Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

You too Ashwin..? చివరకు నువ్వూ అలాంటివాడివేనా నాగ్ అశ్విన్..?!

June 22, 2024 by M S R

700 కోట్ల భారీ బడ్జెట్… 250 కోట్లు కేవలం నటీనటుల రెమ్యునరేషన్లకే ఖర్చు చేస్తున్నారు… పేరుకు ప్రతిష్ఠాత్మక సినిమా… కానీ అందుబాటులో ఉన్న మంచి ఆర్టిస్టులతో క్రియేటివ్ వర్క్ చేయించుకుని కాస్త మంచి పేమెంట్స్ ఇవ్వలేరా..? ఇవి కూడా విదేశీ సినిమాల నుంచి కాపీ కొట్టాలా..? ఎందుకీ దరిద్రం..?

….. కల్కి సినిమాపై ఓ మిత్రుడి విమర్శ ఇది… నిజం… తెలుగు అగ్ర దర్శకుల సంగతే తీసుకుంటే త్రివిక్రమ్, రాజమౌళి సహా ఎవ్వరూ ఈ కాపీ ఆరోపణలకు మినహాయింపు కాదు… మరీ రాజమౌళి ఏకంగా సీన్లనే మక్కీకిమక్కీ కొట్టేసిన తీరు చూశాం… ఐతేనేం, ప్రపంచం మెచ్చిన దర్శకుడు ఇప్పుడు… కానీ చివరకు నాగ్ అశ్విన్ కూడా ఈ బాటలో వెళ్లడం చివుక్కుమనిపించేదే… ఎందుకంటే, తనకు ఇప్పటిదాకా ఆ చెడ్డ పేరు లేదు కాబట్టి…

kalki

Ads

ఈ తాజా విమర్శలకు మూలం ఏమిటంటే..?  స్టార్ ట్రెక్ కోసం హాలీవుడ్ ఆర్టిస్టు సంగ్ చోయ్ వర్క్ చేసిన ఓ సీజీ ఆర్ట్‌ను కల్కి సినిమాలో వైజయంతి మూవీస్ లోగో కోసం వాడుకున్నారనే ఆరోపణ… తనతోపాటు వర్క్ చేసే బెక్ ఏమంటాడంటే..? నిజానికి హాలీవుడ్‌లో ఏదో స్ట్రయిక్ జరుగుతోంది… ఇండియన్ సినిమాలకు వర్క్ చేద్దామని అనుకున్నాను… ఇదే వైజయంతి మూవీస్ వాళ్లు కూడా అడిగారు, కుదరలేదు… కానీ కాపీ కొట్టేశారు…

kalki

లీగల్‌గా నిరూపించడం కష్టం… ఎందుకంటే, ఇది డైరెక్ట్ కాపీ కాదు, ఒకరు చేసిన ఆర్ట్ వర్క్‌ను ఇంకోరకంగా దొంగిలించడం, మరో ఆర్టిస్టుకే ఇది సరిగ్గా తెలుస్తుంది, ఈ పెయిన్ తెలుస్తుంది… ఇండియన్ ఇండస్ట్రీ మీద ఈ ఆరోపణలు బాగా వినవస్తున్నాయి, అందుకే దీనికి వర్క్ చేయాలనిపించడం లేదు’’… ఇదంతా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది…

kalki


సంగ్ చోయ్ కూడా ఓ ట్వీట్ చేశాడు, తరువాత దాన్ని రిమూవ్ చేసినట్టున్నాడు… వైజయంతి మూవీస్ దీనిపై ఇంకా ఏమీ స్పందించినట్టు లేదు… సో, ఇండియన్ సినిమాకు సంబంధించి ఇంకెవరినీ నమ్మేట్టు లేదన్నమాట… ఇంకెవరో చేసిన వర్క్‌ను చౌర్యం చేయడంలో అందరూ అందరే…


Sad to see that some of the work I did for Star Trek: Prodigy got stolen by Vyjayanthi movies in their trailer:https://t.co/KWrFKJkksn

This is the matte painting I did for Star Trek under direction of Ben Hibon and Alessandro Taini and then as it appears in the trailer. pic.twitter.com/CYFP008Rd7

— Oliver Beck (@OliverBeckArt) June 13, 2024


సంగీతం, కథ, సీన్లు మాత్రమే కాదు, చివరకు ఇలాంటి ఆర్ట్ వర్క్‌ను కూడా మనవాళ్లు వదలడం లేదు… నిజంగా ఎందుకీ దరిద్రం.., తక్కువ పేమెంట్లకు కూడా ఇంతకుమించి మంచి క్రియేటివ్ వర్క్ చేసే ఆర్టిస్టులు మన దగ్గర లేరా..? బోలెడు మంది…! ఇదే కల్కి సినిమాకు సంబంధించి ఆలోచిద్దాం…

anna ben

నిజంగానే అతిరథులు అనుకున్న అమితాబ్, కమలహాసన్, ప్రభాస్, దీపిక పడుకోన్, దిశా పటానీ వంటి వాళ్లను తీసుకొచ్చారు… ఇండస్ట్రీకి దూరదూరంగానే ఉంటున్న శోభనను పట్టుకొచ్చారు… మరో పాత్రకు అన్నా బెన్‌ను తీసుకున్నారు… ఆమె మలయాళ ఇండస్ట్రీలో ఈమధ్య మంచి పేరు సంపాదించిన నటి…

kalki

చాన్నాళ్లు ఈ ప్రాజెక్టు మీద వర్క్ చేశారు… చాలా ఎఫర్ట్స్ పెట్టారు… ఐనాసరే ఇదుగో ఈ కాపీ ఆరోపణలతో మకిలి పట్టింది… ఇదేదో సినిమా మీద కమర్షియల్ నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని కాదు… దర్శకుడికి ఉన్న మంచి పేరు మీద ఓ మరక… ఓ మచ్చ..!!

kalki

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions