందువలన ఈ రెండు వర్గాల వారికి పొంతన కుదరదు. దాంతో విలువలకు, వ్యక్తిత్వాలకు ప్రాధాన్యతను ఇచ్చేవారు, తమకి తగినవారిని ఎంచుకునే అన్వేషణను కొనసాగిస్తూనే ఉంటారు. అలాంటి అన్వేషణ ఫలించేవరకూ ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా చేసిన ప్రయాణమే ఈ కథ.
“ప్రేమ అంటే ఒకరి తప్పుల గురించి ఒకరికి తెలిసినా సర్దుకుపోవడం కాదు, ఒకరి నిజాయితీని మరొకరు గుర్తిస్తూ, గౌరవిస్తూ ముందుకు సాగడం” అనే అంశాన్ని స్పష్టం చేస్తూ ఈ కథ సాగుతుంది. ప్రధానంగా ఈ కథను హీరో హీరోయిన్ల మధ్యనే నడిపించారు.
మిగతా పాత్రలను అవసరమైన సందర్భాల్లో మాత్రమే తెరపైకి తీసుకు వచ్చారు. యోగిబాబు ఉన్నా కామెడీ శాతం తక్కువే, ఒక ఫ్రెండ్ గే క్యారెక్టర్ ద్వారా నేటి ఆధునిక యుగంలో ప్రసెంట్ జనరేషన్ యువత ఏం కోరుతున్నారో వారి జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయో తన ద్వారా చూపెట్టే ప్రయత్నం చేశారు. కానీ వర్కవుట్ కాలేదు. సాధ్యమైనంత వరకూ సహజత్వాన్ని చూపడానికి దర్శకురాలు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది.
ఈ కథలో తక్కువ ట్విస్టులు ఉండవు. టెస్టు ట్యూబ్ బేబీకి జన్మనిచ్చిన హీరోయిన్, తన బిడ్డకి తండ్రి ఎవరనేది ఎలా తెలుసుకుంటుంది? ఎప్పుడు తెలుసుకుంటుంది? అసలు తెలుస్తుందా..? అనే కుతూహలమే ఈ కథను ఆడియన్స్ ఫాలో అయ్యేలా ఎంగేజ్ చేస్తుంది.
హీరోకి సున్నితమైన భావోద్వేగాలకు అవకాశం ఇస్తూ, పెద్దగా మలుపులేవీ లేకుండానే ఈ కథ నడిపించారు దర్శకురాలు. ఈ కథలో హీరో – హీరోయిన్ ఇద్దరూ ఉంటారు. అయితే నిత్యామీనన్ పాత్ర మాత్రమే కాస్త ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకునేలా కనిపిస్తుంది. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు.
ఆమె లావుదనం మనకు కొంచెం అయిష్టంగానే ఉంటుంది. రవి పాత్ర కూడా చాలా డీసెంట్ గా పూర్తి క్లారిటీతో కనిపిస్తుంది. మిగతా పాత్రలు నామమాత్రంగానే అనిపిస్తాయి.
ఫొటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ బాగుంది. కథకి తగినట్టుగానే వాటిలోని కదలిక కనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి సబ్జెక్ట్ లు వస్తున్నాయి. డిఫరెంట్ కథలతో తెరకెక్కిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇలాంటి సున్నితమైన అంశాలతో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి కానీ..! అంతగా మెప్పించలేవు.
కరణ్ జోహార్ గతంలో తీసిన “కభి అల్విదా న కెహ్నా” అనే సినిమా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇది కూడా అదే తరహాలోకి వస్తుంది. కొత్తదనం కోరుకునే వారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. డోన్ట్ మిస్ ఇట్ అవలేబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్….
Share this Article