Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జుహీ చావ్లా తొలి తెలుగు సినిమా… అదీ సూపర్ స్టార్ డైరెక్షన్‌లో…

December 16, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. కలియుగ కర్ణుడు అంటే కలియుగ కుంతీ పుత్రుడు కర్ణుడు కాదు . కలియుగ దాన కర్ణుడు . కలియుగ హరిశ్చంద్రుడు . అసలు ఈ సినిమాకు ఇవన్నీ కరెక్ట్ టైటిల్స్ కావు . అన్నాచెల్లెళ్ళ కధ . మరో రక్తసంబంధం సినిమా .

అలాగే శృతి మించిన ఆత్మాభిమానం కలిగిన ఓ జమీందార్ సినిమా . మరో ధర్మదాత సినిమా . చాలా కధల్ని కలిపి కలనేత నేసాడు కధకుడు వియత్నాం వీడు సుందరం .

Ads

  • ఆ కధకు పాత తరం దర్శకుల్లాగా బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నారు డైరెక్టర్ కం ఎడిటర్ హీరో కృష్ణ . ఢిష్యూం ఢిష్యూం సినిమాల ద్వారా హీరో అయిన కృష్ణ ఇంత చక్కటి అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ సినిమాకు దర్శకత్వం వహించేందుకు నడుం బిగించటం గొప్ప విషయమే . ఈ సినిమాకు హీరోగా , దర్శకుడిగా పాస్ మార్కులు కొట్టేసారు .

krishna

కుటుంబ పెద్దగా , తాను నమ్మిన విలువలకు కట్టుబడే జమీందారుగా , ఉన్నదంతా పోయినా ఆత్మాభిమానాన్ని , సత్యాన్ని , ధర్మాన్ని విడవని హీరోగా కృష్ణ గొప్పగా నటించారు . కాదు . జీవించారు . గ్లామర్ నాయికగా మాత్రమే కాదు ; అంజలీదేవిలాగో దేవికలాగో బరువైన పాత్రలకు కూడా న్యాయం చేయగలనని జయప్రద రుజువు చేసుకుంది .

తర్వాత మెచ్చుకోవలసింది మోహన్ బాబునే . అసూయతో కళ్ళల్లో నిప్పులు పోసుకునే పొరుగూరు ధనవంతుడిగా , మోసం చేసి బావమరిది అయి, చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేసిన బావ సర్వ వినాశనానికి అహర్నిశలు ప్రయత్నించే దుష్ట పాత్రలో మోహన్ బాబు రక్తి కట్టించారు . కబడ్డీ ఆడేస్తా అనే ఊతపదాన్ని పెట్టారు పరుచూరి బ్రదర్స్ మోహన్ బాబుకు .

కలియుగ కర్ణుడు

హీరో తమ్ముడిగా రమేష్ బాబు కూడా బాగా నటించాడు . పాటల డాన్సుల్లో , ఫైట్లలో బాగా నటించాడు . అతనికి జోడీగా 1984 మిస్ ఇండియా జూహీ చావ్లా నటించింది . తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా . టైటిల్సులో నూతన నటి మీనా అని పరిచయం చేసారు . రమేష్ బాబు సరసన కుర్ర నాయికగా హుషారుగా నటించింది .

జయప్రద అన్నగా సత్యనారాయణ పాత్ర రక్తసంబంధం సినిమాలో దేవిక అన్నయ్య పాత్రను గుర్తుకు తెస్తుంది . సత్యనారాయణ ఈ ఉదాత్తమైన పాత్రను చక్కగా నటించారు . హీరో చెల్లెలుగా రాజ్యలక్ష్మి పాత్రోచితంగా నటించింది . హీరో ఆప్తమిత్రుడుగా ఏలూరులో కృష్ణ క్లాస్ మేట్ మురళీమోహన్ నటించారు .

మెయిన్ విలన్ మోహన్ బాబుకు చెంచాగా కోట శ్రీనివాసరావు , మంధర పాత్రలో ఆడ విలనుగా రాజసులోచన , ఇతర పాత్రల్లో గొల్లపూడి మారుతీరావు , పి జె శర్మ , పద్మనాభం , కాకినాడ శ్యామల  తదితరులు నటించారు .
తెర వెనుక నిపుణుల్లో మెచ్చుకోవలసింది డైలాగులను వ్రాసిన పరుచూరి బ్రదర్సుని . ఎమోషనల్ సీన్లలో , ఏక్షన్ సీన్లలో , ప్రతీ సీన్లో పదునైన డైలాగులను అందించారు .

