ముందుగా వారణాసి కారిడార్ డెవలప్ చేశారు… అక్రమ నిర్మాణాల్ని కూల్చేసి, గంగ నుంచి విశ్వనాథ మందిరం దాకా, పరిసరాల్లో విశాల వీథులు వచ్చేశాయి… ఫలితంగా గత ఏడాది పర్యాటకుల సంఖ్య చూస్తే ఏకంగా 8.5 కోట్లు… అసలే భారతదేశంలో టెంపుల్ టూరిజం ఎక్కువ… పైగా జీవితకాలంలో ఒక్కసారైనా కాశికి వెళ్లి రావాలనేది సెంటిమెంట్… పితృతర్పణాలకూ అదే వేదిక…
తరువాత ఉజ్జయిని … అక్కడ కూడా కారిడార్ డెవలప్ చేశారు… దర్శనాలు, దుకాణాలు, వీథులు అన్నీ సెట్ రైట్ చేశారు… అక్కడికి చేరుకునే రైలు, రవాణా మార్గాలు, సౌకర్యాలు పెంచారు… ఫలితం… గత ఏడాదిలో 5 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు… ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనం పట్ల భక్తజనంలో అంత ఆసక్తి, భక్తి… ప్రత్యేకించి భస్మారతి మొక్కులు సరేసరి…
తరువాత అయోధ్య… అనేకానేక అడ్డంకుల్ని దాటుకుని, ఓ చరిత్రను లిఖించుకుంటూ భవ్యమైన ఓ మందిరం సాకారమైంది… అయోధ్య సిటీని కూడా డెవలప్ చేస్తున్నారు… విమానాలు, రైళ్లు, రవాణా మార్గాలను, సౌకర్యాలను పెంచుతున్నారు… 12 రోజుల్లో 24 లక్షల మంది దర్శించుకున్నారు… అక్కడ వసతి సౌకర్యాల్ని పెంచుతున్నారు… ఏటా కనీసం 5 కోట్ల నుంచి 7 కోట్ల మంది పర్యాటకులు గ్యారంటీ…
Ads
ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి..? మధుర..? కాదు, దానికి ఇంకా టైమ్ పడుతుంది… ఈశాన్యంలో కొలువైన కామాఖ్య గుడిని ఓ కారిడార్‌లాగా డెవలప్ చేస్తున్నారు… ఖర్చు 500 కోట్లు… మోడీ ఆ పనులకు శంకుస్థాపన చేశాడు… అన్ని గుళ్లూ ఒకెత్తు, కామాఖ్య గుడి మరో ఎత్తు… గౌరీదేవి యోనిభాగం నేల మీద పడిన ప్రాంతంగా ప్రసిద్ధి… ఇది శక్తి పీఠం… ఐతే ఇతర పీఠాల్లా కాదు… మనం ఊళ్లలో చూస్తాం కదా, ఉప్పలమ్మ, బాలమ్మ, పోశమ్మ వంటి గ్రామదేవతలు… మద్యం, మాంసం, బలి ఇవన్నీ కామన్…
అంతేకాదు, ఎక్కడెక్కడో వామాచార పద్ధతుల్లో జరిగే దశమహాదేవి పూజల అంతిమ ఘట్టాలు ఇక్కడే నిర్వర్తిస్తుంటారు మన పాపులర్ వేణుస్వామి వంటి అర్చకులు… ఈమధ్య పర్యాటకులు బాగా పెరిగారు… అది అస్సోం రాజధాని గౌహతిలో ఉంటుంది… ఇప్పుడు ఇక్కడ కారిడర్ డెవలప్ చేయడం ద్వారా టెంపుల్ టూరిజానికీ, అస్సోం రాజధానిని ఈశాన్య టూరిజం గేట్‌వేగా కూడా మరో వేదికను చేస్తున్నారు… దీనికి శ్రద్ధ చూపింది అస్సోం సీఎం హిమంత…
అబుదాబిలో స్వామి నారాయణ సంస్థ నిర్మించిన మరో భవ్యమందిరాన్ని కూడా మోడీయే ప్రారంభించబోతున్నాడు రేపోమాపో… ఆల్‌రెడీ అదే సంస్థ దివ్యంగా నిర్మించిన న్యూజెర్సీలో ఆలయం ప్రారంభమైంది కూడా… సరే, విదేశాల గుళ్లు వేరు… దేశంలో వేరు… అయోధ్యలో రద్దీ నియంత్రణకు సుగ్రీవపథం అని డెవలప్ చేస్తున్నారు… హనుమాన్ గఢి నుంచి రాముడి గుడి దాకాా 290 మీటర్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్…
కేంద్ర సాయాన్ని పైసా ఆశించకుండా సీఎం నవీన్ పట్నాయక్ పూరి జగన్నాథుడి గుడి కారిడార్ డెవలప్ చేసేశాడు… ఈమధ్యే దాన్ని ప్రారంభించాడు… మోడీ ఎట్సెట్రా ఎవరూ రాలేదు, ఆయన పిలవలేదు… ఒడిశాకు భక్తి పర్యాటకులు పెరుగుతారని ఆయన నమ్మిక… ఇవి గాకుండా బీహార్‌లో పశ్చిమ చంపారన్ జిల్లాలోని, కేసారియాలోని జానకినగర్‌లో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించబోతున్నారు… దాని సంగతి మరోసారి చెప్పుకుందాం… ఒకప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటీ అంటే… ఇప్పుడు ప్రసిద్ధ హిందూ దేవాలయాల ఉన్నత శిఖరాలు కొత్త వెలుగులతో భక్తజనాన్ని గర్వంగా ఆహ్వానిస్తున్నాయి…
Share this Article