Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాంచనసీత..! ఏదో ఓ పురాణగాథను వర్తమానీకరించడం దాసరికి అలవాటే..!

December 22, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. మహిళలు మెచ్చిన , మహిళలకు నచ్చిన సినిమా . జయసుధ స్వంత సినిమా 1988 లో వచ్చిన ఈ అభినవ సీత సినిమా . 13 కేంద్రాలలో వంద రోజుల పోస్టర్ పడిన దాసరి మార్క్ సినిమా .

ఉత్తర రామాయణంలో మనకు కాంచన సీత పాత్ర వస్తుంది . రాజారాముని రాజ్యంలో ఒక పౌరుడు లంకలో ఉన్న సీతమ్మ శీలం గురించి ఏదో అన్నాడని గర్భవతిగా ఉన్న ఆమెను అడవి పాలు చేసాడు రాముడు .
ఇంతవరకే ఉత్తర రామాయణంలోని కధను ఉపయోగించుకున్నాడు దర్శకుడు దాసరి నారాయణరావు ,

Ads

కధను నేసిన సత్యమూర్తి . మంచి కధ . ఆదేందంటే : శరత్ బాబు , జయసుధ భార్యాభర్తలు . లాయరయిన శరత్ బాబు వద్దకు ఒక మోసగత్తె వచ్చి తన భర్త మీద తప్పుడు కేసు పెడుతుంది . ఆమె మోసగత్తె అని ప్రసాద్ బాబు చెప్పినా వినకుండా శరత్ బాబు ఆమె తరఫున కేసు వాదించి గెలుస్తాడు .

ప్రసాద్ బాబు కక్షను పెంచుకుని జయసుధను కిడ్నాప్ చేసి ఆమెను ఏమీ చేయకుండా వదిలి వేస్తాడు . సమాజమంతా ఆమెను చెడిపోయిన దానిగా గుసగుసలు చెప్పుకుంటారు . ఖిన్నుడయిన శరత్ బాబు తమ్ముడు రఘువరన్ ద్వారా ఆమెను పుట్టింట్లో వదిలివేసే విధంగా చేస్తాడు .

రఘువరన్ ప్రసాద్ బాబు చేత నిజం కక్కిస్తాడు . శరత్ బాబు ఇంటికి రమ్మన్నా జయసుధ రాధ. ప్రసవించి వితంతువుగా ఒక వితంతు శరణాలయంలో ఆశ్రయం పొందుతుంది . కొడుకు సుధాకర్ ప్రసాద్ బాబు కూతురు తులసిని ఒక రాత్రంతా తన రూంలో బంధించి వదులుతాడు . అవమానంతో తులసి ఆత్మహత్య చేసుకుంటుంది .

kanchana seetha

స్త్రీ లోలుడుగా మారిన కొడుకు మరో అమ్మాయిని మానభంగం చేయబోగా అతడిని చంపేస్తుంది . లాయర్ శరత్ బాబు జడ్జి అవుతాడు . ఈ హత్య కేసు అతని వద్దకే విచారణకు వస్తుంది . ఫ్లాష్ బేక్ లో కధంతా చెప్పబడుతుంది . జడ్జి గారు జయసుధను నిర్దోషిగా తీర్పు ఇస్తాడు . ఉత్తర రామాయణంలో సీతమ్మ భూప్రవేశం చేస్తుంది . ఈ సినిమాలో ఆమె భర్త చేతిలో ప్రాణాలను విడుస్తుంది .

నేసింది సత్యమూర్తే అయినా కధ దాసరి రాసినట్టు అనిపిస్తుంది . మంచి స్కీన్ ప్లేతో , దాసరి మార్క్ నాటకీయతతో సినిమాను బాగా నడిపించారు . డైలాగులను కూడా ఆయనే వ్రాస్తారు కదా ! బాగా వ్రాసారు . అయితే కాంచన సీతగా జయసుధను ఎస్టాబ్లిష్ చేయలేకపోయారేమో అని అనిపిస్తుంది .

సినిమాకు షీరో జయసుధే . గొప్పగా నటించింది . అలాగే శరత్ బాబు , రఘువరన్లు కూడా . ఇతర పాత్రల్లో రావి కొండలరావు , పుష్పలత , వరలక్ష్మి , తులసి , నిర్మలమ్మ , సుత్తి వేలు , శ్రీలక్ష్మి , సాగరిక , మిక్కిలినేని , గుమ్మడి , అల్లు రామలింగయ్య , ప్రసాద్ బాబు , భీమేశ్వరరావు , సుధాకర్ తదితరులు నటించారు .

సత్యం సంగీత దర్శకత్వంలో బేక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది . పాటలు కూడా శ్రావ్యంగా ఉంటాయి . ఏమని చెప్పేను నా అన్న గారి మాట , వినండహో లక్ష్మణుడునై తిరగబడి రామాయణం చెప్పనా , చందమామ రారా జాబిల్లి రారా , యవ్వనమన్నది రానే రాదు మళ్ళీ మళ్ళీ అంటూ సాగుతాయి పాటలు . సి నారాయణరెడ్డి , రాజశ్రీ , జాలాది , దాసరి పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , జేసుదాసు శ్రావ్యంగా పాడారు .

సినిమా యూట్యూబులో ఉంది . చూడతగ్గ సినిమాయే . జయసుధ అభిమానులకు చాలా బాగా నచ్చుతుంది .
నేను పరిచయం చేస్తున్న 1201 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చిన్న ఆవిష్కరణలే… చెప్పరాని అవస్థల్ని తీరుస్తాయి… ఇలా…!!
  • గొర్లు, బర్ల దాకా…! కేసీయార్ కరప్ట్ చేయని రంగం ఏమైనా మిగిలిందా..?!
  • “చచ్చావా… బతికావా?”…. చైనాలో సెన్సేషన్ సృష్టిస్తున్న కొత్త యాప్…!
  • ప్రజారాజ్యం పార్టీ పెట్టింది అక్కినేని..! ఎన్నికల్లో పోటీ కూడా చేశాడు..!!
  • భారత్‌కు చరిత్రాత్మక విజయం … అమెరికాకు వ్యూహాత్మక దెబ్బ…
  • కుంతి కోసం, నెత్తుటి మూలాల కోసం… ఓ డచ్ కర్ణుడి అన్వేషణ…
  • పండుగ స్పెషల్ షో అయినా సరే… అదే జబర్దస్త్ మార్క్ బూతు స్కిట్…
  • రాహుల్ ద్వంద్వ పౌరసత్వం… కోర్టులో ప్రస్తుత స్థితి… ఫ్యాక్ట్ చెక్…
  • ఈసారి నిజంగానే చంద్రుడిపై కాలు పెడతారట అమెరికన్లు..!!
  • అమెరికా చుట్టూ అసాధారణ లక్ష్మణరేఖ… 75 దేశాలకు వీసాల నిలిపివేత…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions