.
Paresh Turlapati …… బం చిక్ బం చిక్ చెయ్యి బాగా… వొంటికి యోగా మంచిదేగా…
శంషాబాద్ దగ్గర రామచంద్ర మిషన్ వారిచే నడపబడుతున్న కన్హ శాంతివనం మెడిటేషన్ సెంటర్ చూద్దామని వెళ్ళాం… మొత్తం 1400 ఎకరాల స్థలంలో నిర్మాణాలు చేశారు
Ads
లోపల శాశ్వతంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని కొంతమంది ఉంటే.. వెల్నెస్ సెంటర్లో మెడిటేషన్ చేయడానికి తాత్కాలికంగా రూముల్లో దిగినవాళ్ళు కొంతమంది ఉన్నారు
ఇక పొద్దున విజిటింగ్ కు వచ్చి సాయంత్రం వెళ్ళిపోయే నాలాంటి వాళ్ళు వందల మంది ఉంటారు. విజిటింగ్ టైమింగ్స్ ఉదయం 9 గంటలనుంచి సాయంత్రము 5 గంటల వరకు
ఎంట్రీ ఫ్రీ …. విజిటింగ్ కోసం వచ్చేవాళ్ళు మాత్రం వెహికల్స్ బయటే పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేముందు కౌంటర్లో ఫ్యామిలీకి ఒకరి ఆధార్ కార్డు స్కాన్ చేసుకుని, ఫోటో తీసుకుని, ఐడి కార్డ్ ఇచ్చి లోపలికి పంపుతారు
మేమూ అలాగే వెళ్ళాం
లోపలికి వెళ్ళగానే ఎదురుగా కనిపించే మెడిటేషన్ సెంటర్లో మమ్మల్నందరిని కూర్చోబెట్టారు. ఐడి కార్డ్ వేసుకున్న ఓ కుర్రాడు వచ్చి, అందర్నీ నవ్వుతూ పలకరించి మెడిటేషన్ వల్ల మనకు కలిగే లాభాలను బ్రీఫ్ గా చెప్పి మాచేత షుమారు 45 నిమిషాలు ధ్యానం చేయించాడు.
ఆ కుర్రాడ్ని అడిగితే తను ఇక్కడే పర్మనెంట్ గా ఉండిపోయి, వచ్చేవాళ్ళ చేత మెడిటేషన్ చేయిస్తుంటానని నవ్వుతూ చెప్పాడు. చిన్న వయసులోనే ఈ మార్గం ఎంచుకున్నాడు అనిపించింది. ఇక అక్కడ ధ్యానం ముగించుకుని బయటికి వచ్చి బ్యాటరీ కారులో సైట్ సీయింగ్ కు బయలుదేరాం
అతగాడు సైట్ విశేషాలు ఏవన్నా చెప్తాడేమోనని చూస్తే డ్రైవరు హిందీ మనము తెలుగు. హైదరాబాద్ విజయవాడ బస్ వాళ్ళు డాబా దగ్గర ఆపినట్టు ఓ క్యాంటీన్ దగ్గర దింపి అతగాడు వెళ్లిపోయాడు.
క్యాంటీన్ విశాలంగా బావుంది అనిపించింది కానీ తర్వాత తెలిసింది, రేట్లు కూడా విశాలంగానే ఉన్నాయని
కాఫీ 25 … టీ 15 రూపాయలు
సింగిల్ ఇడ్లీ 15 రూపాయలు
ఇవి కాక ఇంకా రిచ్చు కూడా చాలా ఉన్నాయి
ఇక్కడ నాకు ఒక విషయం అర్ధం కాలేదు
సాత్విక ఆహారం మన జీవన విధానంలో శరీరం మీద ఆలోచనల మీద ప్రభావం చూపిస్తుందని నేను నమ్ముతాను
మనసు సరైన ఆలోచనల దిశగా సాగి ధ్యానంలోకి చేరుకోవడానికి తీసుకునే ఆహారం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది
మరి ఇలాంటి వెల్నెస్ సెంటర్లో బజ్జీ పుణుగుల దగ్గర్నుంచి పానీ పూరీ చాట్ వరకు అన్ని రకాలు అందుబాటులో ఉంచారు. ఈ ఏర్పాటు కొద్దిగా కమర్షియల్ గా అనిపించింది. మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో ఉడకబెట్టిన కాయగూరలే ఇస్తారని విన్నాను
సరే, ఇదిలా ఉంటే లోపల తిరగటానికి విజిటర్స్ వెహికల్స్ అనుమతించరు కదా. అందుకోసం బ్యాటరీ కార్లు ఏర్పాటు చేసినా అవి కూడా ఒకటో రెండో పరిమితంగా కనిపించాయి. అన్చేత లోపల చాలా దూరం నడవాల్సి వచ్చింది
ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన నిర్వాహకులు మరిన్ని బ్యాటరీ కార్లు ఏర్పాటు చేస్తే దూర ప్రాంతాల నుంచి వచ్చే వృద్దులు మహిళలు ఇబ్బంది పడకుండా ఉంటారు
మేమూ అలాగే నడుచుకుంటూ లోపల గొడుగు ఆకారంలో నిర్మించిన పెద్ద పెద్ద మెడిటేషన్ హాళ్లను చూశాం
కానీ ఎందుచేతనో తెలియదు కానీ అవన్నీ ఖాళీగానే కనిపించాయి
అక్కడ ఏమన్నా అడుగుదామన్నా చెప్పేవాడు లేడు
ఒకరిద్దరు గైడ్ లను పెడితే విజిటర్స్ కు ఉపయోగకరంగా ఉంటుంది
అలాగే లోపల నర్సరీ కూడా ఉంది. రేట్లు మాత్రం బయట నర్సరీలలో ఉన్న రేట్లే
లోపల నివాసం ఉన్న వాళ్ళ కార్లు మాత్రమే అనుమతించినా హారన్ కొట్టకూడదు.. 20 కిలోమీటర్ల కంటే స్పీడ్ లో వెళ్ళరాదు అనే కండిషన్ స్ట్రిక్ట్ గా అమలు చేస్తుండటంతో లోపల రణగొణ ధ్వనులు లేవు. లోపల గ్రీనరీ బావుంది
అప్పటికే టైమ్ సాయంత్రం 5 గంటలు అవడంతో మేము లోపల మొత్తం పూర్తిగా చూడలేకపోయాం. ఏతావాతా కాలుష్యానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో శాంతి వనం ఉంది కాబట్టి విజిటర్స్ కి నచ్చుతుంది అనే అనుకుంటున్నాను. మరిన్ని వివరాల కోసం… https://heartfulness.org/kanha
Share this Article