సాలెపురుగుు కుడితే స్పైడర్ మాన్ అయ్యాడని చెపితే ఎర్రి మొఖాలు వేసుకొని చూసాం… ఎందుకంటే అది హాలీవుడ్ అని, మనకంటే గొప్ప చిత్రాలను తీస్తారని ఒక సోకాల్డ్ “నమ్మకం”…
అరే సాలెపురుగు కుడితే స్పైడర్ మాన్ ఎలా అవుతార్రా అని అడిగితే సినిమాను సినిమాలా చూడాలని, అందులో లాజిక్ లు వెతకడం తప్పని ఎప్పుడూ మనల్ని బ్రెయిన్ వాష్ చేసే బ్యాచ్ చెప్తూ ఉంటుంది…
మార్వెల్ సిరీస్లు, గార్డియన్స్ ఆఫ్ గాలక్సీలు చూసిన సోకాల్డ్ మేధావి బాచ్లు చస్ కల్కి కూడా ఒక సినిమానేనా అంతా కాపీ కొట్టారనడంలో ఆశ్చర్యం లేదు… సమస్య గ్రాఫిక్స్ కాదు, నటులు కాదు.. అసలు సమస్య కథ… ఇన్నిరోజులు ఆటకెక్కించిన ( అటకెక్కించాలనుకున్న..?) హిందు పురాణాల కథ…
Ads
కల్కిలో హిందుత్వ లేనట్టుంది… అందుకే కొత్త రాగం పాడుతున్నారు… రాజమౌళి సినిమా అయితే అది ఖచ్చితంగా హిందుత్వ సినిమా అని బల్లగుద్ది మరి చెప్తుంది ఈ బ్యాచ్… కల్కిలో అదేమి లేనట్టుంది, అందుకే అబ్బే ఇదంతా కాపీ అండీ అంటున్నారు…
కొన్నిరోజులకు ఈ సినిమాలో అంతర్లీనంగా కులాన్ని ఎలా చూపించారో, బడుగు బలహీన వర్గాలను ఎంత నీచంగా చూపించారో ఒక పెద్ద సోకాల్డ్ సెంట్రల్ యూనివర్సిటీల్లో పేపర్ ప్రెజెంటేషన్స్ కూడా వస్తాయి… అలా కాదనుకుంటే ఏ EPW లోనో, సెమినార్ లోనో అలాంటి వ్యాసాన్ని చదివే అవకాశం ఉంటుంది…
తెలుగువారికి తెలుగువాడే పెద్ద శత్రువు… బయటవాడు మనవాడిని పొగిడితే ఇంకా శత్రుత్వం పెరుగుతుంది… తమిళ సినిమా గురించి తమిళులు గొప్పగా చెప్పుకుంటారు… తెలుగు వాడిని తెలుగు సినిమా గురించి చెప్పమంటే ఆ రెండు కులాలే ఏలుతున్నాయి అండి అంటాడు… అలా చెప్పడంలో ఎదుటివాడి మనసులో, మెదడులో మనం మేధావి అని నిరూపించుకోవాలనే ఉబలాటం… ఇది ఎక్కువగా జర్నలిస్టులు, సోకాల్డ్ యూనివర్సిటీ పీహెచ్డి చేసి ఖాళీగా ఉండి ఫేసుబుక్లో హస్క్ వేసుకునే బ్యాచుల్లో కనిపిస్తుంది..
ప్రస్తుతం ఆ ట్రెండ్ నడుస్తూ ఉంది… మరో కల్కి వచ్చినా కులాల ముచ్చట్లు దాటి అలోచించని మేధావులు ఉన్నప్పుడు దత్ లాంటివాళ్లుు వ్యాపారంలో వచ్చిన లాభాల్ని లెక్కబెట్టుకుంటూ కూర్చుంటారు… సంపాదన తెలియని సన్నాసి బ్యాచ్లన్నీ ఫోన్లో డేటా అయిపోయేదాకా సొల్లు కబుర్లేసి adani, అంబానీలకు రెగ్యులర్ కస్టమర్లుగా తయారవుతారు… సింపుల్‌గా ఇదీ ముచ్చట……… By రాజశేఖర రెడ్డి….
Share this Article