తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్
జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేసిన కేసీఆర్
కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్న కేసీఆర్
Ads
నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందన్న కేసీఆర్
జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ల పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న కేసీఆర్
ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్జీ విభాగం
…… ఇదీ తాజా వార్త… చిక్కుముడి మరింత బిగుసుకుంటూ ఉన్నట్టుంది… నేను పోరాడుతున్నాను, నేను ఫైటర్‌ను అని గప్పాలు పలికి, మాటికి ఓసారి జైతెలంగాణ అంటూ, అక్కడికి మద్యం స్కాం కూడా తెలంగాణ ప్రజల కోసమే అన్నట్టుగా కలరింగు ఇచ్చిన, ఇవ్వడానికి ప్రయత్నం చేసిన కవిత ఇప్పటికి 100 రోజులుగా తీహార్ జైలు నుంచి మళ్లీ బయటికి రాలేదు…
ఇప్పుడిక కేసీయార్ వంతా…? అసలే కాళేశ్వరం, ఫోన్ ట్యాంపరింగ్ తదితర కేసుల్లో నిండా మునిగే ప్రమాదం కనిపిస్తున్న కేసీయార్ తనంతట తను మరింతగా ఊబిలోకి దిగబడిపోతున్నాడా..? అదే అనిపిస్తోంది… సరే, మనకున్న సాధారణ పరిజ్ఙానం మేరకే చెప్పుకుందాం…
ఒక ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాల మీద ఏదైనా కమిషన్ ఏర్పాటు చేస్తే, దానికి ఎవరైనా రిటైర్డ్ జస్టిస్‌లను నియమిస్తే… అందులో తప్పుపట్టడానికి ఏముంటుంది..? ఏ కోర్టయినా ఏం చెబుతుంది..? తప్పు చేయకపోతే నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకొండి అంటుంది… అంటుందనే అనుకుందాం… మరి కేసీయార్ హైకోర్టుకు ఎందుకు వెళ్లినట్టు..?
టైమ్ కిల్లింగా..? ఇక్కడి నుంచి సుప్రీం… కానీ ఎక్కడి దాకా..? విద్యుత్తు అంశాలపై ఏర్పాటు చేయబడిన కమిషన్‌కు కూడా నేతృత్వం ఒక హైకోర్టు రిటైర్డ్ జడ్జే కదా… తను లీగల్ పాయింట్లన్నీ ఆలోచించి, మథించాకే ఆ కమిషన్ పోస్టుకు అంగీకరించి ఉంటాడు కదా…
పైగా కేసీయార్ చెబుతున్నట్టు ఇందులో సహజ న్యాయసూత్రాలు అనే పాయింట్ ఎక్కడా తగలదు… ఎందుకంటే, కొన్ని వేల వేల కోట్ల రూపాయల ప్రజాధనానికి సంబంధించిన అంశం… ఒక ప్రాంత సమూహానికి, సమాజానికి సంబంధించిన ఇష్యూ… నిజంగానే తెలంగాణ ప్రయోజనాల కోసమే కేసీయార్ నిర్ణయాలు అనుకునే పక్షంలో తను అంతగా వెరవాల్సిన అవసరం లేదు… తను నర్సింహారెడ్డి తనకు వ్యతిరేకమనే భావనలో ఉండి, ఇలా వ్యవహరిస్తున్నాడా..?
అంతటి చంద్రబాబు సైతం అదేదో విచారణ ఎదుట హాజరై, ఓ చెక్క బెంచీ మీద కూర్చుని… విచారణ కమిషన్ల పరిధిని గౌరవించాడు గతంలో… అదే అనుసరణీయం… నో, మీ కమిషనే చట్టవిరుద్ధం, నేను హాజరుకాను, ఏం చేసుకుంటారో చేసుకొండి అని మొరాయిస్తే… చట్టం కూడా తన పని తాను చేసుకుంటూ పోతుంది… అప్పుడు చిక్కుముడి మరింత బిగుసుకుంటుంది…!!
Share this Article