.
ఒక సోషల్ పోస్టు కనిపించింది,.. వెలమల్ని కూడా బీసీల్లో కలపాలని కేసీయార్ బిడ్డ కవిత డిమాండ్ చేసిందని వేటున్యూస్ వార్త ప్రచురించిందనేది ఆ పోస్టు…
అది ఫేక్ అని చూడగానే అర్థమవుతుంది… ఆమెకు ధనకాంక్ష, అధికార కాంక్ష ఉండవచ్చుగాక… కానీ తెలివి లేనిది కాదు… వెలమల్ని, అదీ తమ సొంత అగ్రవర్ణాన్ని బీసీల్లో కలపాలని డిమాండ్ చేయడం నమ్మబుల్ కాదు…
Ads
కావాలని కవిత మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఉద్దేశించిన ఫేక్ పోస్టు అది… ఏ కనుగోలు సునీల్ టీమో, మరే ఇతర కాంగ్రెస్ సోషల్ మీడియా టేమో చేసి ఉంటుంది… సరే వర్తమాన సోషల్ రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణం అయిపోయాయి… సోషల్ మీడియా అంటేనే ఫేక్ పోస్టులు కదా ఇప్పుడు…
ఐతే… కవిత రాజకీయాల ధోరణే విచిత్రం… అప్పుడప్పుడూ మరో షర్మిల అనిపిస్తుంటుంది… దొందూ దొందే… లిక్కర్ స్కాములో నిండా మునిగినప్పుడు జై తెలంగాణ అంటూ, తెలంగాణ తలవంచదు అంటూ తన స్కాముకు తెలంగాణతనాన్ని ముడిపెట్టడం చిరాకు తెప్పించింది… డబ్బు కోసం నానా అడ్డదార్లూ తొక్కి, తనేదో వీర తెలంగాణ వనిత అన్నట్టు, ఆ మద్యం కుంభకోణం కూడా తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం అన్నట్టు కలరింగు ఇవ్వడాన్ని యావత్ తెలంగాణ సమాజం ఏవగించుకుంది… తనకున్న ఫీడ్ బ్యాక్ ఏమిటో గానీ..!!
అప్పట్లో మహిళా రిజర్వేషన్లు, పోరాటం అంటూ అప్పట్లో తను ఓ వీరవనిత అన్నంత ఫోజు, కలరింగు ఇచ్చింది మీడియాలో… మరి తన డాడీ ఎన్ని టికెట్లు ఇచ్చాడు మహిళలకు, తన మొదటి హయాంలో అసలు మహిళకు కేబినెట్‌లోనే చోటు లేదు కదా… అదంతా అటక మీదకు పారేసింది ఇప్పుడు…
తాజాగా బీసీ నినాదం ఎత్తుకుంది… 55 శాతం బీసీలకు రాజ్యాధికారంలో సరైన వాటా దక్కాలనేది న్యాయమైన డిమాండ్… కానీ అది కవిత నోటి వెంట రావడమే అబ్సర్డ్… ఎందుకంటే..? బీసీలకు కేసీయార్ చేసిన న్యాయం ఏముంది రాజ్యాధికారంలో..? కాంగ్రెస్, బీజేపీ దొంగ నాటకాలు ఆడుతున్నాయి బీసీ కోర్కెల విషయంలో అంటోంది ఇప్పుడామె…
వోకే, కానీ పదేళ్ల పాలనలో కవిత డాడీ బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చాడా..? పోనీ, ఎలాగూ రాజకీయ నైతికతను బొందపెట్టి ఫామ్ హౌజులోనే పడుకుంటున్నాడు కదా… తన అధ్యక్ష స్థానాన్ని చురుకైన బీసీ నాయకుడికి ఇవ్వొచ్చు కదా… ఇవ్వడు…
డాడీ, నువ్వు బీసీలకు చేసిన న్యాయం ఏమిటి..? కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సరే, బీఆర్ఎస్ నుంచి నువ్వేం హామీలు ఇస్తావో చెప్పు అని ప్రధానంగా ప్రశ్నించాల్సిది తను డాడీనే కదా… అధికారం ఉన్నప్పుడు ఏమీ ప్రజాస్వామిక ధోరణి ఉండదు… ఇప్పుడు మాత్రం ‘ఆదర్శాల కవరింగులు’…
ఇది చేయాలి, ఇది చేయలేదు అని బీజేపీని, కాంగ్రెస్‌ను అడుగుతున్న ప్రతి సందర్భంలో నీ పార్టీ ఏం చేసిందో మొదట చెప్పు అనే ఉల్టా ప్రశ్న తగులుతుంది… హఠాత్తుగా తెలంగాణతనం, తెలంగాణజనం గుర్తురావడం వోకే, కానీ ఇదెందుకు గత పదేళ్లలో లేదు అనే విమర్శ సూటిగా తనకే తగులుతుంది..!!
ఫామ్ హౌజులో ఏం చేస్తున్నావ్ అధ్యక్షా అని ఒక్క మాటబీఆర్ఎస్ అజ్ఞాత అధ్యక్షుడిని అడిగితే తన రాజకీయ కార్యాచరణకు క్రెడిబులిటీ… అడిగితే బాగుండు..! శుష్క వాదనలు, అసభ్య మాటతీరుతో కేటీయార్ నానాటికీ జనంలో ఆదరణను కోల్పోతున్నాడు కాబట్టి, కాబోయే సీఎంగా కవితనూ తీసిపారేయలేం కాబట్టి… ఆమె కాస్త రీజనబుల్ కార్యాచరణను చూపిస్తే బాగుండు..!!
Share this Article