.
ఒక వార్త… అనుకుంటే ఇంట్రస్టింగు… లేకపోతే లేదు… వెలుగు పత్రికలో కనిపించిందని ఎవరో షేర్ చేశారు మిత్రులు… వార్త సారాంశం ఏమిటంటే..?
150 ఎకరాల పెద్ద రైతు కేసీయార్ తన వ్యవసాయ క్షేత్రంలో ఇన్నాళ్లూ వరి, మొక్కజొన్న, కూరగాయలు సాగు చేసేవాడు… ఇప్పుడు మొత్తం 150 ఎకరాల్లోనూ వెదురు సాగు చేయనున్నాడు…
Ads
ఇప్పటికే కొంత ఏరియాలో ప్లాంటేషన్ అయిపోగా, మిగతా మొత్తం పొలంలోనూ ఏర్పాట్లు చేస్తున్నారు… డ్రిప్ ఇరిగేషన్ కోసం పైపులైన్ కూడా వేస్తున్నారు… గతంలో కేప్సికమ్ వేసేవాడు కదా, తరువాత మొక్కజొన్ని, వరి వైపు మళ్లాడు…
ఇప్పుడు ఆ కోతలు అయిపోవడంతో ఇక మొత్తం వెదురు వేస్తున్నాడు… ఒకసారి నాటితే 50, 60 ఏళ్ల వరకూ ఢోకా లేదట… 3, 4 ఏళ్లకోసారి కోత, దిగుబడి… ఫామ్ హౌజ్ పక్కనే కొండపోచమ్మసాగర్ ఉంది కదా, సాటునీటికి కూడా ఢోకా లేదు…
ప్రస్తుతం వెదురు డిమాండ్‌కు సరిపడా సప్లయ్ లేదు, పైగా ఇప్పుడు తక్కువ ధరకే మొక్కలు దొరుకుతున్నాయి… అంతరపంటలుగా అల్లం, పసుపు, మునగ వేయవచ్చునట… టన్ను వెదురు 4 వేల దాకా పలుకుతుండగా, ఎకరానికి 40 టన్నుల కనీస దిగుబడి వచ్చే అవకాశముంది…
ములుగులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ వెదురు సాగును ప్రోత్సహిస్తూ రైతులకు మెళకువల్ని, జాగ్రత్తల్ని నేర్పిస్తోంది… అదీ కేసీయార్ ఫామ్ హౌజుకు సమీపంలోనే ఉంటుంది… సో, ఇదండీ వార్త సారాంశం…
రాజకీయ జీవితంలో అజ్ఞాతంలో ఉండిపోవడంలోని నైతిక ప్రశ్నల మాటెలా ఉన్నా… ఇప్పుడెలాగూ తను ప్రజాజీవితంలో లేడు కదా… కుర్చీ దించేశారు కదాని తెలంగాణ సమాజం మీద, ప్రజల మీద అలిగాడు కదా… సో, తన 150 ఎకరాల వ్యవసాయ క్షేత్రం మీద కాన్సంట్రేట్ చేస్తున్నాడేమో… బడా నాయకులు, అధికారులు, వ్యాపారుల వ్యవసాయ క్షేత్రాల నుంచి వచ్చే దిగుబడి వారి ఆదాయాన్ని వైట్ చేయడానికి కదా ఉపయోగపడేది…
అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం… ఎలాగూ ప్లాంటేషన్స్ కొంత పెరిగేవరకు జాగ్రత్తగా చూసుకోవడానికి కేసీయార్‌కు కావల్సినంత తీరిక… అందుకని ఈ వార్త కాస్త ఇంట్రస్టింగు… అబ్బే, ఇందులో ఏముందండీ, రాష్ట్రంలో బోలెడు మంది ధనిక రైతులున్నారు, ఆధునిక వ్యవసాయ విధానాలతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు అంటారా…? అయితే వాకే..!!
Share this Article