Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పొట్టోడిని పొడుగోడు కొడితే… కౌశల్‌ను పోశమ్మ కొట్టింది… బీబీజోడీ నుంచి ఔట్…

March 5, 2023 by M S R

పొట్టోడిని పొడుగోడు కొడితే, పొడుగోడిని పోశమ్మ కొట్టింది అని సామెత… పోశమ్మ అంటే దేవుడు అని…!! బీబీ జోడి షోలో కౌశల్‌కు ఈ సామెత సరిగ్గా వర్తిస్తుంది… అప్పట్లో బిగ్‌బాస్ షోలోనే కౌశల్ పోకడ చాలామంది నచ్చేది కాదు… కాకపోతే అందరూ తనను ఒంటరిని చేశారనే సానుభూతి కొంత, బయటి నుంచి వోటింగులో లభించిన సపోర్ట్ కొంత, వోట్ల కోసం తన టీం అవలంబించిన వ్యూహం కొంత ఫలించి గెలిచాడు… కాకపోతే అందరినీ గెలుకుతూ ఉంటాడు… తనదే రైట్ అంటాడు…

సేమ్, బీబీ జోడీ అనే షోలో చూపించాడు… ఇదీ బిగ్‌బాస్ నిర్మాతలు ప్రసారం చేస్తున్న షోయే… బిగ్‌బాస్ కంటెస్టెంట్లుగా ఉన్న వాళ్లతో కొన్ని జంటలు ఏర్పాటు చేసి, డాన్స్ పోటీ పెట్టడం ఈ షో ఉద్దేశం… కష్టపడుతున్నారు, నేర్చుకుంటున్నారు, ప్రొఫెషనల్ డాన్సర్లకు దీటుగా పర్‌ఫామ్ చేస్తున్నారు అందరూ… కానీ కౌశల్ ఒక్కడే తేడా… కాకపోతే అభినయ తనకు జోడిగా ఉండటం తనకు ప్లసయింది కొంత…

ఆమె ప్రొఫెషనల్ డాన్సర్… మంచి ఈజ్ ఉంటుంది… ఆమె పక్కన ఉండి డాన్స్ చేయడం కౌశల్ మైనస్ పాయింట్లను కప్పేసింది… తనేమో మార్కులు ఇచ్చేటప్పుడు అందరికీ వంకలు పెడుతుంటాడు… అందరూ బాగుంది అంటే తను బాగా లేదు అంటాడు… దీంట్లో గ్రేస్ ఏది..? ఫైర్ ఏది..? ఎనర్జీ ఏది..? అని తప్పులు తీస్తుంటాడు… షోలోని ప్రతి కంటెస్టెంటుకూ కౌశల్ చూపే సాకులు, పెట్టే వంకలపై విపరీతమైన అసహనం ఉంది… కానీ ఏమీ అనలేరుగా…

kaushal

ఫైమా, తేజస్వి వంటి వాళ్లు అడిగితే నా వయస్సు 40… నా ఫైర్ ఇంతే అనేవాడు… వాళ్లు తలకొట్టుకుని వదిలేసేవాళ్లు… నిజానికి కౌశల్ పదే పదే అఖిల్, తేజస్వి జంటను టార్గెట్ చేసినట్టుగా కనిపించింది… ఆ జంట మాత్రమే కాదు, అవినాష్-అరియానా, మెహబూబ్-శ్రీసత్య కూడా బాగానే చేస్తున్నారు… అసలు అర్జున్- వాసంతి అయితే టాప్ పర్‌ఫార్మర్స్… వీరందరి నడుమ కౌశల్ నథింగ్… ఫినాలే వచ్చేలోపు ఇంకా ఎన్ని వేషాలు వేస్తాడో అని అందరూ భయపడుతున్న దశలో…

ఆదివారం మెహబూబ్-శ్రీసత్య జంటతో ఫేస్ ఆఫ్ పడింది కౌశల్- అభినయ జంటకు… అంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోవాల్సిందే… ఈ స్థితిలో అభినయకు ఎక్కడో కాలు బెణికింది… అడుగులే వేయలేని స్థితి… ఇక్కడా కౌశల్ సింపథీ గెయిన్ చేసి, పోటీలో ఉండాలని ప్రయత్నం చేశాడు… తను కుర్చీలో కూర్చుంటుంది, నేనొక్కడినే పర్‌ఫామ్ చేస్తాను అంటాడు…

నటి, జడ్జి రాధ బ్లంటుగా రిజెక్ట్ చేసింది… బీబీ జోడి అంటేనే జంటలు పోటీపడాలి… ఒక్కడివే చేసే పక్షంలో అది బీబీ జోడి ఎలా అవుతుందని అనడిగింది… బ్యాడ్ లక్, ఆమె డాన్స్ చేయలేకపోవడం, నువ్వు యాక్సెప్ట్ చేయాలి, వైదొలగాలి అని నిష్కర్షగా చెప్పింది… అభినయ కూడా నిజమే మేడం అంటూ ఎలిమినేట్ అవుతున్నట్టు అంగీకరించింది… మొహం మాడ్చుకుని కౌశల్ కూడా పోటీ నుంచి నిష్క్రమించాడు… పోశమ్మ కొట్టింది…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
  • ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
  • Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
  • రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
  • ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
  • FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
  • ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
  • 186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
  • థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
  • కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions