దేవుడిని అర్చించడానికి అనేక మార్గాలుంటాయి… బోలెడు పద్ధతులుంటాయి… ఎవరి పద్ధతి వారిదే… ఉదాహరణకు అఘోరాలు శివుడిని అర్చించే పద్ధతి మనకు భీతావహంగా అనిపించవచ్చు… కానీ వాళ్లకు అది కామన్… అభిషేకం చేసి, నాలుగు మారేడు దళాలు లింగం మీద పెట్టి, విభూతి రాసుకుని మొక్కడం సాత్వికంగా కనిపించవచ్చు… ఎంత కంట్రాస్టు..! వామాచారం, దక్షిణాచారం, క్షుద్రం వంటి పేర్లు మనం తగిలించుకున్నాం గానీ ఆ శివుడికి ఏ పూజయినా ఒకటే… తాజా చితి భస్మంతో ఇచ్చే భస్మారతిని ఎలా స్వీకరిస్తాడో, మామూలు విభూతినీ అలాగే స్వీకరిస్తాడు…
ఇతర మతాల్లో ఒకేతరహా పూజావిధానాలుంటాయి… కానీ హైందవంలో అనేక మంది దేవుళ్లు, అనేక గుళ్లు… అన్నిచోట్లా ఒకేతరహా పూజలు ఉండవు… కొన్ని గుళ్లలో కొన్ని విశేష పూజావిధానాలుంటాయి… మామూలుగా శక్తి స్వరూపిణిగా చూసే అమ్మవారికి ఎక్కడైనా సగటు పూజ ఎలా ఉంటుంది..? పసుపు లేదా కుంకుమ, కొబ్బరికాయ ఎట్సెట్రా… కానీ దీనికి పూర్తి కంట్రాస్టుగా ఎక్స్‌ట్రీం పూజావిధానం అస్సోంలోని కామాఖ్య అమ్మవారికి ఉంటుంది…
ఇక్కడ క్షుద్రమే చలామణీ… అంతే… యోనిస్వరూపమే దేవత కాబట్టి అర్చన పద్ధతి కూడా అంతే… ఇక్కడ బలి సాధారణం… నెత్తుటి తర్పణం… ఈమధ్య చాలామంది తెలుగువాళ్లు కామాఖ్య గుడికి వెళ్లి విశేష పూజలు చేయించుకుంటున్నారు… అందుకని ఇదంతా చెప్పుకోవడం… అక్కడ రకరకాల కోరికల్ని తీర్చే రకరకాల శక్తిస్వరూపిణులుంటారు, అవి తరువాత ఎప్పుడైనా చెప్పుకోవచ్చు గానీ… కామాఖ్య అమ్మవారికి చేసే పూజ గురించి… న్యూస్ క్యూబ్ కోసం శ్రావణి చేసిన ఇంటర్వ్యూలో ఆస్ట్రోగురు వేణుస్వామి చెప్పిన అర్చన వివరాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి… అవే ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం… మంత్రం కాదు ఇక్కడ… తంత్రం… అనగా తాంత్రిక పూజలే ప్రధానం…
Ads
ఐదు ‘మ’కారాల పూజ ఇక్కడి విశేషం… మంత్రపూజలకన్నా తాంత్రిక పూజలకు పవర్ ఎక్కువ అంటారు కదా… కోరికలు నెరవేరడానికి వామాచార పూజలను చాలామంది ఆశ్రయిస్తారు… ఇదీ అంతే…
1) మ… మాంసం… అంటే బలి… దున్నల దగ్గర నుంచి మేకల దాకా… మాంసమే నైవేద్యం…
2) మ… మద్యం… తరతరాల నుంచి వనదేవతలు, గ్రామదేవతల ఆరాధనలో మద్యం ఓ తప్పనిసరి అంశం… అదే ఇది…
3) మ… మత్స్యం… అంటే చేప… ఇతర జంతువులకు భిన్నంగా, అదనంగా దీన్ని సమర్పిస్తారు…
4) మ… ముద్ర… అంటే అర్చకుడు వేసే ముద్రలు…
5) మ… మైథునం… అంటే సంభోగం… అమ్మవారి ఎదుట మైథున కార్యాన్ని ఊహిస్తూ ఉపాసించడం… (కొన్నిచోట్ల సంభోగానంతర జంటను అలాగే తీసుకొచ్చి, పూజ దగ్గర కూర్చోబెడతారు…)
ఇదంతా క్షుద్రంగా కనిపించవచ్చు… కానీ ఆ గుడి పద్ధతి అదే… వేణుస్వామి చెప్పినట్టు సాక్షాత్తూ యోని స్వరూపమే దేవత అయినప్పుడు… మనం ఎక్కడి నుంచి పుట్టామో ఆ శరీరభాగానికే మనం మొక్కుతున్నప్పుడు… తరతరాల వన, గ్రామ దేవతల పూజాపద్ధతులే పాటిస్తున్నప్పుడు… అందులో క్షుద్రమేముంది..? అందుకే ముందే మనం చెప్పుకున్నది… అఘోరాల పూజకూ, వీథి గుడిలో అయ్యవార్ల పూజకూ కంట్రాస్టు ఏమిటో… కామాఖ్య పూజలో విశిష్టత కూడా అలాంటిదే..!!
Share this Article