ఆ తర్వాత తాంబూలం సంగీత దర్శకుడు చక్రవర్తిది . బేక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సందర్భానుసారంగా ఉంటుంది . ఇంక పాటలకు కూడా చాలా శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు . పాటలనన్నీ వేటూరి బాగా వ్రాసారు .

juhi chawla

ముఖ్యంగా ఇది ఒక మహాభినిష్క్రమణం ఇది ఒక అభినవ సహగమనం అని బేక్ గ్రౌండులో వచ్చే విషాద గీతం శ్రావ్యంగా ఉంటుంది . సీతమ్మ తోడుని శ్రీరామచంద్రుడు చంద్రమతి తోడుని ఆ హరిశ్చంద్రుడు విడవగలడా అంటూ సాగే కృష్ణ , జయప్రదల పాట చాలా బాగుంటుంది .

వారిద్దరితో సాగే గ్రూప్ డాన్స్ పాట సంగ్రామంలో విజయాలు సంసారంలో ప్రణయాలు బాగా చిత్రీకరించబడింది . రమేష్ బాబు , జూహీ చావ్లాల మీద మూడు డ్యూయెట్లు కుర్ర హీరోహీరోయిన్లకు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి . కాశ్మీర్లో తీసారట . కౌగిలి పట్టిన కాశ్మీరంలో , ఏమా కధ , షరాలన్నీ మామూలే అంటూ సాగుతాయి ఈ మూడు డ్యూయెట్లు .

(రమేష్ బాబును హీరోగా ఎస్టాబ్లిష్ చేయడానికి కృష్ణ చేయని ప్రయత్నం లేదు, ఈ సినిమాకు తనే దర్శకుడయ్యాడు)…

షరా అంటే ఇప్పటి తరం వారికి తెలియదేమో ! షరా అంటే condition . పూర్వం ప్రకటనల కింద "షరా : మామూలే" అని వ్రాసేవారు . ఇప్పుడు " conditions apply" అని వ్రాస్తున్నారు .

jayaprada

1988 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా షిఫ్టుల మీద ఏడు సెంటర్లలో వంద రోజుల పోస్టర్ పడింది . చక్కటి కుటుంబ కధా చిత్రం . చట్టాలనే తూనా బొడ్డని పక్కకు నెట్టేసి ఘోరాతిఘోరంగా బతుకుతున్న రోజులు ఇవి . వ్యక్తిగత విలువలు , మంచి , ధర్మం ఇవన్నీ ఎక్కడ !

వీటి గురించి ఆలోచించే వారికి బాగానే ఉంటుంది సినిమా . నీచులకు , దుర్మార్గులకు , విశ్వాస ఘాతుకులకు , జీవితంలో ప్రతీ దానిని వ్యాపారంగా డబ్బులతో చూసే వారికి ఎవరీ పిచ్చోళ్ళు అని అనిపిస్తుంది .

It’s a sentimental , emotional , personal values and ethics-based , feel good movie . ఇంతకుముందు చూడనట్లయితే తప్పక చూడండి . వాచ్ లిస్టులో వేయండి . An unmissable movie in my opinion .

నేను పరిచయం చేస్తున్న 1195 వ సినిమా .
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కీలక డాక్యుమెంట్… సాయుధ పోరాట దుస్థితిపై ఐదేళ్లుగా అంతర్గత చర్చ..!!
  • వావ్… తొలిసారిగా ఓ ‘ప్రెస్‌’టీజియస్ పోస్టులోకి లేడీ జర్నలిస్ట్..!
  • స్క్రిప్టెడ్ లవ్‌ట్రాక్ కాదు… సైలెంటుగా చిగురించి పెనవేసుకున్న బంధం..!
  • జుహీ చావ్లా తొలి తెలుగు సినిమా… అదీ సూపర్ స్టార్ డైరెక్షన్‌లో…
  • మెస్సీ పట్ల ఈ ‘ఫస్ట్ లేడీ’ అమర్యాదకర ప్రవర్తన..! నెటిజనం తిట్టిపోతలు..!!
  • ఎవరూ అడుగుమోపని… ఆ మార్మిక కైలాస పర్వతం ఎక్కిన ఏకైక వ్యక్తి..!!
  • 55 ఏళ్ల క్రితం గల్లంతు..! ఆ అణు పరికరం కథ తెలిస్తే నేటికీ వణుకే..!!
  • నందమూరి దిష్టి తమన్… తెలియకపోతే అన్నీ మూసుకోవాలి బ్రదర్..!!
  • మూడు తెలుగు సినిమా పాటలు- ఒక నోస్టాల్జియా… అజరామరం…
  • నకిలీలకే ‘మెరుపు’లెక్కువ..! ముగ్గురు గరల్‌ ఫ్రెండ్స్, గర్భాలు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions