.
Subramanyam Dogiparthi …….. కంచుకాగడా… 40 సంవత్సరాల కింద ఆనాటి రాజకీయ , సామాజిక పరిస్థితులను టార్గెట్ చేస్తూ తీయబడిన ఈ సినిమా ప్రస్తుత పరిస్థితులకు కూడా , కాదు కాదు , ప్రస్తుత పరిస్థితులకే ఎక్కువ సూటవుతుంది .
సర్వకాల సర్వావస్థల యందు , సర్వ్యావస్థల యందు సెట్టయ్యేలా తీసారు . ఈ సినిమా కధారచనలో పాలుపంచుకున్న మహారధి , సత్యమూర్తి , కోదండరామిరెడ్డిలను గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి .
Ads
అంతకు మించి AK 47 నుంచి వచ్చే తూటాల కన్నా పవర్ఫుల్ డైలాగులను వ్రాసిన మహారధికి జోహార్లు . అల్లూరి సీతారామరాజు , ఈనాడు , ప్రజారాజ్యం వంటి సినిమాలలోని డైలాగుల కన్నా ఫిరంగుల్లాగా పేలతాయి డైలాగులు . కృష్ణ నటన కూడా . ఆ మూడు సినిమాల లోని నటనను కలిపితే ఈ సినిమా లోని నటన .
ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది . ఆ సినిమాల్లో లేని రొమాంటిక్ పాటలు , వాన పాట , డాన్సులు కూడా ఉన్నాయి కృష్ణకు .
అనగనగా స్వర్ణగిరి అనే ఒక రాజ్యం . ఆ రాజ్యంలో సుప్రీంని మభ్యపరిచి జనరల్ కొందరు ఫ్యూడలిస్టులను , కేపిటలిస్టులను , కబ్జాదారులను అడ్డం పెట్టుకుని రాజ్యాన్ని , ప్రజలను దోచేస్తుంటారు . విక్రం (కృష్ణ) అమాయక ప్రజల్ని సంఘటిత పరిచి జనరల్ని , అతని వందిమాగధులను మట్టి కరిపించి కంచు కాగడా ఎగరేస్తాడు .
అన్ని సినిమాల్లో గ్లామర్ డాల్ గానే కనిపించే శ్రీదేవి ఈ సినిమాలో విప్లవకారిణిగా అద్భుతంగా నటించింది . ఫైట్లు కూడా చేసింది . ఆ నటనతో పాటు డాన్సుల్లో కూడా రంజింపచేసింది . జనరల్ గా రావు గోపాలరావు నటన సూపర్బ్ . మరో గొప్ప పాత్ర రాళ్ళపల్లిది . తన పాటలతో , డప్పుతో ప్రజల్లో చైతన్యం కలిగించే పాత్ర . సత్యమూర్తి , అదృష్ట దీపక్ లు ఉత్తేజపరిచే పాటల్ని వ్రాసారు .
ఇతర ప్రధాన పాత్రల్లో జగ్గయ్య , ప్రభాకరరెడ్డి , అల్లు రామలింగయ్య , సుత్తి వీరభద్రరావు , కాంతారావు , శ్రీధర్ , గిరిబాబు , గుమ్మడి , నిర్మలమ్మ , సుత్తి వేలు , నాగేష్ , ప్రసాద్ బాబు , శ్రీలక్ష్మి , ప్రభృతులు నటించారు . ప్రత్యేకంగా మెన్షన్ చేయవలసింది మాస్టర్ అర్జున్ని . చక్కగా , ముద్దుగా నటించాడు . కృష్ణ సినిమాలంటే సాధారణంగా భారీ తారాగణం ఉండాల్సిందేగా !
ఈ సినిమా ఘన విజయానికి మరో ప్రధాన కారకుడు చక్రవర్తి . విప్లవ గీతాలకు ఎలా అదిరిపోయే సంగీతాన్ని అందించారో , అలాగే డ్యూయెట్లకు సున్నితమైన సంగీతాన్ని రొమాంటిగ్గా అందించారు . వాన పాట వైశాఖ మాసాన వయసొచ్చేనమ్మా ఆషాఢ మాసాన వానొచ్చేనమ్మా వేటగాడు సినిమా గుర్తుకొస్తుంది . కోదండరామిరెడ్డి చిత్రీకరణలో రాఘవేంద్రరావు కనిపిస్తాడు .
తుమ్మెద మంత్రం చదువుతు ఉంటే కోయిల మేళం వాయిస్తుంటే , సింగారి సిగ్గే అందం డ్యూయెట్లు , చీకట్లో శ్రీరామా వాకిట్లో జయరామా కేసినోలో డాన్స్ పాట హుషారుగా ఉంటాయి . ఒక మజిలీ వేసుకో మామా ఈ బిజిలీ నీదిరా మామా పాటలో శ్రీదేవిని చాలా అందంగా చూపారు కోదండరామిరెడ్డి .
అదృష్ట దీపక్ వ్రాసిన కదం తొక్కి కదులుతోంది కంచుకాగడా కదనానికి సాగుతోంది క్రాంతి బావుటా చాలా ఎర్రగా ఉంటుంది . అలాగే ప్రజారాజ్యమంట ఇది ప్రజారాజ్యమంట , ఉదయించాడో సూర్యుడు నీకోసం ఎర్ర పాటల్ని రాళ్ళపల్లి మీద చాలా బాగుంటాయి . పాటల్ని వేటూరి , అదృష్టదీపక్ , సత్యమూర్తిలు వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , శైలజలు శ్రావ్యంగా పాడారు .
తలకోన అడవుల్లో , బెంగుళూరు పేలసులో షూట్ చేయబడిన ఈ సినిమాను నిర్మాత రామలింగేశ్వరరావు భారీ ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా తీసారు . కోదండరామిరెడ్డి పరుగెత్తించారు . ప్రేక్షకుడిని ఊపిరి కూడా పీల్చుకోనివ్వడు . సూపర్ హిట్టయింది కూడా . సలీం , తారలు డాన్సుల్ని బాగా కంపోజ్ చేసారు .
గుంటూరులో కృష్ణా పిక్చర్ పేలసులో ఆడింది . ఈ సినిమా విడుదలకు ముందు కృష్ణ అభిమానులకు , యన్టీఆర్ & తెదేపా అభిమానులకు రాజకీయ ఘర్షణ ఏర్పడింది . విజయవాడ యువరాజ్ , రాష్ట్రంలో మరికొన్ని థియేటర్ల వద్ద 144 సెక్షన్ని విధించి రిలీజ్ చేసారు .
కృష్ణ , శ్రీదేవి అభిమానులే కాదు , రాజకీయ సామాజిక స్పృహ ఉన్న పౌరులందరూ అప్పుడప్పుడు యూట్యూబులో ఈ సినిమాని చూస్తుండాలి . ఆర్థిక దోపిడీ , స్వేఛ్ఛాస్వాతంత్ర్యాల హరణ , పౌర హక్కుల ఉల్లంఘన , చట్టాల దుర్వినియోగం వంటి ఎన్నో ఆలోచింపచేసే విషయాలు ఉన్నాయి .
It’s a thought-provoking , inspiring , impelling , action-oriented , socially and politically relevant movie . An unmissable movie . Hats off to Krishna , Sridevi , Kodandarami Reddy , Ramalingeswara Rao , Maharadhi , Satyamurthy , Adrushta Deepak and everyone associated with this great movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article