Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మూడు ‘నందుల’ ముచ్చటైన ‘ఉషాకిరణం’… కాంచనగంగ…

May 31, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. మూడు నంది అవార్డులను గెలుచుకున్న మంచి సినిమా 1984 లో వచ్చిన ఈ కాంచనగంగ సినిమా . ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి వ్రాసిన ప్రేమ దీపిక నవల ఆధారంగా ఉషాకిరణ్ మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమాకు వి మధుసూదనరావు దర్శకుడు .

రెండవ ఉత్తమ చిత్రంగా ఉషాకిరణ్ వారికి , ఉత్తమ పాటల రచయితగా వేటూరి వారికి , రెండవ ఉత్తమ కధా రచనకు సులోచనారాణి గారికి నంది అవార్డులు వచ్చాయి . సినిమా కొరకు నవలలో కొన్ని మార్పులు చేసుకున్నారు .

Ads

స్క్రీన్ ప్లే , దర్శకత్వం బిర్రుగానే ఉంటాయి . ప్రేక్షకాదరణ పొందింది . అప్పుడప్పుడు ఈటివిలో వేస్తుంటారు . కాంచన , గంగ ఇద్దరూ స్నేహితులు . కాంచన down to the earth సాదాసీదా అమ్మాయి . గంగ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటుంది . ఆస్తిపరుడయిన కాంచన ప్రియుడికి గాలం వేసి పెళ్లి చేసుకుంటుంది .

తీరా పెళ్ళయ్యాక ఆ ఆస్తి అంతా మేనత్తది కావటం , తండ్రికి కోపం వచ్చి ఇంట్లోనుంచి బయటకు నెట్టివేయబడటం జరుగుతుంది . గంగ భర్త ప్రభాకర్ స్నేహితుడి వద్ద ఉద్యోగం సంపాదిస్తాడు . ఆ స్నేహితుడు గంగ మీద కన్నేసి మోసంతో ఆక్రమించుకుంటాడు . ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతూ ఉంటుంది గంగ .

ఇవన్నీ చాలదన్నట్లు గంగను తార్చడానికి ప్రయత్నించిన బాసుని చంపేస్తుంది గంగ . లాయరయిన కాంచన గంగ తరఫున కోర్టులో వాదించి గంగను నేరారోపణ నుండి కాపాడుతుంది . తనను కంటికి రెప్పలాగా సంరక్షించిన ఆటో డ్రైవర్ జయసింహను కాంచన పెళ్లి చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది .

చక్రవర్తి చాలా శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు . BGM కూడా చాలా బాగుంటుంది .‌ డైలాగ్స్ వినిపిస్తాయి . బృందావనముంది యమునా నది ఉంది పాటకే నంది అవార్డు వచ్చింది . వనితా లతా కవితా మనలేవు లేక జత పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా , ఓ ప్రియతమా నా గగనమా , ఓహో శ్రీమతి కాంచనా పాటలు హిట్టయ్యాయి కూడా .

సినిమాకు షీరో సరితయే . కోర్ట్ సీనులో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది . ఆమెను కంటికి రెప్పలాగా సంరక్షించే పాత్రలో శరత్ బాబు , కాంచనను ప్రేమించి గంగ వలలో ఇరుక్కుని గందరగోళంలో పడే పాత్రలో చంద్రమోహన్ , గ్లామర్ డాల్ గా స్వప్న , విలన్ బాసుగా ప్రతాప్ పోతన్ చాలా బాగా నటించారు .

ఇతర ప్రధాన పాత్రల్లో అన్నపూర్ణ , రమణమూర్తి , సుత్తి జంట , కృష్ణవేణి , ప్రభృతులు నటించారు .
విజయా , సురేష్ సంస్థల్లాగానే కధ , స్క్రీన్ ప్లేల మీద ఎక్కువ శ్రధ్ధ చూపే సినిమా సంస్థ రామోజీరావు గారి ఉషాకిరణ్ మూవీస్ .

ఏ వ్యాపారమయినా పకడ్బందీగా ప్లాన్ చేయటంలో దిట్ట . Of course , ఆయనకూ న్యూస్ టైం లాంటి వైఫల్యాలు లేకపోలేదు . మొత్తం మీద ఆయన most successful self-made entrepreneur . ఈ సినిమా వారి సంస్థ నుండే .

It’s a decent romantic , drama-filled , neat movie . యూట్యూబులో ఉంది కానీ ఒకే పీసుగా లేదు . పార్ట్స్ పార్ట్సుగా ఉన్నాయి . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడతగ్గ నీట్ సినిమా . చూడండి .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు …

సరిత



ఇక్కడే సరిత గురించి రెండు మాటలు… గుంటూరు జిల్లా మునిపల్లెలో పుట్టింది, పేరు అభిలాష… డార్క్ షేడ్, పొట్టి, కాస్త లావు… ఇవేవీ ఆమెకు అడ్డురాలేదు… కమలహాసన్ వంటి హీరోతోనూ జతకట్టింది… కానీ ఎందుకో తనే నటన నుంచి దూరం జరిగి, పూర్తిగా డబ్బింగ్ మీదే దృష్టి పెట్టింది… వైవాహిక జీవితంలోనూ చేదు అనుభవాలున్న ఆమెది సౌత్ ఇండస్ట్రీలో ఓ ఇంట్రస్టింగ్ పేజీ … ఇద్దరితో ఆమె విడాకుల మీద ఓ చిన్నపాటి పుస్తకమే రాయొచ్చునంటారు…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • లోకేష్‌కు రాధాకృష్ణ సర్టిఫికెట్… తమరిక తప్పుకోవాలి బాబు గారూ…
  • అదెలా..? కేసీయార్‌కు నోటీసులిస్తే తెలంగాణకు ఇచ్చినట్టేమిటి..?!
  • ఫాఫం సాక్షి… నానాటికీ ప్రమాణాల ఖుర్బానీ… ఇదీ ఓ ఉదాహరణ…
  • హమ్మో… ఆ పాత నాగదుర్గ కాదు… ‘దారిపొంటచ్చి’ దడపుట్టించింది…
  • తేడా లేని పాటలు… నటిగా అదే జయప్రద… బాపు ఫెయిల్… దాసరి హిట్…
  • ఆ పదం వినగానే యూనిట్ మొత్తం కకావికలై పరుగులు తీసింది…
  • ఆయన ఆ జడ్జిని చూపిస్తే… ఈయన పోటీగా మరో జడ్జిని ప్రవేశపెట్టాడు…
  • మరో జలియన్‌ వాలాబాగ్… పాకిస్థాన్ ఆర్మీ ఘాతుకం… ఢాకా గుడి కథ..!!
  • ప్రపంచ సుందరి కిరీటపు ధగధగల వెనుక… కన్నీళ్లు, కష్టాలు…
  • ‘‘అబ్బో, ఆమె చాలా కాస్ట్‌లీ అట, ఎక్కువ డిమాండ్ చేస్తుందంటున్నారు…’’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions