Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏదో కూశాడు, కొందరు చెప్పులు విసిరారు… హీరోయిజం చంకనాకిపోయింది…

December 19, 2022 by M S R

మాకు బొచ్చెడు ఫ్యాన్ బేస్ ఉంది, ఏం చేసినా చెల్లుతుంది, మేం దైవాంశ సంభూతులం, మేం తోపులం అనుకునే తలతిక్క కేరక్టర్లు టాలీవుడ్‌లో మాత్రమే కాదు, ప్రతి భాష సినిమా ఇండస్ట్రీలోనూ ఉంటారు… ఉన్నారు… దర్శన్ అని కన్నడంలో ఓ హీరో, నిర్మాత,  డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు… పర్లేదు, పాపులర్ హీరోయే… ఈమధ్య క్రాంతి అనే సినిమా తీశాడు… దాని ప్రమోషన్ కోసం హొస్పేటలో ఫంక్షన్‌లో పాల్గొన్నాడు… ఆ సందర్భంగా ఎవరో తన మీద చెప్పులు విసిరారు… తన భుజానికి తగిలింది ఓ స్లిప్పర్…

దాంతో సోకాల్డ్  DBoss ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు… సమయానికి ‘‘పర్లేదు, చిన్నదేగా’’ అని సదరు హీరోగారు చెబుతూ పోలీసు రక్షణలో వెళ్లిపోయాడు… దాంతో ఫ్యాన్స్ కాస్త చల్లబడ్డారు… లేకపోతే ఘర్షణ చోటుచేసుకునేది… ఎందుకంటే..? కొద్దిరోజులుగా హొస్పేటలో పునీత్ రాజకుమార్ ఫ్యాన్స్‌కూ ఈ దర్శన్ ఫ్యాన్స్‌కూ నడుమ కోపాలు రగులుతున్నయ్…

మా అప్పు మీద ఈ దర్శన్ ఏవో పిచ్చి వ్యాఖ్యలు చేశాడనీ, అవమానించాడనీ పునీత్ ఫ్యాన్స్ ఆగ్రహం… హొస్పేటకు ఎలా వస్తాడో చూస్తామంటూ బీరాలు, ఖచ్చితంగా రావల్సిందే సార్ అంటూ దర్శన్ ఫ్యాన్స్ ఒత్తిడి… మరణించిన పునీత్ మీద దుర్భాషలు దేనికి మరి..? ఈ పిచ్చి ఘర్షణలకు ఆజ్యం పోయడం ఎందుకు మరి..?

Ads

darshan

ఇవన్నీ సరే, ఈ దర్శనుడి చరిత్ర ఏమిటని కాస్త చెక్ చేస్తే… అబ్బో, మోస్ట్ కంట్రవర్సీ ఫెలో… 2011లోనే భార్య గృహహింస కేసు పెడితే పరప్పన అగ్రహార జైలులో 14 రోజులు ఉండాల్సి వచ్చింది… తరువాత కోర్టు బయట పరిష్కారంతో బయటపడ్డాడు… నన్ను క్షమించండబ్బా అని ఫ్యాన్స్‌కు బహిరంగ క్షమాపణ చెప్పుకున్నాడు… ఆమే మళ్లీ 2016లో కూడా పోలీసులను ఆశ్రయించింది… ఈసారి ఆరోపణ ‘‘అనుచిత ప్రవర్తన’’… మైసూరులో ఓ దళిత వెయిటర్‌ మీద చేయిచేసుకున్నాడు… భరత్ అనే ఫిలిమ్ ప్రొడ్యూసర్ దర్శన్ తన అంతు చూస్తానని బెదిరిస్తున్నట్టు పోలీసు కేసు పెట్టాడు… రికార్డు కానివి ఎన్నో…

కార్లు, బైకులంటే క్రేజ్ ఉన్న దర్శనుడికి సొంత మినీ జూ కూడా ఉంది… మైసూరుకు కాస్త దూరంలో ఉండే మాలవల్లి దగ్గర అడవిలో ఉంటుంది అది… నిజంగా అది జూయేనా..? లేక సల్మాన్ ఖాన్ తరహా వేషాలకు అది కవరింగా..? సరే, ఇవన్నీ ఎలా ఉన్నా… ఈ స్లిప్పర్‌తో భంగపాటు వీడియో మాత్రం బాగా వైరల్ అయిపోయింది… భలే ఉన్నారుర మీరు… బహిరంగ వేదికలకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలియకపోతే ఎలా..?! ఒకే సందేహం… అప్పును ప్రేమించేవాళ్ల సంఖ్య లక్షలు… ఫ్యాన్స్‌ను పాజిటివ్ సైడే ఉంచుతాడు తప్ప వారిలో విద్వేషాన్ని పెంచేవాడు కాదు… మరి ఈ చెప్పులు విసిరిన అప్పు అభిమాని వెనుక ఇంకెవరున్నారో..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions